ఆటాపోటీ

ఐసిసిలో మార్పుల సునామీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) 1909 జూన్ 15వ తేదీన ఏర్పడింది. సరిగ్గా నెల రోజుల తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులు అధికారికంగా ఐసిసిలో శాశ్వత సభ్యత్వాన్ని పొందాయి. 1936 మే 31న భారత్, న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లు చేరాయి. 1953 జూలై 28న పాకిస్తాన్, 1981 జూలై 21న శ్రీలంక, 1992 జూలై 6న జింబాబ్వే, 2000 జూన్ 26న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులకు ఐసిసిలో చోటు లభించింది. ఈ పది దేశాలకు ఐసిసిలో శాశ్వత సభ్యత్వం ఉంది. వీటినే టెస్టు హోదా ఉన్న దేశాలుగా పేర్కొంటారు. వీటికి పూర్తి స్థాయి సభ్యత్వం ఉంది. మరో 36 దేశాలకు అసోసియేట్, 60 దేశాలకు అఫిలియేటెడ్ సభ్యత్వాలున్నాయి. మొత్తం మీద ఐసిసిలో ఇంత వరకూ 106 దేశాలు ఏదో ఒక హోదాలో ఉన్నాయి.

అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం. ఫిబ్రవరిలో జరిగిన పాలకమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు సర్వసభ్య సమావేశంలో ఆమోద ముద్ర పడితే, ఐసిసి కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. రాబోయే మార్పులతో లాభనష్టాల విషయం ఎలావున్నా, ఇప్పటి వరకూ ‘బిగ్ త్రీ’ దేశాల ఆజమాయిషీ నుంచి ఐసిసికి స్వేచ్ఛ లభిస్తుంది. మండలి ఆర్థిక వ్యవహారాలను తమ గుప్పిట్లో ఉంచుకోవడమేగాక, ఆదాయంలో సింహ భాగాన్ని దర్జాగా తీసుకుంటున్న మూడు దేశాల (్భరత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్) గుత్త్ధాపత్యానికి తెరపడుతుంది. 106 దేశాలున్న ఐసిసిలో శాశ్వత సభ్యత్వం కేవలం పది క్రికెట్ బోర్డులకే ఉన్నాయి. వీటిలో ‘బిగ్ త్రీ’ దేశాలదే హవా. ఈ మూడింటిలోనూ భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మాటకు తిరుగులేదన్నది వాస్తవం. ఐసిసిని కొన్ని దశాబ్దాలపాటు పరోక్షంగా శాసించిన బిసిసిఐ ‘బిగ్ త్రీ’ పేరుతో అధికారికంగా ఆజమాయషీ చేయడం మొదలుపెట్టింది. ఎన్నో సందర్భాల్లో ఐసిసిని వ్యతిరేకించి, రాద్ధాంతం సృష్టించిన బిసిసిఐ సుమారు మూడేళ్ల క్రితం ఐసిసిలో పెను మార్పులకు కారణమై, విమర్శలను ఎదుర్కొంటున్నది. ప్రస్తుతం ఐసిసి చైర్మన్‌గా బిసిసిఐ మాజీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఉన్నాడు. నిజానికి బిసిసిఐతో మనోహర్ తీవ్రంగా విభేదిస్తున్నాడు. కానీ, మిగతా దేశాలు మాత్రం ఐసిసిపై బిసిసిఐ పెత్తనం కొనసాగుతున్నదనే అభిప్రాయంతోనే ఉన్నాయ. ఐసిసికి సుమారు 80 శాతం ఆదాయం భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) నుంచే వెళుతోంది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయ వనరులు ఉన్న క్రీడా సంస్థగా ఎదిగిన బిసిసిఐ చాలాకాలంగా ప్రపంచ క్రికెట్‌ను ప్రత్యక్షంగా, ఐసిసిని పరోక్షంగా శాసిస్తున్నది. ద్రశాబ్దాల తరబడి కొనసాగుతున్న ఈ తంతును మిగతా దేశాలు ఎండగడుతున్నా, ఎన్నడూ పట్టించుకున్న పాపాన పోలేదు. అత్యధిక ఆయాన్ని బిసిసిఐ సంపాదించి పెడుతుంటే, మిగతా 20 శాతాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి), క్రికెట్ ఆస్ట్రేలియా (సిఎ) అందిస్తున్నాయి. మొత్తం మీద ఐసిసిలో పూర్తి స్థాయి సభ్యత్వం పది దేశాలకు ఉంటే, మూడు దేశాలే ఆదాయాన్ని సమకూరుస్తుంటే, మిగతా ఏడు దేశాలు వాటాలు పొందుతున్నాయ. క్రికెట్ అభిమానులు ఎక్కువగా ఉన్న దక్షిణాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్ తదితర దేశాల్లోనూ లభిస్తున్న ఆదాయం తక్కువే. అందుకే ఐసిసి ఆర్థిక వ్యవహారాలన్నింటినీ బిసిసిఐ తన చేతుల్లోకి తీసుకుంది. ఆదాయాన్ని సమ కూర్చడంలో తామదే కీలక పాత్ర కాబట్టి, పంపాల్లోనూ భారీ వాటా తనకే దక్కాలని మొం డిపట్టుపట్టి, చివరికి పంతాన్ని నెరవేర్చుకుంది. తనకు వ్యతిరేకత రాకుండా ముందు జాగ్రత్తగా ఇసి బి, సిఎలను చేర్చుకుంది. కానీ ‘బిగ్ త్రీ’ దేశాల ఆశలు ఫలించలేదు. 