మీకు తెలుసా ?

రోజుకు 20వేల చెదలను తింటాయ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే ఈ జంతువు పేరు ‘నంబట్’. దీనికి చెదలు, చీమలంటే ఇష్టం. చెదలు, చీమలు పెట్టిన పుట్టలను ఇవి ఏమాత్రం పాడుచేయవు. చెదలు లేదా చీమలు బయటకు వచ్చేవరకు అవి ఓపికగా వేచి చూస్తాయి. వచ్చిన వెంటనే నాలుకతో లాక్కుని తింటాయి. ఒక్కో నంబట్ రోజుకు కనీసం 20వేల చెదలను తింటుంది. తన శరీరం బరువులో ఇది పదిశాతం. వేసవిలో పగటిపూట పుట్టలను వదిలి చెదలు ఎక్కువ సేపు బయటకు వస్తాయి. అలాగే శీతాకాలంలో ఎండబాగా కాసినప్పుడు అంటే మధ్యాహ్నం వేళ బయటకు వస్తాయి. ఆయా సమయాలు, వాతావరణాన్ని బట్టి ఈ జంతువులు అక్కడికి చేరుకుని ఆహారాన్ని సంపాదించుకోవడం విశేషం. చెదలు, చీమలను ఇష్టంగా తినే ‘యాంట్ ఈటర్’కు, వీటికి కేవలం ఆహారం విషయంలో తప్ప మరెందులోనూ పోలిక, సంబంధం లేదు. కంగారూల మాదిరిగా ఆడ నంబట్‌లకు ఉదరంపై సంచీ ఉండదు. కానీ ఉదరం చివర్లో ఒతె్తైన వెంట్రుకల సమూహం ఓ సంచీమాదిరిగా ఉండి పిల్లలను కాపాడుతుంది. రెండుమూడు నెలలపాటు ఆ పిల్లలు అక్కడే అంటిపెట్టుకుని తల్లులతో గడుపుతాయి.