మీకు తెలుసా ?

గుడ్లను దొంగిలించే పక్షులు (మీకు తెలుసా?)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకికి దగ్గరిబంధువైన ఈ పక్షులు దాదాపు వాటిలాగే ఉంటాయి. రంగు, సైజులో కొంత తేడా ఉన్నా బుద్ధులన్నీ ఒక్కటే. ఒక్కసారి జతకలిస్తే మరణించేవరకూ జంటగానే గడిపే ఈ పక్షులను ‘మాగ్‌పై బర్డ్’గా పిలుస్తారు. నలుపు, తెలుపు రంగులో, పొడవైన తోకతో దాదాపు కాకిలా కన్పించే ఈ పక్షులు అవసరమైనప్పుడు ఇతర పక్షుల గూళ్లలోని గుడ్లను దొంగిలించి ఆరగిస్తాయి.
తెలివితేటల్లో తిరుగులేని ఈ పక్షులు ఇతర పక్షుల అరుపులను అనుకరిస్తాయి. రెండుపక్షులు ఒకేసారి కన్పిస్తే అదృష్టమని, ఒంటరిగా కన్పిస్తే దురదృష్ణమని బ్రిటన్‌లో భావిస్తారు. కానీ చైనా, కొరియాల్లో మాత్రం వీటిని శుభశకునాలుగా పరిగణిస్తారు.

ఆహారాన్ని నీటిలో కడిగి తింటాయి..

సీసాల మూతలు, తలుపులు, గడియలు, అల్మరాలు తీయడంలో నేర్పరి అయిన ‘రకూన్’లు పెట్టే అల్లరి అంతాఇంతాకాదు. నిజానికి ఇవి చేసేపనులు చికాకు తెప్పిస్తాయి. ఇవి తినని వస్తువు లేదు. నీటివనరులు దగ్గరగా ఉన్నప్పుడు దొరికే ఆహారాన్ని ఆ నీటిలో కడిగి శుభ్రం చేసుకుని తినడం వీటి అలవాటు. నీళ్లు లేనపుడు అలాగే తినేస్తాయి. వీటి అరచేతుల్లో ఉండే నిర్మాణంవల్ల వాటికి వస్తువులపై గ్రిప్ బాగా ఉంటుంది. అందువల్లే సీసాల మూతలు తిప్పి తీయడం వీటికి సులువు.

వారానికోసారి విసర్జించే ‘స్లోత్స్’

బద్ధకానికి, అనాకారితనానికి ఉదాహరణగా చెప్పుకునే ‘స్లోత్స్’ క్షీరదాల్లో ఒకటి. మలమూత్రాలు విసర్జించడానికి వారానికోసారి నేలమీదకు వచ్చే ఈ జంతువు మిగతాకాలంలో చెట్లపైనే ఉంటాయి. ఎప్పుడూ ఒకేచోట ఇవి మలమూత్రాలు విసర్జించడం వీటి నైజం. నిజానికి మూత్రం ఎక్కువసార్లు విసర్జించినా మలవిసర్జనమాత్రం వారానికోసారి మాత్రమే. వీటిశరీరంపై ఒత్తుగా ఉండే బొచ్చు అనేక క్రిమికీటకాలకు ఆవాసం. ఫంగి, ఆల్గే, బొద్దింకలు, చిమ్మెటలు, ఇతర కీటకాలు వీటి బొచ్చులో ఉంటాయి. దట్టంగా ఆల్గే అల్లుకున్నప్పుడు ఈ జంతువులు ఆకుపచ్చగా కన్పిస్తాయి. నిజానికి వాటి శరీరవర్ణం అదికాదు. శత్రువులు వీటిని గుర్తించకుండా ఆల్గే అలా రక్షిస్తుందన్నమాట. రోజుకు పదిగంటల నిద్రపోవడం, మిగతా సమయంలో ఆకులు తినడం వీటి దినచర్య. ఒక్క సంపర్కం సమయంలో మినహా ఒంటరిగానే జీవించే ఈ జంతువుల కళ్లు ఎప్పుడూ విచారంగానే కన్పిస్తాయి.

వేటలో తిరుగులేని అడవి శునకాలు

అవి వేటకు దిగాయంటే తిరుగులేని విజయమే దక్కుతుంది. ఉమ్మడిగా, సంయమనంతో అవి చేసే వేటలో 80శాతం విజయమే. అదే ఆఫ్రికలన్ వైల్డ్ డాగ్ ప్రత్యేకత. మృగాల్లో రారాజుగా చెప్పుకునే సింహాలు, పులులు వేటకు దిగితే కేవలం 30శాతం ప్రయత్నాలే సక్సెస్ అవుతాయి. కానీ ఈ అడవికుక్కలు వేటకు దిగితే ఒకటీఅరా ప్రయత్నం తప్ప ఎప్పుడూ విజయమే. గుంపులుగా తిరగడం, మెలగడం, జీవించడం వీటి ప్రత్యేకత. వీటిలో ఏ రెండు కుక్కలకూ ఒకేరకం మచ్చలు ఉండవు. అంటే ప్రతి శునకం ప్రత్యేకమైన మచ్చలు, రంగులతో ఉంటుంది. ఒక గుంపులోని చిన్న, బలహీనమైన, వయసుమీరిన శునకాలకు మొదట ఆహారాన్ని ఇవ్వడం వీటి సంప్రదాయం. ఆ గుంపులోని అన్ని శునకాలూ కలసి పిల్లలను సాకుతాయి. ఎన్నడూ అవి ఒకదానిపై మరొకటి అసహనం ప్రదర్శించవు. ఈడొచ్చాక మగవి ఆ గుంపులోనే ఉంటే జతకోసం ఆడవి వేరే గుంపులోకి వెళ్లిపోవడం వీటి ప్రత్యేకత. అన్నట్లు ఆఫ్రికన్ వైల్డ్ డాగ్స్‌తోకూడిన ఒక గుంపుకు కావలసిన స్థలం పరిధి ఎంతో తెలుసా. 1500 చదరపు కి.మీ. అంటే లండన్ నగరం అంత. 20 కుక్కలకు కావాల్సిన ఈ స్థలంలో మరో బృందం అడుగుపెట్టకుండా అవి నిరంతరం తిరుగుతూనే ఉంటాయట తెలుసా.

-ఎస్.కె.కె.రవళి