2014 నుంచి అమల్లోకి వచ్చిన ఈ విధానాన్ని మిగతా సభ్య దేశాలు ఎండగడుతున్నాయ. దీనికితోడు బిసిసిఐ కోర్టు కేసుల్లో చిక్కుకోవడం, సుప్రీం కోర్టు జోక్యంతో కొత్త పాలనాధికారులు రావడం వంటి పరిణామాలు ఐసిసి వైఖరిని మార్చేశాయ. ‘బిగ్ త్రీ’ దేశాల ఆధిపత్యానికి తెరదించుతామని ఐసిసి చైర్మన్ మనోహర్ ప్రకటించినప్పుడు మిగతా దేశాలతోపాటు, ఈ కూటమిలోని ఇంగ్లాండ్ కూడా హర్షం వ్యక్తం చేసింది. తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో, బిసిసిఐ మాత్రమే ‘బిగ్ త్రీ’ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేయగా, మిగతా దేశాలు వ్యతిరేకించాయ. పాలకమండలి సమావేశంలో భారత్‌కు చేదు అనుభవమే ఎదురైంది. ‘బిగ్ త్రీ’ విధానికి తెరదించాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. సర్వసభ్య సమావేశంలో ఈ తీర్మానానికే ఓటు పడడం ఖాయంగా కనిపిస్తున్నది.
కీలక నిర్ణయాలు
ఐసిసి రూపురేఖలను పూర్తిగా మార్చివేయనున్న కొన్ని కీలక నిర్ణయాలను పాలక మండలి సమావేశంలో తీసుకున్నారు. అంపైర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేసే డిఆర్‌ఎస్‌ను ఇకపై అన్ని దేశాలు ఒకే విధంగా అమలు చేయాలి. ప్రస్తుతం డిఆర్‌ఎస్ అమలును ఆయా క్రికెట్ బోర్డులకే బిసిసిఐ అప్పగించింది. చివరికి ద్వైపాక్షిక సిరీస్‌ల్లోనూ ఇరు జట్లు అంగీకరిస్తేనే డిఆర్‌ఎస్ అమలవుతుంది. చాలకాలంగా దీనిని వ్యతిరేకిస్తూ వచ్చిన బిసిసిఐ చివరికి పట్టువీడింది. ఇటీవలే ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో మొట్టమొదటిసారి డిఆర్‌ఎస్‌ను అమలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ డిఆర్‌ఎస్ అమలవుతున్నది. కాగా, ఇకపై దీని అమలుపై ఆయా బోర్డులకు నిర్ణయాధికారం ఉండదు. అన్ని జట్లూ ఒకే రీతిలో అమలు చేసి తీరాలి.
పిచ్‌ల తీరుతెన్నుల బాధ్యత ఆయా బోర్డులకే ఉంటుంది. స్వదేశంలో జరిగే సిరీస్‌లు, టోర్నీలకు ప్రతి క్రికెట్ బోర్డు పిచ్‌లను తమ జట్టుకు అనుకూలంగా మార్చుకోవడం ఎంతోకాలంగా అనవాయితీగా వస్తున్నది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర బోర్డులు పిచ్‌లను ఫాస్ట్ బౌలింగ్‌కు సహకరించే విధంగా మార్చేస్తే, భారత్ పూర్తి స్పిన్ పిచ్‌లను తయారు చేస్తున్నది. ఇక ముందు ఏ క్రికెట్ బోర్డుకూ ఇలాంటి అవకాశం ఉండదు. ఒకవేళ పిచ్ తీరుపై విమర్శలు వస్తే, వాటికి ఆయా బోర్డులే బాధ్యత వహించాలి. ఐసిసి నిబంధనలకు అనుగుణంగానే పిచ్‌లను సిద్ధం చేయాలి. మైదానంలో ఆటగాళ్లు క్రమశిక్షణలో మెలగాలని, ‘జెంటిల్‌మన్ గేమ్’ క్రికెట్‌ను నిజంగానే అదే స్ఫూర్తితో ఆడాలని ఐసిసి పట్టుబడుతున్నది. ఇష్టానుసారం ప్రవర్తించకుండా ఆటగాళ్లకు కళ్లెం వేయనుంది. త్వరలోనే క్రికెటర్లకు మెరిట్ పాయింట్లను కేటాయించడం మొదలవుతుంది. మైదానంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడి, డీమెరిట్ పాయింట్లు లేదా మైనస్ పాయింట్లు ఉంటాయి. వీటి ఆధారంగానే ఆయా ఆటగాళ్లపై చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల కాలానికి డీమెరిట్ పాయింట్లను లెక్కకట్టి, క్రమశిక్షణ లేని ఆటగాళ్లపై కనీసం 12 నెలల నిషేధాన్ని విధిస్తారు.
ఐసిసి పురుషులు, మహిళల ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో మొదటిసారి సూపర్ ఓవర్‌ను ప్రవేశపెడతారు. సెమీ ఫైనల్స్, ఫైనల్స్‌లో మ్యాచ్‌లు ఎలాంటి ఫలితం లేకుండా టైగా ముగిస్తే, సూపర్ ఓవర్‌ను అమలు చేస్తారు.

- శ్రీహరి