Others

కొబ్బరికాయ.. అంతరార్థం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుణ్ణి ఆరాధించటం, స్తుతించడం, కీర్తించడం, అర్చించడంలాంటివాటిలో ప్రతిరోజూ భగవంతుని ముందు కూర్చుని దేవుని షోడశోపచారాలు చేసి భగవంతునికి అషోత్తర శతనామావళులు పఠించి కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వడం భక్తులంతా చేసే పనే. కాని ఈ కొబ్బరి కాయ కొట్టడంలోని అంతరార్థాన్ని తెలుసుకొని ఈ క్రియను నిర్వర్తిస్తే పూజాఫలితం పూర్తిగా అందుతుందంటారు పెద్దలు. కొబ్బరికాయను పీచుతీసి కొట్టి అందులో నీటిని వేరుచేసి ఆ కొబ్బరిచిప్పలను శుభ్రపరిచి దేవునికి నివేదించడంలో శరీరంలోని మాలిన్యాలను, మానసిక మాలిన్యాలను కూడా తొలిగించుకుని నీ దగ్గరకువచ్చాను. నాలో మళ్లీ మాలిన్యాలను జొరబడనివ్వకుండా శారీరక మానసిక ఆరోగ్యవంతుని చేయమని భగవంతుని ప్రార్థించడమని కొందరు అంటే మరికొందరు ఆ టెంకాయను పగులకొట్టడంలో మనలోని అహంకారాన్ని బద్ధలు చేసి సర్వభూతాలయందు పరమాత్మను చూడడమే అంటారు. ఇంకొందరు కొబ్బరి కున్న మూడు కన్నులు సత్త్వరజోతమోగుణాలుగా భావిస్తే ఈ గుణాల వల్ల కలిగే మాయను దూరంచేసి భక్తితో త్రిగుణాతీతుడైన భగవంతుని హృదయాన్ని అర్పించడమని అంటారు. ఇట్లా చేసే ప్రతిక్రియలోనూ ఉండే అంతరార్థాన్ని తెలుసుకొంటే చాలు మనిషిలో పరివర్తన రావడానికి ఎక్కువ సమయం పట్టదు. భగవంతుని పట్ల ప్రేమను అంకురింపచేసే భక్తే సర్వప్రాణికోటిలోను చైతన్యరూపంలో ఉన్న పరమాత్మను గుర్తించేట్లు చేస్తుంది.

- సత్య