ధర్మసందేహాలు

...ఈ పదాల అర్థం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సంధ్యావందనంలో తన చుట్టూ తాను తిరుగుతూ చదువుకునే నమో వాక్యాలలో వచ్చే ‘‘కామోకార్షీత్’’, ‘మన్యురకార్షీత్’ (నమో నమః) అనే పదాల అర్థము ఏమిటి ?
- ఈశ్వరరెడ్డి, హైదరాబాదు
అవి వేదంలోని రెండు పెద్ద వాక్యాలకు సంగ్రహ రూపాలు. మొదటి వాక్యంలో కాముడు అనే దేవతను, రెండవ వాక్యంలో మన్యువు అనే దేవతను ప్రార్థన చేస్తున్నారు. కాముడు అంటే కోరిక, మన్యువు అంటే క్రోధము లేక పట్టుదల. మనం చేసే పనులన్నిటికీ కర్తగానీ, కారయిత గానీ ఈ దేవతలే కనుక నాకు ఏ విషయంలోను కర్తృత్వం లేదు. కారయితృత్వం కూడా లేదు. అనే తత్వాను సంధానమే ఈ మంత్రాలకు పరమార్థం.
* లక్ష్మణ స్వామి భార్య ఊర్మిళ అరణ్యవాసానికి ఎందుకు వెళ్లలేదు. ఆమె నిరంతరం నిద్రావస్థలో ఉన్నది అంటారు నిజమేనా?
- కె.వి. ప్రసాదరావు, కందుకూరు
లక్ష్మణస్వామి తనే ఒక సేవకునిగా వెళుతున్నాడు కనుక, తన భార్యను తీసుకొని వెళ్లటం తగదని తీసుకెళ్లలేదని పెద్దలు చెప్పారు. ఆమె నిద్ర విషయం వాల్మీకి ప్రస్తావించలేదు. ఇతర రామాయణాల్లో కొన్నింటిలో ఉంది..
* దీపారాధన నిమిత్తం దీపాలు వెలిగించినపుడు వాటిని వట్టి నేలమీద పెట్టవచ్చునా ?
పి.వి. నరసింహరావు, రాజమండ్రి
నేలమీద దీపాలు పెట్టకూడదు. ఈ దోషాన్ని తప్పించుకునేందుకు కుందులు, ప్రమిదలు మొదలయిన వాటిని తయారు చేసేటపుడు రెండు పొరలుగా లేక మెట్లుగా చేస్తారు. దానివల్ల దీపారాధనను నేల మీద పెట్టిన దోషం ఉండదు.
* దేవతా ఉత్సవాలల్లో చేసే అన్నదాన కార్యక్రమాలలో ఉల్లిపాయ వాడటం సమంజసమేనా?
- రామారావు, సూర్యాపేట
ఉల్లిపాయను ధర్మశాస్త్రాలలో తమోగుణ ద్రవ్యంగాలెక్కించి నిషేధించారు. దాన్ని మామూలుగా తినటమే దోషం. ఇక దేవతా ఉత్సవాల్లో దానిని వాడటం సమర్థనీయం కాజాలదు.

--

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org