Others

ప్రకృతి రక్షణే పరమాత్ముని పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనాది నుండి ఐతిహ్యాలయిన రామాయణ, భారత, భాగవతాలకు వాటికి అనుబంధమైన కావ్యరచనలకు జనపదాలు ఎంతగానో ద్యోతకం చేశాయి. కవుల వర్ణనలకు, కీకారణ్యాలలో వెల్లివిరిసిన వృక్షజాలలకు, లతికాపరమైన పుష్ప సుగంధాలకు ఆలవాలమై ప్రకృతిని ప్రసిద్ధంగా వాడుకున్న కవుల యాదృచ్ఛిక వర్ణనలకు ఆలంబాలయ్యాయి. కావ్య మనోహర తత్వానికి ఆ అటవి సంపదే అలంకార ప్రాయమయ్యాయి.
కవి జ్ఞాన నేత్రంలో ప్రకృతి సౌంద్యం, వాగులు, వంకలు, కొండలపైనుండి జాలువారే జలపాతాలు, పాయలు పాయలుగా మారే జలవనరుల సంగమాన్ని నదులుగా వర్ణించారు. సుజల స్రవంతులైన జీవనదుల్ని తమ కావ్యాలలో ఇతిహాసిక రామాయణ, భారత, భాగవతాల్లో కవితాపరంగా వాటి ఔన్నత్యాన్ని, పవిత్రతను రచనలలో వాడుకొని పవిత్రమైన కావ్యాలకు, ఇతిహాసాలకు కారణభూతులయ్యారు.
రామాయణంలో నగర బహిష్కృతయైన సీతామాత ఎనెన్ని అడవుల్ని, వాటిలోని వృక్షజాలాన్ని, జంతుజాలాన్ని కన్నులకు కట్టిన వర్ణనలలో ఆనాటి అటవీ సంపదకు తార్కాణాలు. రామచరితం వ్రాసిన మహాకవి వాల్మీకి చతురాచతురతతో ఆనాటి వన సంపదను ముందు తరాలవారికి ఒక తీపిగుర్తులుగా, ఆనాటి అటవీ సంపదకు తార్కాణంగా వాల్మీకి తన చరితలో సుస్పష్టం చేశారనేది నిర్వివాదాంశం. కవుల కలాలలో దార్శనికతతోపాటు చారిత్రకాంశాలు ఎన్నో ఇమిడి ఉన్నాయి. అంతకంటే ఆశ్రమ ధర్మాలు ఆనాటి మునుల, ఋషుల ఆధ్యాత్మికాంశాలు హోరు పెడుతున్నాయి. ధర్మా న్ని చాటే హితోక్తులు, ఆచరించాల్సిన ధర్మ పరివర్తితము, ఆశ్రమవాసుల నియమ నిబంధనలు, ఆశ్రమ స్వకీయ ధర్మాలు, ఆశ్రమంలో అడుగుపెట్టిన అంతేవాసులు గురువుద్వారా నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మిక పాఠాలు, వారు అనుసరించవలసిన నియమ నిబంధనలు, మనసా వాచా వారు అనుసరించాల్సిన ధర్మ పరివర్తనలు ఆశ్రమవాలకు ఇట్టే బోధపడతాయి. ఆశ్రమంలో రాజుకుమారులైనా, రారాజులైనా వ్యక్తిత్వ భేదం లేకుండా విలువిద్య, గుర్రపుస్వారీ, మల్లయుద్ధం, రాచరికపు వ్యవస్థలో వేయాల్సిన ఎత్తుకు పైఎత్తులు, అంతకంటే రాజ్యపాలనలో ప్రజల్ని కన్నబిడ్డలుగా చూసుకొంటూ రాజరికాన్ని ముందుకు సాగించాల్సిన బాధ్యత ఆశ్రమవాలైన రాకుమారులమీద ఉంటుంది. ఆశ్రమం కేవలం విద్యాబుద్ధులకే కాదు సకల శాస్త్రాలను వంటబట్టించి, ధీరులుగా, మేరువులుగా, భవిష్యత్ పాలకులకు తీర్చిదిద్దే వ్యవస్థ ఆనాటి గురుకుల ఆశ్రమాలలో వుండేది. శిష్యులు తప్పు చేస్తే కఠోర శిక్షలు, నియమావళిని అధిగమించితే శాపనార్థాలు, ఆశ్రమాలలో మోహావేశాలకు పాల్పడితే అఘోర శాపాలకు గురై వ్యక్తిత్వాన్ని కోల్పోయి శాపవశులై జీవితాన్ని వ్యర్థంగా గురువుల ఆగ్రహాల మేరకు శాపగ్రస్త జీవితాన్ని అనుభవించి, గురుదేవుల కరుణతో శాప విమోచనం పొంది, జగతిని జీవించే వెసులుబాటు ఉండేది.
ఈ అనాది వ్యవస్థకు మూలాధారం జనపదాలే. జనపదాలను విస్మరిస్తే జగతి చరిత్రే తలక్రిందులవుతుంది. జనావాసాలు ఈనాటివి కావు. హైందవ సిద్ధాంత ప్రకారం అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి అయిన జగన్మాత ఈ ప్రపంచ సృష్టిని గావించారని హైందవుల నమ్మకం. అండ పిండ బ్రహ్మండాది సకల జగత్తు ఆవిర్భావానికి ఆమె ఆదిదేవత. జన జీవన ప్రాణికోటికి జవసత్వాలిచ్చే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకీ, ఆదిపరాశక్తేనని హైందవుల అపార నమ్మకం. ఆ ఆదిపరాశక్తే ప్రకృతిగా నిలిచింది. తరువై ప్రాణవాయువునిస్తూ తనువును నిలుపుతోంది. దప్పికను తీరుస్తూ దాహార్తిని పోగొట్టడానికి నీటి చెలమై జలాశయాలుగా మారి త్యాగమే మహోన్నత గుణమని చెప్పక చెబుతోంది. ప్రకృతిని రక్షిస్తే మనలను రక్షించుకున్నట్లే. దేవాల యాలకు వెళ్లి ఎలాగైతే ఆత్మశక్తిన ఉద్దీప్తం చేసుకొంటున్నామో ప్రకృతి పరిరక్షిస్తూ మానవుడు మహ నీయుడుగా వెలిగేలా చేసే ఈ ప్రకృతి ఆరాధన ప్రతివారు చేసి తీరాలనే దృష్టితోనే జగన్మాతను కొలుద్దాం. అహరహం ప్రార్థ్దిద్దాం.

- దాసరి కృష్ణారెడ్డి