Others

కొండంత దేవునికి కొండంత పూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన భారతీయ శాస్త్రాలలో అఖిలేశ్వరుని సంగ్రహముగా ఈశ్వరుడనియే అందురు. ఈశ్వరుడు అనగా శివుడు విష్ణువు కాదు. ఇత్యాది భావాలకు తావివ్వరాదు. ఈశ్వరుడు అనగా సమస్తమునకు ప్రభువు అని అర్థము. మనము ఉండే బ్రహ్మాండమే ఆద్యాంతములు తెలియనిది. ఈ విషయము శివపురాణములో బ్రహ్మ, విష్ణువులే ఈ బ్రహ్మాండం అడుగునుండి పైవరకు వ్యాపించిన జ్యోతిర్లింగము యొక్క ఆద్యాంతములు కనుగొనవలెనని పందెములు కాచుకొని విఫలులు అయిరి అని ఒక పెద్ద కథ ఉన్నది. అంత పెద్ద బ్రహ్మాండములు ఆది జలములో నలుసులవలె కోట్ల కలది ఉన్నవట. కంప్యూటర్‌లోని నలుసువలె ఆ ఆది జలములోని ప్రతి నలుసు ఆద్యాంతములు లేని ఒక పెద్ద బ్రహ్మాండమన్నమాట. ఇట్లు అనేక కోటి బ్రహ్మాండములు ఈశ్వరుడు కన్ను తెరిచినచో సృష్టి అగునని కన్నులు మూసికొన్నచో అన్నిటికిని ప్రళయము వచ్చునని ఋషి కనుక ఈశ్వరుని గొప్పతనమును ఇంత గొప్పగా చెప్పగలిగెను. ఇంకెవ్వరును ఈశ్వరుడు ఎంత గొప్పవాడో చెప్పలేరు. చెప్పినచో అయినను అవమానించినట్లగును. వాక్కులతో చెప్పుటకు వీలుకాని వాడు కడకు మనస్సుతో ఊహించుటకు కూడ వీలుకాని వాడు ఈశ్వరుడు అని భావము. అట్టి వానిని ఇట్టివాడని చెప్పుట అవమానము చేసినట్లె కదా. స్తోత్రము చేసినట్ల ఎట్లగును? ఈ భావమును పుష్పదంతుడు అనే గంధర్వుడు తన శివ మహిమ్నస్తోత్రములో మొదటి శ్లోకములోనే మొదటి పాదములోనే చెప్పెను.
‘‘మహిమ్న: పారంతే పరం ఆవిదుషో యద్య సదృశీ, స్తుతిర్ బ్రహ్మాదీనామపి తదవసన్నా: త్వయి గిర:’’ అనగా ఓ ఈశ్వరా నీ మహిమ యొక్క ఆవలి ఒడ్డును తెలిసికొనని వాడు స్తోత్రము చేసినచో తప్పైనచో బ్రహ్మదేవుని వాక్కులైన వేదములు కూడ అంతే కదా. కేవలము వేదములు మాత్రమే ఈశ్వరుని గురించి శాఖాచంద్ర న్యాయముతో పరమేశ్వరుని సూచించునట. ఇతర వాక్కులకు సాధ్యము కదా అట. శాఖాచంద్ర న్యాయమనా ఈ కాలములో ఆ సంప్రదాయము ఈ కాలపు విద్యుత్‌కాంతులవలన కూడ నశించినది. పూర్వము పల్లెలో ప్రతి మాసము నెల బాలుని శుక్ల పాడ్యమి నాడో లేక మరుదినమో తండ్రి కుమారునికి సన్నగా కనపడు చంద్రరేఖను చూపి నమస్కారము చేయుమనును. ఈ కాలములో శుక్లపాడ్యమి నాటి చంద్రునికి కాని మరుదినమున చంద్రునికి కాని సంధ్యవేళ నమస్కారము చేయువాడే లేడు. అప్పుడు తన ఉత్తరీయములోని ఒక నూలుపోగును తీసి చంద్రుని వైపు విసిరి ‘‘అత్రి నేత్ర సముద్భూత లక్ష్మ్యా సహ సహోదర! క్షీరోదార్ణవ సంభూత బాలచంద్ర నమస్తుతే’’ అను శ్లోకమును చదువవలెను. చంద్రుడు మన మనఃకారకుడిని జ్యౌతిష శాస్తమ్రులు చెప్పుచున్నవి. మాసము ఒక పర్యాయము 2 నిమిషములు సందెవేళ చంద్రప్రార్థన చేసినచో జీవితాంతము మన మనస్సు సవ్యముగా పనిచేయునని భావము.
‘‘మనఃఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’’ మనము సంసారములో బంధింపబడుటకును దాని నుండి విడివడుటకును మనస్సే కారణమని పెద్దలు నిర్ధారించిరి.
