ధర్మసందేహాలు

ఉపదేశం ప్రకారమే జపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి
* శ్రీరామ మంత్రాన్ని జపించేటప్పుడు ఓంకార పూర్వకంగా జపించవచ్చునా?
అలా ఉపదేశం ఉంటే అలాగే జపించవచ్చు.
* జపం చేసేటప్పుడు వేళ్ల కణుపులతో సంఖ్యామానం చేయవలెనా? లేక వేళ్లతో చేయవలెనా?
- కె.వి.ప్రసాదరావు, కందుకూరు
గాయత్రీ మంత్రానికి మాత్రమే వేళ్ల కణుపులతో సంఖ్యామానం ప్రశస్తం. ఇతర మంత్రాలకు జపమాలిక ప్రశస్తం. అది లేనప్పుడు వేళ్లతో లెక్కించవచ్చును.
* సంతానమే లేని దంపతులకు అంత్యక్రియలు ఎవరు చేయవచ్చును? -
- కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
వారి జ్ఞాతివర్గంలో పుత్రుల వరస అయినవారికి ఆస్తి ఇచ్చి వారి ద్వారా అంత్యక్రియలు అనంతర శ్రాద్ధ క్రియలు జరిపించుకోవచ్చును. ముందుగానే ఎవరినైనా దత్తత తీసుకోగలిగితే ఇక చిక్కేలేదు.
* ఆడపిల్లలు మాత్రమే ఉన్న దంపతులకు అంత్యక్రియలు ఎవరు చేయవచ్చును?
- రామారావు, హైదరాబాదు
ఆ ఆడపిల్లకు పుత్ర సంతానం వుంటేవారిని దత్తత తీసుకోవచ్చును. దానికన్నా ప్రశస్తమైన పని తమ గోత్రీకులు ఎవరినైనా దత్తత తీసుకోవడం. ఈ రెండూ కుదరకపోతే దౌహిత్రులలో పెద్దవారు వీరి అపరకర్మలు చేయవచ్చును. ఆడపిల్లలకు పుత్ర సంతానమే లేకపోతే, వీరి సగోత్రులలో వీరికి పుత్రుల వరస అయినవారు వీరి ఆస్తికి, అపర క్రియలకు గూడా అర్హులవుతారు.
* కొందరు స్ర్తిలు అద్దె గర్భముల ద్వారా అమ్మదనాన్ని అమ్ముకుంటున్నారు. ఇది శాస్త్ర సమ్మతమేనా?
- నీరజ, అమలాపురం
దీనికి శాస్త్ర సమ్మతి లేదు
* కోర్టు ద్వారా విడాకులు తీసుకున్న మహిళ అత్తవారి వంశానికి చెందుతుందా? తల్లిగారి వంశానికి చెందుతుందా?
- వి.రామలింగాచారి, యాదగిరిగుట్ట
మన ధర్మశాస్త్రాల ప్రకారం విడాకులు అనే ప్రక్రియే చాలా దుర్లభం. ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో విడాకులు జరిగితే పూర్వ భర్త ఘటశ్రాద్ధమనే శ్రాద్ధం చేయాలి. అది చేస్తే ఆమె అత్తగారి వంశంనుంచీ విడిపడిపోతుంది. పుట్టింటి వంశానికి మాత్రం చేరదు. ఆమె గోత్ర రహితగా మిగిలిపోతుంది.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.