ధర్మసందేహాలు

మనసుపై తిథి ప్రభావం ఎంత?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అమావాస్య తిథికి మెదడు మీద ప్రభావం ఉంటుందా? (డి.వి.ఆర్.సుబ్బారావు, హైదరాబాద్)
పూర్ణిమ, అమావాస్యాలు రెండు కూడా చంద్ర ప్రభావం భూమి మీద అధికంగా పడే రోజులు. చంద్రుడు మనసుకు అధిపతి. అందువల్ల ఈరోజుల్లో మానవ మస్తిష్కాల మీద చంద్రప్రభావం అధికంగా ఉంటుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ప్రభావం స్ర్తి పురుషులలో ఎవరిమీదైనా ఉంటుంది. అయితే ఈ ప్రభావం మనస్సు దుర్బలంగా ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తమవుతుంది. మనసు పటిష్టంగా ఆరోగ్యంగా వున్నప్పుడు ఈ ప్రభావం క్రియాకారి కాదు. ఈ విషయాన్ని ఆధునిక మనస్తత్వ వేత్తలు కూడా అంగీకరిస్తున్నారు.
* మేనరికం చేసుకుంటే పిల్లలు సరిగా పుట్టరని చెపుతుంటారు. అది ఎంతవరకు నిజం? (నల్లపాటి సురేంద్ర, కొత్తగాజువాక)
మేనరికం అనే విధానం ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాల్లో మాత్రమే విస్తారంగా కనిపిస్తోంది. ఉత్తరాదిన ఇది పూర్తిగా నిషిద్ధం. ధర్మ శాస్త్ర గ్రంథాలన్నీ ఈ నిషేధానే్న బలపరుస్తున్నాయి. అయితే ఆంధ్ర పండితులు మేనరిక వివాహాలను సమర్ధించడానికి కొన్ని వేద వాక్యాలను ఉదహరిస్తున్నారు. ఆధనిక వైద్య నిపుణులు సన్నిహిత మేనరిక సంబంధాలవల్ల సంతానంలో అంగవైకల్యాది లోపాలు వుండవచ్చని హెచ్చరిస్తున్నారు. అందుచేత మీరు చెప్పే విషయాన్ని పూర్తిగా కొట్టేయలేము.
* గురుపత్నితో సంచరించిన చంద్రుడు పూజనీయులైన నవగ్రహాలలో స్థానాన్ని ఎలాసంపాదించాడు (సి.ప్రతాప్, శ్రీకాకుళం)
తారా చంద్ర సమాగమనము అనేది ఒక సాంకేతికమైన పురాణ గాథ. బృహస్పతి, తార- అనే నక్షత్రాలు సామాన్యంగా దగ్గరగా వుంటాయి. గనుక వారిని దంపతులుగా పురాణాలు వర్ణించాయి. అయితే గ్రహసంచార క్రమంలో తార అనబడే నక్షత్రం అప్పుడప్పుడు చంద్రునికి దగ్గరగా వస్తుంది. దీనినే తారాచంద్రుల అక్రమ సంబంధంగా పురాణాలు చమత్కరించాయి. అది గ్రహగోళాలలోని సంచారాలను వర్ణించే ఒక విచిత్ర వర్ణనా శైలి. అందువల్ల ఈ గాధను యథార్ధ మానవగాధగా తీసుకోరాదు. చంద్రుడికి దోషాన్ని ఆపాదించరాదు. చంద్రుడు ఈశ్వరుడి గురించి సోమనాధ క్షేత్రంలోను కాశీ క్షేత్రంలోను. విశేష తపస్సు చేసి గ్రహ పదవిని పొందిన పుణ్యాత్ముడని మనం మరిచిపోరాదు..
* ధర్మనాశకులైన రాక్షసులకు కులగురువై, వారికి రక్షా కవచంగా నిలిచిన శుక్రాచార్యుడు మనకు పూజ్యుడు ఎలా అవుతాడు?
(సి. ప్రతాప్, శ్రీ కాకుళం)
రాక్షసులలో అందరూ పాపాత్ములే అనుకోవడం పొరపాటు. శుక్రాచార్యుడు అధర్మాన్ని ప్రోత్సహించాడు అనుకోవడం కూడా పొరపాటే. దేవతలు రాక్షసులు అనేవారు ఒకే తండ్రి బిడ్డలు. రెండువర్గాల పుత్రులకూ తండ్రి అయిన కశ్యపుడు మంచి మంచి గురువులను ఏర్పాటు చేసాడు. రాక్షసుల్లో కొందరు శుక్రాచార్యుల గురుత్వాన్ని దుర్వినియోగం చేసుకున్న మాట నిజమే. అయినప్పటికీ శుక్రాచార్యుడు ధర్మానుసరణ విషయంలో తన హద్దు తాను ఎప్పుడూ దాటలేదని పురాణాల్లో కనిపిస్తోంది. కనుక ఆయన పూజ్యత్వానికి లోటు లేదు.