ధర్మసందేహాలు

అశ్వత్థామకు శిక్ష లేదెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అహల్యకు ఇంద్రునివల్ల అపవిత్రత కలిగిందని ఆమెకు శాపమిచ్చి పవిత్రురాల్ని చేశారు. బృహస్పతి భార్య అయిన తార చంద్రునివల్ల బుద్ధగ్రహాన్ని పుత్రుడుగా కన్నది. ఐనా ఆమెకు ఏ శాపమూ లేదు. ఇదేమి న్యాయం?
- టి.యస్.ఆర్.ఆంజనేయులు
గౌతమాహల్యలు కేవలం మానవులు, పైగా సాధకులు. తారాచంద్రులు దేవలోక నివాసులైన మానవాతీతులు. వారి సంతానం కూడా మానవాతీతమైన బుధగ్రహమే. వారికి మానవ ధర్మశాస్త్రాలు వర్తించవు. అదీగాక తారకు శాపం కలగలేదు కానీ, బృహస్పతిగారి కోపదృష్టివల్ల భస్మమై, మళ్ళీ శుక్రుడి మృత సంజీవనీ విద్యవల్ల పునరుజ్జీవితురాలయింది. అందువల్ల ఆమె దోషం ప్రక్షాళితమైందని పురాణగాథ వుంది.
* ప్రకృతి,ప్రాణికోటి, సర్వలోకాలు అనే సృష్టి లేకుండా వుంటే ఎవరికి నష్టం?
- సి.హెచ్. మోహన్‌రాజ్ , విజయవాడ
జీవులమైన మనకే నష్టం. జన్మ పరంపర అనేది అనాది. దీనికి మొదలు లేదు. ఈ విషయాన్ని శాస్త్రాలలో పలురీతులుగా నిరూపించారు. ఈ అనాది జన్మ పరంపరలో జీవుడు క్రమవికాసం చెందుతూ దివ్యత్వాన్ని అందుకోవలసి ఉంది. ఈ ప్రక్రియకు సహాయం చేయటం కోసమే ఈ అనంత సృష్టి ప్రక్రియ భగవంతుని చేత నిర్వహింపబడుతోంది. ఇది ఆగిపోతే మనకే నష్టం.
* చంద్రుడు పూర్ణమి నాడు మనకు నిండు వెనె్నల ఇచ్చి ఆహ్లాద పరుస్తున్నాడు కదా. చంద్రుని గురించి పూజలు పురస్కారాలు చేయడం లేదెందుకని? చంద్రుడు దైవం కాదా?
- శైలేంద్ర, సూర్యాపేట
అది మన తప్పే గాని శాస్త్రాల తప్పు కాదు. వ్రత రత్నాకరం, శాంతికమలాకరం వంటి గ్రంథాలు చూడండి. చంద్ర సంబంధ వ్రతాలు ఎన్ని కనిపిస్తాయో.
* కురుకుటుంబంలోనే దుర్యోధన సమవయస్కుడుగా జన్మించిన వాడు యుయుత్సుడు కానీ అదే కుటుంబంలో విచక్షణకు ఎందుకు గురి కావాల్సి వచ్చింది. - సి. హెచ్. రాజు, నెల్లూరు
అతడు ధృతరాష్ట్రుడికి వైశ్య భార్య యందు (అనగా ఒక భోగపత్ని యందు) జన్మించిన వాడు. అందువల్లే దుర్యోధనాదులతో అతనికి సమస్థాయి లేదు. కనుక కొద్దిపాటి విచక్షణ అతనికి తప్పదు. భారత యుద్ధసమయంలో ధర్మరాజు, పెద్దలందరికీ నమస్కరించి ఆ పక్షంలోని తన పక్షంలోకి రాదలుచుకున్నవారుంటే ఇప్పుడే రమ్మని ఎలుగెత్తి చాటాడు. యుయుత్సుడొక్కడే ధైర్యం చేసి దుర్యోధన పక్షం నుంచీ పాండవ పక్షంలోకి చేరాడు. దానివల్ల ధృతరాష్ట్ర పుత్రులలో ఇతడొక్కడే చివరిదాకా జీవించి ఉండగలిగాడు. 1
* నా తల్లి ఇటీవలే గతించింది. నేను నిత్య పూజలు చేసుకోవచ్చునా? నిత్యమూ గుడికి వెళ్ళవచ్చునా?
- ఆర్.ఆర్.శ్రీకర్, మంచిర్యాల
అపరకర్మలు పూర్తయినాక, నిత్య పూజలు యథావిధిగా చేసుకోవచ్చును. విశేష వ్రతాదులు చేసుకోరాదు. గుడికి వెళ్ళి దర్శనము చేసుకోవచ్చును. మీ పేరుతో ప్రత్యేక పూజలు తగవు.
* మహాభారత యుద్ధంలో ఉపపాండవుల తలలు నరికిన అశ్వత్థామను అర్జునుడు ఏమీచేయలేకపోయాడు. కారణమేమిటి?
- వి.బాలకేశవులు, గిద్దలూరు
అతడు తమ గురు పుత్రుడవటమే.
* దశావతారములలో కొందరు బుద్ధుని, కొందరు కల్కిని, అవతారములుగా చూపిస్తారు. ఏది ఉచితం?
- నీరజ, నెల్లూర్
కల్కి దశమావతారమనటంలో సందేహం లేదు. బుద్ధుణ్ణి అవతారంగా కొన్ని పురాణాల్లో చూపించారు. కొన్నింట్లో చూపలేదు. ఇక్కడ బుద్ధుడంటే శుద్ధోదనాదేవి పుత్రుడైన గౌతమబుద్ధుడు కాదు. ఇతడు కృతయుగంలో జాలంధర వధకై జన్మించిన బుద్ధుడు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి