Others

నలుగురి మంఛి కోరితే...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోషం కోసం ఎక్కడో వెతక్కర్లేదు. అది మన మనసులో ఉంది అంటారు విజ్ఞులు. మనిషికి తృప్తి ఉంటే చాలు సంతోషం అదే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో సంతోషం ఉన్నా సరే పామరుడి దగ్గర నుంచి పండితుని వరకు అందరూ ఆనందాన్ని కోరుకునేవారే. తృప్తి స్వర్గాన్ని ఇలలో కనిపింపచేస్తే అసంతృప్తి సంతోషంగా ఉన్న ఇంటిని కూడా నరకాన్ని చేస్తుంది. గొప్పలకు పోవడం, లేనిది ఉన్నట్టుగా చూపించాలను కోవడం, ఒకరికి ఉన్నదని తమకులేదని అనుకోవడం, అందరికన్నా ఎక్కువగా ఉన్నతంగా తామే ఉండాలని మరొకరు ఉండకూడదనే ఆలోచనల వల్ల అసంతృప్తి కలుగుతుంది. అట్లాకాక ఉన్నదాంతో తృప్తిగా చాలు దైవం ఇచ్చినంత మనకు కావాల్సినంత ఉంటే చాలు అనుకొనేవారు అందరినీ సమానంగా చూచేవాళ్లు, ఎదుటి వాళ్లు కూడా నాతోపాటు సంతోషంగా ఉండాలని కోరుకునేవాళ్లు ఇలాంటి వాళ్లంతా నిత్య సంతోషులుగా ఉంటారు. భగవంతునిపైన అచంచల మైన విశ్వాసాన్ని పెంచుకుంటే, అందరినీ భగవదంశగా భావిస్తే అందరి లోనుభగవంతుడున్నాడన్న విశ్వాసంతో జీవిచడం అలవర్చుకుంటే నిత్యసంతోషంగా ఉండ వచ్చు అంటారు పెద్దలు.పరమహంస యోగానంద ప్రశాం తంగా ఉండడం నేర్చుకుంటే సంతృప్తి అలవడు తుందంటారు. స్థిత ప్రజ్ఞులంత జ్ఞానం లేకపోయనా ఏది జరిగినా అది భగవంతుడే చేయస్తున్నాడన్న భావాన్ని పెంచుకుంటే చాలు ఏ పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొన గల శక్తి వస్తుంది. ‘మనం సంతోషంగా ఉంటూ ఆ సంతోషానే్న నలుగురితో పంచుకుంటే అదే అసలైన సంతోషం అని బౌద్ధ గురువు కూడా ఉపదేశించారట. ప్రేమతత్వాన్ని అలవర్చుకుని ప్రతి ప్రాణిని ప్రేమగా చూస్తే చాలు సంతోషం దానికదే ఒనగూడుతుంది. పరోపకారాయ పుణ్యాయ - పరపీడ నాయ పాపాయ అంటుంది భారతం. మనలను ఎదుటి ఏది చేస్తే బాధ కలుగుతుందని అనుకుంటామో దాన్ని మనం ఇతరులకు చేయకుండా ఉంటే చాలు అదే ఎదుటివారికి చేసిన మేలు అంటారు కొందరు. మంచి చేసే అలవాటున్నవారికీ, మంచిని అభినందించే లక్షణాలున్నవారికీ మనసు హాయిగా ఉంటుంది. సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితం కూడా ఆనందమయమవుతుంది.

-చివుకుల రామమోహన్