మీకు తెలుసా ?

ఎముకలు, నాలుక అన్నీ ఆకుపచ్చగానే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నలిగెళ్లపాము అని మనం పిలిచే ఈ బల్లిజాతి స్కింక్ ప్రత్యేకతలు ఎన్నో ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కువశాతం జీవుల రక్తం ఎర్రగా ఉంటుంది. కానీ ఈ ‘ప్రసినోహీమ’ రకం బల్లిజాతి జీవి రక్తం ఆకుపచ్చగా ఉంటుంది. దీని శరీరంలోని కణాలు, నాలుక, చివరకు నోటిలోపలి భాగం అంతా ఆకుపచ్చగానే ఉంటుంది. బిలె పిగ్మెంట్ వల్ల ఆ రంగువస్తుంది. బిలెవెర్డన్ అనే రసాయనం ఎక్కువగా ఉండటం వల్ల దీనికి ఆ రంగు వచ్చింది. మనుషుల్ల రక్తకణాలకు ఆక్సిజన్ సరఫరా చేసే వ్యవస్థవల్ల ఎరుపురంగు వస్తుంది. ఆ రసాయనం విచ్ఛేదన చెంది బిలెవెర్డన్‌గా విడిపోతుంది. మనుషుల్లో అలా జరిగితే అది రక్తంలో కలసి పసుపుఛాయలో శరీరవర్ణం మారిపోతుంది. అప్పుడు పచ్చకామెర్ల వ్యాధిగా పరిగణిస్తారు. అది ప్రాణాంతకమే. అదే పద్ధతిలో ఈ బల్లిజాతి జీవిలో రక్తం ఇలా రంగుమారిపోయింది. కానీ దీని ప్రాణానికి వచ్చిన ముప్పేమీ లేదు. కానీ ఇది మిగతావాటికి విషపదార్థంకిందే లెక్క. చివరకు ఇది ఉమ్మే ద్రవం కూడా విషంగానే పనిచేస్తుంది. అందువల్ల వీటికి శత్రువులంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. పపువా న్యూగినియాలో ఎక్కువగా, సోలోమన్ దీవుల్లో అక్కడక్కడ మాత్రమే ఇవి కనిపిస్తాయి.

SKK Ravali