ధర్మసందేహాలు

భగవంతుని స్మరణ నిత్యకర్మలతోనూ చేయవచ్చా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నిత్య జీవితంలో ఆఫీసు పని మొదలైన కర్మలను చేసుకుంటూనే భగవన్నామ స్మరణం చేసుకోవచ్చా? అందువల్ల సత్ఫలితాలు కలుగుతాయా?
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
నిస్సందేహంగా కలుగుతాయి. నిత్య జీవిత వ్యవహారాలను చేసుకునే సమయంలో మనస్సును భగవంతుని మీద లగ్నం చేయాలనే ధర్మ శాస్త్ర గ్రంథాలు, ఉపాసనాగ్రంధాలు ఏకకంఠంగా ఘోషిస్తున్నాయి.
* మనకున్న రెండు చేతులలో కుడి చేతికి మాత్రమే ప్రాముఖ్యం ఉంది ఎడమ చేతికి అంత ప్రాముఖ్యం లేదు. కొన్ని అవయవాలే ముఖ్యమైనవి అంటూ ఉంటాయా? దీనికి ఏదైనా ప్రమాణం ఉందా? - నిర్మల, తార్నాక
శరీరంలోని ఏ అవయవమూ నిరర్థకం కాదు. ఏ అవయవానికి వుండే ఉపయోగం దానికి వుంది. కుడి చేతికి ప్రాధాన్యం ఇస్తున్నామనుకోవడం ఒక భ్రాంతి మాత్రమే. మానవ మస్తిష్కంలో కుడి ఎడమ భాగాలు రెండూ సమానంగా లేవు. వాటి ప్రభావంవలననే మానవ శరీరంలోని కుడి ఎడమ భాగాలు, కొంచెం హెచ్చుతగ్గులుగా పనిచేస్తూ వుంటాయి. ఇది ప్రకృతి సిద్ధమైన చర్య. ధర్మశాస్త్రం కూడా దీనినిబట్టే నడుస్తూ వుంటుంది.
* పెండ్లిలో వల్లెవాటుకున్న ప్రాధాన్యత ఏమిటో వివరించగలరు.
- నాగలక్ష్మి, విజయవాడ
వివాహమనేది ఒక యజ్ఞదీక్ష వంటిది. దీనిలో వధూవరులిద్దరూ 4 1/2 రోజులు దీక్షాధారులై వుండాలని సూత్రకారులు నిర్ణయించారు. దీక్షలో భాగంగా వధువు రెండు వస్త్రాలను ధరించాలి. రెండవ వస్త్రంగా వల్లెవాటు అనేది ప్రాంతీయాచారంగా రూపొందింది.
*హిందూమతంలో ధర్మశాస్త్రానికి పాముఖ్యం ఎందుకు ఎక్కువ?
- సందేహాల రావు, హైదరాబాదు
హిందూ మతం అనేది కేవలం మతం కాదు అదొకసనాతన ధర్మం. వేద ధర్మం మతం అనేది ఆ తర్వాత చాలా లక్షల సంవత్సరాల తరువాత పుట్టింది.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి