మీకు తెలుసా ?

‘జెరోబా’ గెంతిందంటే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాలుగైదు అంగుళాలు కూడా లేని ‘జంపింగ్ రోడెంట్’ విభాగానికి చెందిన ‘జెరోబా’ సాధారణంగా ఒక అడుగుదూరాన్ని గెంతుతుంది. మామూలు ఎలకల్లా ఇవి నడవవు. కంగారూల మాదిరిగా గెంతుతూ వెళతాయి. అయితే భయపడినపుడు, శత్రువులనుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు దాదాపు పది అడుగుల దూరం వరకు గెంతి పారిపోతాయి. మంగోలియా, చైనా, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో కనిపించే వీటి ముందరి కాళ్లు పొట్టిగా ఉంటాయి. వెనుకకాళ్లు ముందరికాళ్లకన్నా నాలుగైదు రెట్ల పెద్దవిగా ఉంటాయి. వీటి మొత్తం శరీరంకన్నా తోక చాలా పెద్దదిగా ఉంటుంది. గంటకు పదిహేను మైళ్ల వేగంతో ఇవి పరుగుపెట్టి తప్పించుకోగలవు. పెద్దకళ్లు, వీటిలో వివిధ జాతులను బట్టి అతిపెద్ద చెవులు, అతిచిన్న చెవులతో ఉండే రకాలూ ఉంటాయి. మామూలు రోజుల్లో ఇవి బొరియల్లో ఉంటాయి. వర్షాకాలంలో కొండ ప్రాంతాల్లోని బొరియల్లో నివసిస్తాయి.