Others

మహిమాన్వితుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

త్రిలోక సంచారి నారదుడు కంసుని ఇంటికి వచ్చాడు. కంసుడు ఏకాంతంలో కూర్చుని వుండగా ప్రసంగవశాత్తు చెప్పినట్టుగా నారదుడు అతనితో నీవు పూర్వ జన్మలో కాలనేమి అనే రాక్షసుడవని, శ్రీహరి ఖడ్గానికి బలి అయ్యావు అని మందలో వున్న నందాదులు, దేవకీ వసుదేవులు మొదలైన వారంతా దివినుండి భువికి దిగివచ్చి మానుష రూపంలో వున్న దేవతలని ఆ శ్రీహరి దేవకీదేవి ఎనిమిదవ గర్భంలో జనించి దైత్యులను చంపడానికి ప్రయత్నిస్తాడని చెప్పి తన దోవన తాను వెళ్లిపోయాడు.
నారదుని మాటలు విన్నాక కంసునికి అదిరిపాటు కలిగింది. కలత చెందిన మనసుతో యాదవులంతా తనకు శత్రువులని తాను రాక్షస జాతికి చెందిన వాడినని భావించి తన చెల్లెలు బావగారైన దేవకీ వసుదేవులకు బేడీలు వేసి చెరసాలలో పెట్టి గట్టి కాపలా పెట్టించాడు. వారికి పుట్టిన ఆరుగురు పుత్రులను చంపివేశాడు. ఆ కోపంతో తండ్రి అయిన ఉగ్రసేనుని కూడా చెరలో పెట్టించి తానే శూరసేన దేశానికి రాజునని ప్రకటించుకున్నాడు.
దేవకి ఏడవ పర్యాయం గర్భవతి అయింది. అపుడు విశ్వరూపుడైన శ్రీహరి తన్ను నమ్మియున్న యాదవలకు కంసుని వలన భయం కలుగుతుందని తలచిన వాడై యోగ మాయాదేవికి ఇలా చెప్పాడు. భద్రా! నీవు గోపీ గోపకులు వున్న యాదవుల మందకు వెళ్లు. వసుదేవుని భార్యలను కంసుడు బాధిస్తూ ఉంటే వారిలో రోహిణి అనే ఆమెను నందగోకులంలో వుంచి వుంటాడు. దేవకీదేవి కడుపులో శేషరూపమైన నా తేజం వుంది. దానిని నువ్వు నేర్పుగా తీసుకునిపోయి రోహిణి గర్భంలో చేర్చు.
పిమ్మట నేను దేవకీదేవికి ఎనిమిదవ సంతానమై జన్మిస్తాను. ఆ తర్వాత నువ్వు నందుని భార్య అయిన యశోదకు పుత్రికవై పుట్టు అని చెప్పాడు. యోగమాయ శ్రీహరి ఆనతిని శిరసావహించి దేవకి గర్భంలో పిండరూప శిశువును తీసుకునిపోయి రోహిణి గర్భంలో చేర్చింది. ప్రజలందరు దేవకికి గర్భస్రావం జరిగింది అనుకున్నారు.
రోహిణికి పుట్టిన బాలుడు అతి బలవంతుడు కావడం చేత భద్రాకారం కలిగిన వాడగుట చేత బలభద్రుడని వారి నందరినీ సంతోషపడేట్టు రమింపచేసేవాడు కనుక (బల)రాముడనీ, ఒకరి గర్భం సంకర్షం అయి మరొకరికి పుట్టాడు కనుక సంకర్షణుడని ఇలా మూడు పేర్లతో బలరాముడుగా ప్రసిద్ధుడయ్యాడు.

- ఎస్.్ధర్మారావు