ధర్మసందేహాలు

అంగన్యాస కరన్యాసాలు అవసరమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిత్యానుష్ఠానంలో ప్రతి మంత్రానికీ అంగన్యాస కరన్యాసాలు విడివిడిగా చేసి తీరాలా?
- బి.రాజేశ్వరమూర్తి, మచిలీపట్నం
దేవతా ఉపాసన అంటే, ఆ దేవతతో తాదాత్మ్యస్థితిని పొందటమే. దానికి సంకేతంగానే ప్రతి మంత్రానికీ అంగన్యాస- కరన్యాసాలనే ప్రక్రియలు రూపొందాయి. న్యాసం అనగా వుంచుకొనుట- లేక ఆరోపించుకొనుట- అని భావం. ఆ దేవతను తనలో ఆరోపించుకొని, దేవతతో తాదాత్మ్య స్థితిని అనుసంధానం చేసుకోవటమే ఈ న్యాసాల పరమార్థం. కనుక, ఏ మంత్రానికామంత్రం విడిగా న్యాసాలను ఆచరించటమే ప్రశస్తం.
* మా మిత్రులు ఒకరు బాగా దానధర్మాలు చేసుకున్నారు గానీ, వారి పుత్రులు నాస్తికులైనందువల్ల వీరి అపర కర్మలు జరిపే పరిస్థితి లేదు. వీరి అల్లుళ్ళలో ఎవరైనా ఒకరు వీరికి అపరకర్మలు చేయవచ్చునా?
రత్నంరాజు, హైదరాబాదు
ఆ అల్లుళ్ళకు ఆస్తిమీద ఆశ లేకపోతే నిరభ్యంతరంగా చేయవచ్చు. కాకపోతే కర్తవ్యాన్ని జ్యేష్ఠపుత్రుడి మీద వేసి, అతని పక్షాన రుూ కార్యక్రమం జరుపుతున్నట్లుగా సంకల్పాదులలో చెప్పవలసి వుంటుంది.
* ఒక సోదరుడు మరణిస్తే మిగిలిన సోదరులు, వారి కుటుంబ సభ్యులు గూడా ఆశౌచాన్ని పాటించాలా? ఎన్నాళ్ళు పాటించాలి?
- వి.బాలకేశవులు, గిద్దలూరు
జ్ఞాతివర్గం వారంతా పాటించవలసిందే. ఆయా వర్ణాలలో వున్న వంశాచారాన్నిబట్టి బ్రాహ్మణులలో 10రోజులు, ఇతరులలో 12, 13, 14 రోజులు- ఇలా ఆశౌచాన్ని పాటించాలి.
* జాతాశౌచ మృతాశౌచాది సందర్భాలలోగాక, నూతన యజ్ఞోపవీతాన్ని ఎన్ని రోజులకొకసారి ధరించాలి? (పి.సూర్యనారాయణ, చిలకలూరిపేట)
యజ్ఞోపవీతం చెడిపోకుండా వుంటే, ఎన్నాళ్ళైనా వుంచుకోవచ్చు. దంధ్యాల పూర్ణమినాడు మాత్రం మార్చుకోవలసిందే కదా!

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035.