ధర్మసందేహాలు

తల్లికి అపరకర్మలు చేసే బాధ్యత ఎవరిది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అశ్వత్థామకు చిరంజీవిగా ఎవరు వరం ఇచ్చారు?
- కృష్ణకుమారి, నకిరేకల్లు
అశ్వత్థామ తన స్వీయ తపోబలం చేత చిరంజీవిత్వం సాధించినట్లు కనిపిస్తుంది.
* ఒక శూద్రుడు తపస్సు చేయడంవల్ల ఒక బ్రాహ్మణ కుమారుడు మరణించాడనీ, శ్రీరాముడు ఆ శూద్రుని సంహరించగా ఆ బ్రాహ్మణ పుత్రుడు మళ్లీ జీవించాడనీ రామాయణంలో వున్నదట గదా! వివరించగలరు?
రామాయణంలో కథాక్రమం ఇలా వుంది. శంబూకుడు అనే శూద్రుడు సశరీరంగా దేవేంద్ర పదవిని పొందగోరి, లోకోపద్రవకారకమైన విధానంలో ఘోరమైన తపస్సు చేయసాగాడు. దానికి ఫలితంగా నాలుగు పాదాలలోనూ ధర్మం నడుస్తున్న రామరాజ్యంలో ఒక బ్రాహ్మణ కుమారుడికి అకాల మరణం సంభవించింది. దానికి కారణం ఏమిటి అని అనే్వషించిన శ్రీరాముడు శంబూకుడి స్వార్థచింతనతో కూడిన లోకోపద్రవకారకమైన తపస్సే తన రాజ్యంలోని అకాల మరణానికి కారణమని గుర్తించి, శంబూకుణ్ణి స్వయంగా వధించి, తన చేతిలో మరణించినందుకు ఫలితంగా స్వర్గలోక ప్రాప్తిని అనుగ్రహించాడు. ఆ మరణశిక్ష స్వార్థచింతతో కూడిన తపస్సుకే కానీ శూద్రత్వానికి కాదని మనం గ్రహించాలి.
* మా తల్లిగారు మా చిన్నతనంలోనే గతించారు. మా తండ్రిగారు జీవించి ఉన్నారు. మేము మా తల్లి గారికిపిండ ప్రదానం చేయవచ్చునా?
సామాన్యంగా తండ్రి జీవించి ఉండగా పుత్రులు అపర కర్మలను చేయరాదు. కానీ ఈ సూత్రం కన్నతల్లి విషయంలో వర్తించదు. వారు తమ మాతృదేవతకు పిండ ప్రదానాలు చేసితీరాలి. పుత్రులు విడివిడిగా జీవిస్తూ ఉండి ఉంటే ఎవరింట్లో వారు పిండ ప్రదానాలు చేయవచ్చును. అది కుదరకపోతే అందరూ కలసి ఏ ఒక్కరింట్లో అయినా చేయవచ్చు.

కుప్పా వేంకట కృష్ణమూర్తి