మీకు తెలుసా ?

బెల్లం...వదలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయులు ఎక్కువగా ఉపయోగించే బెల్లం ఉత్పత్తి, వాడకం పాశ్ఛాత్య దేశాల్లో తక్కువే. చాలాదేశాల్లో వారికి బెల్లం తెలియదంటే నమ్మాలి. భారత్, పాక్, మయన్మార్, శ్రీలంక, మలేసియా, థాయ్‌లాండ్‌వంటి ఆసియా దేశాల్లోను బెల్లం తయారీ ఓ పరిశ్రమగా వర్థిల్లుతోంది. ఒకటీఅరా ఆఫ్రికాదేశాల్లోను, ఈమధ్య యూరప్‌లో, కొంతకాలంగా గల్ఫ్ దేశాల్లో అక్కడక్కడ బెల్లం వాడకం పెరుగుతోంది. చెరకు, తాటితో బెల్లం తయారు చేస్తారని చాలామందికి తెలుసు. కానీ కొబ్బరి, ఖర్జూరం, పామ్‌తోకూడా దీనిని తయారుచేస్తారు. ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే బెల్లంలో 75శాతం భారత్‌లోనే లభ్యమవుతుంది. ఎక్కువగా ఉపయోగించేదికూడా మనమే.

మామిడి
మారాజులం!

ఈ భూమీద అతి ప్రాచీన ఫలం మామిడి. అది పుట్టింది ఆసియాఖండంలోనే. ముఖ్యంగా ఇండియా, మయన్మార్ దీని జన్మస్థలాలు. కనీసం 4వేల సంవత్సరాల పూర్వంనుంచి ఇది అందుబాటులో ఉంది. బౌద్ధ భిక్షవులు వీటిని ఇతర ప్రాంతాలకు పరిచయం చేశారు. బీటాకెరోటిన్, విటమిన్ సి, ఎ సహా ఖనిజలవణాలు పుష్కలంగా ఉన్న పండు ఇది. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మామిడిలో 75శాతం భారత్‌లోనే లభ్యమవుతోంది. కానీ అందులో 95శాతం మనమే తినేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కువమంది ఎక్కువగా తినే తాజా పండు ఇదే. ఇండియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ జాతీయఫలం మామిడి. బంగ్లాదేశ్ జాతీయవృక్షం
మామిడిచెట్టు.

మిరప..
కాయ కాదు...పండు
వృక్షశాస్త్రం ప్రకారం మిరపకాయలు కూరగాయ రకానికి చెందినవి కావు. వాడుకలో మిరపను కాయలుగా పిలిచినా శాస్ర్తియంగా అవి పండ్లు. గింజలున్నందున వాటిని ఫ్రూట్‌గానే పరిగణిస్తారు. మీకో విషయం తెలుసా! ఈ భూమీద మనిషి తప్ప మరే క్షీరదమూ (పాలిచ్చి పిల్లల్ని పెంచే జీవులు) మిరపజోలికి వెళ్లవు. కారం వాటికి ప్రాణాంతకం.

ఉప్పులాంటి నిజం
ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఉప్పులో మనుషులు వాడేది కేవలం 2 శాతం మాత్రమే. మిగతాదంతా రోడ్లపై పేరుకున్న మంచును తొలగించడానికి, రసాయన, పారిశ్రామిక ఉత్పత్తుల తయారీకి, క్లీనింగ్ మెటరీయల్ తయారీకి వినియోగిస్తారు. మనిషి శరీరంలోని ప్రతి కణంలో ఉప్పు ఉంటుంది. మొక్కలు, ఇతర జీవుల్లో ఉప్పు ఆనవాళ్లు చాలా తక్కువ. మెదడు చురుకుగా పనిచేయడానికి ఉప్పు కీలకం. దీనిని ఎక్కువగా తీసుకుంటే ప్రాణహాని తప్పదు. సముద్రజలాలనుంచి ఉప్పు తయారు చేస్తారని చాలామందికి తెలుసు. కానీ భూగర్భ గనుల్లోంచికూడా ఉప్పు తవ్వి తీస్తారు. ప్రపంచంలో అతిపెద్ద ఉప్పునీటి కయ్య బొలీవియాలో ఉంది. ఉప్పు ఉత్పత్తిలో కెనడా, అమెరికా అగ్రస్థానాల్లో ఉన్నాయి.

రోగం కుదిర్చే వేప
దాని రుచి చేదన్నమాటే గాని అది చేసే మేలు అంతాఇంతా కాదు. వేళ్లు, కాండం, బెరడు, పువ్వులు, ఆకులు, చివరకు పళ్లు, అందులోని గింజలు అన్నీ ఔషధాలే. పువ్వులు, బెరడు, గింజలనుంచి వచ్చే నూనెకూడా దివ్యౌషధమే. చర్మరోగాల నివారణకు ఇది మంచి మందు. చీడపీడల నివారణలో అద్భుతంగా పనిచేస్తుంది. సౌందర్య ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడతారు. ముఖ్యంగా సబ్బుల తయారీలో వేపనూనె వాడకం తప్పనిసరి. అన్నట్లు వేప జన్మస్థలం భారత్. దాదాపు 500 కీటకాలను నాశనం చేయగల శక్తి దీనికి ఉంది. దోమల నివారణలో దీనిని మించినది లేదు. వేపగింజల్లో దాదాపు 50శాతం నూనె లభ్యమవుతుంది.

చింతపండుతో స్వీట్స్
భారతీయ ఖర్జూరంగా పేరుపొందిన చింతపండు (చింతకాయ చెట్టు) పుట్టింది ఆఫ్రికా దేశాల్లోనైనా పెరిగి, విస్తృతవాడకంలోకి వచ్చింది మాత్రం ఇండియాలోనే. ప్రస్తుతం ప్రపంచంలో చింతపండు ఉత్పత్తిలో అగ్రస్థానంలో భారత్ ఉంది. భారతీయ వంటకాల్లో చింతపండు వినియోగం ఎక్కువ. కానీ ఆసియా, ఆఫ్రికా దేశాల్లో చింతపండుతో ఐస్‌క్రీమ్‌లు, సలాడ్‌లు, పచ్చళ్లు, స్వీట్స్, లడ్డూలు చేస్తారు. ముఖ్యంగా థాయ్‌లాండ్, మయన్మార్, వియత్నాం సహా ఆఫ్రికన్ దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువ. ట్రినిడాడ్ అండ్ టుబాగో ద్వీపాల్లో చింతపండు లడ్డూలకు మహాగిరాకి.

ఎస్.కె.కె.రవళి