Others

అన్నింటా రామనామమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫాఠ్యే గేయేచ మధురం....... అన్నట్టుగానే రామాయణం సాహిత్యంలో ఎన్ని ప్రక్రియలున్నవో వాటినన్నింటాకుదురుకున్నది. అసలు రాముడు దశరథుని కొడుకును మాత్రమే అని చెప్పినా దానివెనుక శ్రీమహావిష్ణువే తన్నుతాను దాశరథిగా సృజించుకున్నాడని తెలుస్తుంది. అట్లా అయి నా ఈ రామకథ పురాణాల్లోను, ఇతిహాసాల్లోను, సంగీతంలోను, వచనంలోను అసలు రాముడు లేని వస్తువంటూ లేదు అని చెప్పడానికి ఏమాత్రం జంకులేకుండా ఉంటుంది. ప్రతిప్రక్రియలోను నెలకొన్న రామకథ సంగీతంలో ఆబాలగోపాలాన్ని అలరిస్తుంది. -రాముని గూర్చి పండితులకో పామరులకో కాదు సర్వజనావళికీ తెలుసు. వారు వీరను భేదం ఇంచుక కూడా లేకుండా రామకథను అందరనూ ఆస్వాదించేవారు. ఇక కీర్తనలు గేయాలుఅంటే సరేసరి........ ఏ చదువులేదు.. జ్ఞానమంతఅబ్బలేదు.. అన్న వాడు సైతం రామ! నీ నామమేమి రుచిరా అనే పాడుకుంటూ ఉంటాడు. అట్లాంటపుడు ఇక సంకీర్తనా కారులు, వాగ్గేయకారులు, సంగీతమర్మజ్ఞులైన రామదాసు, త్యాగయ్య ప్రయాగ రంగశర్మ ఇలా పేర్లు చెపితే స్థలాభావంకదా. వారందరూ పిబరే రామరసం అంటూ ఎన్నో అనుభవాల సారాంశాన్ని మరె న్నింటిలోనో వారివారి భావలహరిలో వారు తాద్యా త్మం చెంది ఇతరులు తన్మయత్వం చెందడానికి మార్గదర్శకులైనారు. సాహిత్యం అనేది ఓ చెట్టు అనుకొంటే ఆ చెట్టుకు ఉన్న కాండం,వేర్లు, కొమ్మలు, రెమ్మ లు, ఆకులు అవేకాదు చిటారుకొమ్మ ను కూర్చున్న కోకిల సైతం రామనామ గాన ప్రియురాలే అయి ఉంటుంది అంటే అతిశయం ఏముంది.. కనుగొంటిమయ్యా పురుషోత్తమా అని పాడుకుంటూ చక్కని తల్లి సీతమ్మను మమ్ము కరుణించమని చెప్పు అమ్మా అనడానికి నను బ్రోవమని చెప్పవే...అని ఒకరంటే, కనికరం కాంతపై గలిగి అంటూ మరొకరుఇలా ఎవరికీ తోచిన రీతిలో వారు చెప్పారు. అసలు రామునికి నివేదించని అంశమేదీలేదు. రామానుగ్రహం కోసం ఒకరు నాయికభావాన్ని అపాదించుకొంటే మరికొందరు మధురభక్తిలో రమించారు. భక్తాగ్రేసరులైన వారంతా కూడా రామకథను గేయంరూపంలోనో, సంకీర్తనారూపంలోను ఆస్వాదించనివారే. అసలీ రామకథ ఇలా వాఙ్మయం అంతటా నెలకొంది.. జనపదాల్లోను చుట్టుకుంది. పద్యగేయచంపూ వచనాల్లోకాదు బుఱ్ఱకథల్లోను, యక్షగానాల్లోస్ర్తిల పాటల్లోను శతకవాఙ్మయంలోను కుదురుకున్న రామకథను పరిశీలిస్తూ ఉంటే అందులోంచి ఎనె్నన్నో రత్నరాసులు ఊరుతూనే ఉన్నాయి. శతకవాఙ్మయంలో ఆత్మాశ్రయం కవిత్వం శతక లక్షణం కనుక రామకథ శతకసాహిత్యంలో చెప్పలేనంతగా వేళ్లూనుకుంది. భక్త్యావేశం కలిగిన కవి భగవంతుడిని తనవాడుగానో, లేక తనకు అధినాయకుడుగానో ఊహించి మరీ రాముని కీర్తిని శ్లాఘిస్తూనే రాముణ్ణి నిలదీయడమూ ఇందులో కనిపిస్తుంది. దురమున రాముని గెల్చుట తరమా అంటే ఓ కవి రాజ్యాభిషిక్తుని చేస్తానని మాట ఇచ్చి వెనక్కుతగ్గి పైగా వనవాస శిక్ష వేస్తే సాత్త్విక వృత్తిని చూపే నీతి నీయటన్న నీదె గణనీయము నిక్కము అని కవి మెచ్చుకోలును ప్రదర్శిస్తాడు. ఇట్లా ఒక్క రాముని గూర్చి పెద్దలకే కాదు రాముని గూర్చి తెలిపే కందపద్యాలు అందలమెక్కి ఉన్నాయి. కనుకనే నేటికీ రామాయణం పరిశోధనాంశమైంది. రామో విగ్రహాన్ ధర్మః అంటూ రాముని గూర్చి తెలుసుకొంటుంటే వాల్మీకి రాముడు శుభలక్షణాలు కలిగిన వాడు మాత్రమేకాదు... రాముడు సకల సద్గుణాలతోవిశేషణాల చెప్పలేని మాటల్లో వర్ణించలేని వానిగా మిగిలిపోతున్నాడు. అందుకే ‘‘పదములే చాలు రామా- నీ పదధూళులే పదివేలు/ నీ పద మంటిన పాదుకలు/ మమ్మాదుకొని రుూ జగమేలు అంటూ కీర్తించగలిగారు. దానివలనే భాషాభేదం అనేది లేదు అసలు మతం లేదు గితం లేదు మానవత్వమొక్కటే చాలు అనే వారు సైతం వారే కాదు నాస్తికులైనా సరే రాముని గుణగానం చేయాల్సిందే రాముని ధర్మపరత్వం గూర్చి తెలుసుకోవాలని ఉత్సుకతను కలిగి ఉండా ల్సిందే. రాముడు ఏం చేసినా అందులో ధర్మాచరణ ఉంటుంది. ‘‘ఇదం పవిత్రం పాపఘ్నం... ’’అంటూ రామాయణ ప్రశస్తిని గ్రంథాలు చెప్తున్నప్పటికీ రామాయణంలోని ప్రతి పాత్ర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. నేడు కరవవౌతున్న మానవ సంబంధాలను పునరుద్ధరించడానికి రామాయణమే మార్గవౌతుంది. ఆడంబరాలతో భక్తిని ప్రబోధిస్తూ ఆటాటోపాలతో భక్తినికూడా వ్యాపారదృష్టితో చూచే వారెక్కువైన ఈ కలికాలంలో శబరి భక్తి కళ్లుతెరిపిస్తుంది. జీవాత్మ పరమాత్మ అంటూ ద్వైదీభావంలేకుండా అశాశ్వతమైన లౌకిక సుఖాలను వదిలి పరమాత్మవైపు అడుగులు వేస్తూ దివ్యగుణాలకు ఆవాసమై మనుష్యుడు దివ్యుడై చరించాలని ఉద్బోధించే రామాయణం అందరికీ అనుభవైకసారం కావాలి.

- ఎస్. వి. ఎస్. సాయకృష్ణ