Others

శ్రవణమే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మంచి మాట చెప్పినా వినేవాడుండడు. ఒకవేళ వింటే విన్నవాడు గొప్పవాడవుతాడు. మారీచుడు రాముణ్ణి గురించి గొప్పగా చెప్పినా రావణుడు వినలేదు. తన అనుభవంతో కలిగిన రామశబ్దం మహిమను గురించి ఎంత చెప్పినా వినలేదు. రావణాసురుడి చేతిలో మరణం కంటే రాముడి చేతిలో మరణం మంచిదని, రావణుడు చెప్పినట్లే బంగారు లేడిగా మాయదారిగా సీతారాముల ఆశ్రమం నందు తిరగడానికి మారీచుడు నిశ్చయంచుకుని వెళ్లాడు. ఆ మాయామృగాన్ని చూచిన సీత భ్రమించింది. బంగారు లేడి తెచ్చివ్వమని రాముని కోరింది.
లక్ష్మణుడు ఇదేదో మాయ అని గ్రహించాడు. సీతకు అది మాయ బంగారు లేడి అని తెలియజేశాడు. కాని ఆమె వినలేదు. రాముడికి తెలియజేశాడు. రాముడూ వినలేదు. లక్ష్మణా! అది మాయలేడి అయితే దాని చర్మము తీసుకొని వస్తా లేనియెడల ఆ లేడిని తెచ్చి సీతకు ఇస్తానని బయలుదేరాడు. కొంత దూరం వెళ్లిన తరువాత మాయా మారీచుడు లేడి రూపం వదిలి హా లక్ష్మణా! హా లక్ష్మణా అంటూ రాముడి గొంతుతో బిగ్గరగా అరిచి మరణించాడు.
కాని ఆ రాక్షసుని అరుపులై ఉండవచ్చు. తన అన్న రాముని గొంతు కాదని లక్ష్మణుడు అరుపు వచ్చిన దిక్కుకు వెళ్లలేదు. సీత, మీ అన్నకు ఆపద వచ్చింది. వెళ్లి రక్షించు అని లక్ష్మణుని కోరింది. కాని ఆమెకు విషయం వివరించాడు కాని సీతమ్మ చెప్పిన చోటుకు లక్ష్మణుడు వెళ్లలేదు. మాట వినని లక్ష్మణుని చూచిన సీత అపార్థం చేసుకుంది. అనరాని మాటలన్నది. నీవు రాముని మరణం కోరుకుంటున్నావు, నా నుంచి ఏదో ఆశిస్తున్నావు అని నిష్ఠూరంగా మాట్లాడింది. రాముని దగ్గరకు వెళ్లని లక్ష్మణుని పలువిధాలుగా నిందించింది. ఈ అపనింద మోయలేక లక్ష్మణుడు రాముని వెదకడానికి వెళ్లాడు.
కాని, రామాయణంలో ఈలక్ష్మణుడు మాట సీత వినకపోవడం వల్లనే మొత్తం రామాయణమంతా మలుపు తిరిగింది. ఇక సీత చుట్టూ రామాయణ కథంతా నడిచింది. కారణం లేకుండా కార్యం ఉండదు అని లోకోక్తి. లక్ష్మణుడు అటు వెళ్ళగానే రావణుడు దొంగ సాధు వేషంతో వచ్చి సీతాపహరణం చేసి లంకకు తీసికెళ్లాడు రావణుడు.
అట్లానే రావణునికి సీతమ్మ ను తెచ్చి అశోకవనంలో పెట్టినందుకు అట్లా చేయకూడదని ఎందరో చెప్పారు. వారందరి మాటను రావణుడు వినలేదు. చివరకు రావణుని పట్టమహిషి మండోదరి చెప్పింది. సీతమ్మ మహాశక్తి ఆమెను రాముని దగ్గరకు పంపించు మనకు మేలు కలుగుతుంది. లేకుంటే అంతా నాశనం అవుతుంది అని కాని రావణుడు వినలేదు. విభీషణుడు వచ్చి అన్నవు కనుక చెప్తున్నాను అని రాముడు ఎంతో గొప్పవీరుడు. చిరుత ప్రాయంలోనే రాక్షసులెందరినో మట్టుపెట్టాడు. అలాంటి రాముని ముందు నీవెంత. అయనా నీవు అధర్మమార్గాన సీతను తెచ్చావు మనకు వంశనాశనం కలుగుతుంది. నేను చెప్పినమాట విని సీతమ్మను రాముని దగ్గరకు పంపించు అన్నాడు. కాని రావణుడు వినలేదు.
చివరకు తన సొంత కొడుకులను, మంచి యోధులైన మంత్రులను,స ర్వసైన్యాన్ని పోగొట్టు కున్నాడు. ఆంజనేయుడు కూడా రావణుని దగ్గరకు వచ్చి మంచి హితవు చెప్పాడు. వంశ నాశనాన్ని కోరి తెచ్చుకోకు. రాముడంటే ధర్మమూర్తి. ధర్మం ముందు అధర్మం పనిచేయదు అన్నాడు. కాని రావఋడు వినక రామునితో పోరుకు దిగాడు. చివరకు తన ప్రాణానే్న కోల్పోయాడు.
ఇలా తనకు తాను తెలియక పోయనా మనకన్నా గొప్పవారు, మంచివారు చెప్పినమాటలను వినాలి. అందులో ధర్మం ఎంత ఉందో తెలుసుకోవాలి. మంచిచెప్పిన వారి మాటలను తప్పక విని తీరాలి. దాని వలనతనకే కాక తన వారందరికీ మంచి కలుగుతుంది. మంచి మాటలే మానవుడిని మహనీయునిగా చేస్తాయి. మంచి మాటలలో సత్యం ఉంటుంది.

-జమలాపురం ప్రసాదరావు