ధర్మసందేహాలు

వారాలనుబట్టి పూజలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇటీవలికాలంలో సోమవారం శివుడు, గురువారం సాయిబాబా అని ఈ విధంగా వారాన్ని బట్టి భక్తులు ఆయా గుళ్ళకు వెడుతున్నారు. ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని పూజించాలా? - ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
ఏ పూజా లేకుండా వుండేదానికంటే ఇది నయమే కాని, ఒక దేవుడిని ప్రధానంగా పెట్టుకుని, ఇతర దేవతలను తక్కువ చూపు లేకుండా, అన్ని రోజులూ ఆ దేవుడిని ఆరాధించడం దీనికన్నా ప్రశస్తం.
* గోమాత సర్వదేవతా స్వరూపమని తెలిసి కూడా కొంతమంది గోమాంసం తింటున్నారు. వారికి ఎలాంటి పాపం వస్తుంది? - నిర్మల, హైదరాబాదు
అలాంటివారికి ఘోర రౌరవ నరకం తప్పదని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి.
* ఉసిరికాయ పచ్చడి రాత్రులు, ఆదివారం తినకూడదా? - మహీధర సుగుణ, ఏలూరు
ఇది ప్రధానంగా వృద్ధ పరంపరా ప్రాప్తమైన ఆచారం. కొన్ని ధర్మశాస్త్ర నిబంధనా గ్రంథాలలో కూడా ఇది కనిపిస్తోంది.
* సీతారాముల కళ్యాణంలో మూడు మంగళ సూత్రాలు కట్టడం ధర్మ సమ్మతమేనా? - శ్యామల, నెల్లూరు
వివాహంలో మంగళసూత్రధారణను ధర్మసూత్రకారులు విధించలేదు. ఇది ఆచార ప్రాప్తమైన విధి. సిద్ధపురుషులైన మహాత్ములు ఏర్పాటుచేసిన సంప్రదాయాన్ని మనం తిరస్కరించరాదు.
* దంతవక్త్రుని సంహారం ఎలా జరిగింది? -అమ్ములు, విజయవాడ
దంతవక్త్రుడు శిశుపాలుడికి తమ్ముడు. శిశుపాల, సాల్య, పౌండ్రక వాసుదేవులను ముగ్గురనీ, శ్రీకృష్ణుడు సంహరించటం చేత దంతవక్త్రుడు శ్రీకృష్ణుడిమీదకు యుద్ధానికి వెళ్ళాడు. శ్రీకృష్ణుడు ఇతనిని సంహరించాడు.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి