Others

ధర్మంవైపే నడవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్ని మతాల సారం, దేశభక్తి మాతృసమానం. ‘మాతృదేవోభవ’ అని మన వేద వాఙ్మయం. ఎవరి ధర్మం ప్రకారం వారు వాక్కుస్వాతంత్య్రం, భావ ప్రకటనను నిర్దేశించుకున్నారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం మనం ధర్మచక్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం.
‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి’ అని రామాయణం చెబుతున్నది. ప్రతి వ్యక్తీ ధర్మంవైపు నడవాలని భారతం చెపుతున్నది. ‘యధా యధా ధర్మస్య గ్లానిర్భవతి భారత’ అని భగవద్గీత చెపుతున్నది. అధర్మం అంటే దొంగచాటుగా దెబ్బతియ్యడం, జీవహింస చేయుట, మానసికంగా, శారీరకంగా బాధపెట్టడం మొదలైనవి. రామాయణంలో రావణాసురుడు దొంగచాటుగా సీతను అపహరించాడు. భారతంలో దుర్యోధనుడు దొంగచాటుగా పాండవులను హింసపెట్టాడు. ఇవన్నీ అధర్మాలని మన పురాణాలు చెపుతున్నాయి. విభీషణుడు రావణాసురుడి సోదరుడైనా అధర్మం చోట వుండరాదని అన్నను వదిలి ధర్మపరుడైన రాముని పక్షాన చేరాడు. సీతను వదలమని అన్నకు పలుమార్లు చెప్పాడు. కానీ రావణుడు పెడచెవిన పెట్టాడు.
కురు పితామహుడు భీష్ముడు దుర్యోధనునికి ధర్మం బోధించాడు. కానీ మూర్ఖుడు దుర్యోధనుడు వినలేదు. విధిలేక భీష్ముడు కౌరవుల ఉప్పుతింటున్నందుకు అధర్మంవైపు వుండి యుద్ధం చేసాడు. చివరకు పాండవ పక్షపాతి అని దుర్యోధనుడు నిందమోపినపుడు భీష్ముడు, ఎవరితో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేసిన పరమాత్ముని చేత ఆయుధం పట్టించాడు. చివరకు భీష్ముడు యుద్ధంలో నేలకొరిగి స్వచ్చంద మరణం కలిగి వుండడంవలన అంపశయ్యపై అహోరాత్రులు మూడురోజులు రక్తశిక్తంతో తనకు తాను శిక్ష అనుభవించాడు. దేశానికి ధర్మం గొప్పదని ధర్మరాజుకు విష్ణు సహస్రనామాలు వినిపించాడు. భారతదేశం ధర్మదేశమని తెలియజేసాడు.
ధర్మ భావ ప్రకటనలో స్వామిభక్తి పరాయణుడు ఆంజనేయుడు రాముడికి సేవ చేసి కీర్తి పొందాడు. రామాయణ మహామాలా వందే నీలాత్మజం అని అందరికీ అభయమిస్తున్నాడు. ఇద్దరూ కర్ణుడు, ఆంజనేయుడు భావ ఫ్రకటన చేసారు. ఎవరి కీర్తి ఇప్పటివరకు నిలిచివున్నది. జెండాపై కపిరాజు ధర్మం రూపంలో ప్రకాశిస్తున్నాడు.

- జమలాపురం ప్రసాదరావు