పైగంబర్ హజరత్ మహమ్మద్ వారు కూడ ఖురాన్‌లో ఈశ్వరుని 50, 60 పర్యాయములు తనకు దర్శనము ఇప్పించమని ఈశ్వరుని కోరెను. ఈశ్వరుడు ఆ ఒక్కటి మాత్రము అడుగకు అని తన దర్శనము ఇవ్వకుండా తప్పించుకొనెను. అనగా దర్శనము ఇచ్చుటకు వీలు కాదని భావము. దర్శనము కలుగవలెనన్నచో కంటికి కనపడవలెను కదా. మనస్సుకే ఊహించుటకు వీలుకాని ఈశ్వరుడు మనస్సులోని చిన్నపరికరమైన కంటికి ఎట్లు కనపడును. కనపడినచో ఈశ్వరుడు కాదనియే భావము. చెవ్వులకు కనపడదు. కంటికి వినపడదు. అట్లే దేవుడు కనపడడు. వినపడడు. వినపడినను శ్రవణేంద్రియమునకు ప్రత్యక్షమే కదా. అందువలన పురాణములలోని కథలు ఎట్లున్నను ఆ కథలను అట్లే గ్రహించవలెను. హిరణ్యకశిపునికి కనపడెనని మనకు కనపడవలసిన పనిలేదు. కన్నులు సమానముగా ఉన్నను దోషభూయిష్ఠమగు గన్నులకు శుద్ధమైన కన్నులకు కనపడినవి కనపడవలసిన అవసరము లేదు కదా. అందువలన మన పెద్దలు బాగుగా ఆలోచించి విగ్రహారాధనను చేసిరి. అది మనకు జ్ఞానోదయమునకై చెప్పిన పాఠము అన్నమాట. అనగా దేవుడు రాత్రి విగ్రహము వలె స్తోత్రపాఠములు చేసినచో ఊబ్బిపోయి ఆ విగ్రహము గుంతలు వేయదు. తిట్టినచో ఎర్రగా మారి కృంగిపోదు. ‘‘తుల్యనిందా స్తుతిర్మౌనీ’’ మహానీయులు నిందలను స్తోత్రములను సమానముగా ఆదరింతురు. అందువలన ఆపస్తంబుడు, ఆశ్వలాయనుడు, బౌద్ధాయనుడు, హిరణ్యకేశీ, కాత్యాయనుడు మొదలగు శాశ్వత వ్యక్తులు ఈశ్వరుని స్తోత్రపాఠములు ఉపయోగము లేదు. పైగా మన చిన్నబుద్ధితో చేసిన స్తోత్రములు అనేక కోటి బ్రహ్మాండ నాయకునికి అవమానకరమగు విషయములు కావచ్చును. అందువలన ఈశ్వరుడు, ఋషులు, ధర్మశాస్తమ్రులు చెప్పిన ప్రకారము నడుచుకొన్నచో ఈ జన్మలో సుఖముగా ఉండి ధర్మాచరణ పై శ్రద్ధ ఎక్కువై రాగల జన్మలలో కూడ ధర్మచరణ బాగుగా చేయుచు తొందరగా జన్మరాహిత్యమనే మోక్షమును పొందగలరు అని నిర్ధారించిరి. ఉదా: వైద్యుని ఎంత స్తోత్రము చేసినను రోగము పోదు. వైద్యుడు చెప్పినట్లు నడుచుకొన్నచో రోగము పోవును. అదే సూత్రము ఇక్కడ కూడ అన్వయించును. అందుకని సర్వోపనిషత్ సారమగు భగవద్గీతలో యశ్శాస్త్ర విధిముత్సృజవర్తితే కామచారతః న నసిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిమ్‌॥ అనగా శాస్త్ర ప్రకారముగా నడుచుకొనకుండా తన ఇచ్ఛవచ్చిన రీతిని నడుచుకొన్నచో అతనికి సిద్ధులుండవు. సుఖముండదు. పరలోక గతులుండవు. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య విచారణే అందువలన ఓ అర్జునా ఏది చేయదగిన మంచి పని చేయకూడని చెడ్డ పని అను రెండు విషయములను నిర్ణయించుటకు శాస్తమ్రే ప్రమాణము. అందువలన దేవతాస్తోత్రములు ఎన్ని చేసినను మనుష్యునికి ఉపయోగము లేదు. ఆ స్తోత్రములవలన ఈశ్వరుడు ఎంత గొప్పవాడో అర్థమయి ఆయన చెప్పిన ధర్మశాస్తమ్రు ప్రకారము నడుచుకొన్నచో పరలోకగతలు సుఖముగా ఉండును.

- బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