Others

అలుపెరుగని కృషీవలుడు.. గాడ్గేబాబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుల వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళును కడిగేయడానికి జీవితాంతం అలు పెరగని కృషిచేసిన మహానీయుడు ‘‘గాడ్గేబాబా.’’ కర్మయోగి. సామాన్యుని దగ్గరలో తన జీవన విధానం ఆయన సొంతం అయినా గాడ్గే అసలు పేరు దేబూజీ. మహారాష్టల్రోని అమరావతి జిల్లా పరిత్ అనే రజక కులంలో 1876 ఫిబ్రవరి 23న జన్మించారు గాడ్గే.
గాడ్గే తల్లిదండ్రులు ఘింగ్రాజీ, సక్క్భుయి. గాడ్గే అంటే మరాఠీ భాషలో మట్టి చిప్ప అని అర్ధం. అయితే గాడ్గే వేషధారణ నెత్తిమీద చిప్ప, చేతిలో చీపురు. రంగురంగుల గుడ్డ పీలికలతో కూడిన వస్త్రాలను ధరించేవాడు. నిరక్షరాస్యుడు అయిన గాడ్గే సంచార జీవి. సాధువు. కాని మహా జ్ఞానసంపన్నుడు. ఈ బాబా ఏ గ్రామం వెళ్ళినా చీపురుతో ఆ గ్రామాన్ని శుభ్రంచేయటం ఎవరికైనా పొలం పనో, ఇతర పనో చేసి తనకు అవసరమైన ఆహారాన్ని సంపాదించుకునేవాడు. దానిని తనతో తెచ్చుకున్న మట్టిచిప్పలో తినేవాడు. ఈ విధమైన జీవన విధానం అన్నివర్గాల ప్రజలు నచ్చి గౌరవించబడ్డాడు. గాడ్గే మొదటిగా పండరీపురం దేవాలయంవద్ద భక్తులకు స్నాన ఘట్టాలను నిర్మించాడు. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అనాధ శరణాలయాలు, ఆస్పత్రులు, పాఠశాలలు, వృద్ధాశ్రమాలు, గోశాలలు, వసతి గృహాలు, అంధులకు ఆశ్రమాలు నిర్మించాడు. అప్పటి సమాజం కులవ్యవస్థలో మగ్గుతూ ఉన్న తరుణంలో గాడ్గేబాబా నిర్మూలించే క్రమంలో ప్రతి గ్రామంలో సహపంక్తి భోజనాలు పెట్టించేవాడు. అక్షర జ్ఞానం లేని బాబా జీవితం అక్షరాస్యులకు ఒక పాఠం అంటే మహాజ్ఞాని ఒక విశ్వవిద్యాలయం. ఆయన చేసిన సేవలకు గాను మహారాష్ట్ర ప్రభుత్వం గాడ్గేబాబా మహారాజు పేరిట ఒక విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పటం జరిగింది. మహాత్మాగాంధీ ఒక సందర్భంలో గాడ్గేబాబా గురించి తెలిసి ఆ ప్రజలు మెచ్చుకొనే ఆ మనిషిని కలవాలని అనుకుంటూ కొన్నాళ్ళకు వార్ధాలో ఉన్న గాడ్గేబాబాను సమీపంలో సేవాగ్రామ్‌లోని ఆశ్రమానికి రావలసిందిగా సాదరంగా గాంధీ ఆహ్వానించటం జరిగింది. గాడ్గే నోటి ద్వారా వచ్చిన కీర్తనలను విని గాంధీ ఎంతో ఆశ్చర్యంగా ముగ్ధుడయ్యాడు. భక్త తుకారాంను గాడ్గే గురువుగా స్వీకరించాడు. నిరంతర సేవా తత్పరు డుగా పరోపకారం ఇదం శరీరం అన్నట్టుం డే కర్మయోగిగా సామాన్య మానవుడికి చేరువుగా జీవన విధానంతో గడుపుతూ ప్రజల మనస్సు దోచినాడు. అదే విధంగా కుల వ్యవస్థలో పేరుకుపోయిన కుళ్ళును కడిగే విధంగా తన జీవితాన్ని జీవితాంతం చేసిన కృషి నేటి యువతకు స్ఫూర్తిగా నిలవాలి.

- షేక్ ముస్త్ఫా అలీ