Others

మాయామానుష వేషధారి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణావతారంలో కృష్ణుడు పుట్టిన మొదలుకొని ఆయన నిర్యాణం దాకా జరిగిన ప్రతి సంఘటనా మానవలోకానికి ఆదర్శమైందే. జీవుడు ఏవిధంగా మానవలోకంలో మసులుకోవాలో తెలియచేసే సంఘటనలే కాదు మానవవికాసానికి, జీవాత్మనే పరమాత్మ అని తెలియజేసే వృత్తాంతాలే ఎక్కువ. లోకంలో ఉన్నది ఒక్కటే. ఆ ఉన్నదానే్న ఉన్నసత్యాన్ని బహుకోణాల్లో విశే్లషించినట్లు ఉన్న సత్యాన్ని పలువురు పలువిధాలుగా చెప్తున్నారు. భగవంతుడు ఒక్కడే. కాని భగవంతుని సృష్టిలోని ఏ ప్రాణి ఏవిధంగా తన్ను చూడాలని వాంఛిస్తుందో ఆవిధంగా కనబడే దయాళువు భక్తసులభుడు శ్రీకృష్ణపరమాత్మ అని ప్రతి పదమూ చెప్తుంది. పుండరీకుడు తన తల్లి తండ్రుల సేవలో పునీతవౌతూ శ్రీకృష్ణుడు వచ్చాడన్నా కాసేపు ఆగవయ్యా అంటే ఆగిన ఆ పరమాత్మనే గజేంద్రమోక్షంలో గజేంద్రుడు ఉన్నపళాన వచ్చి నన్ను కాపాడమంటే సిరికిం చెప్పక అని ఆడే పాచికలను వదిలి, కొంగుపట్టి కూర్చోబెట్టుకున్న ఆలితో మాటమాత్రమైనా చెప్పక తన భక్తుని కోరిక మేరకు కూర్చున్నవాడు కూర్చున్నట్లే పైకి లేచి అలా పరుగెత్తుక వచ్చేసాడు. అలా పరుగెత్తే కృష్ణయ్యనుచూచి లక్ష్మీదేవి, గరుడుడు కూడా వెంట వచ్చారు. వైకుంఠవాసులంతా ఏ భక్తుని రక్షణార్థం ఆఘమేఘాలపైన వెళ్తున్నాడో ఆహా! ఆ భక్తుడెంత పుణ్యాత్ముడో అంటూ ఆకాశపధాన వారు వచ్చి, తన సుదర్శన చక్రంతో మకరిని సంహరించి గజేంద్రుని కాపాడిన ఆ శ్రీకృష్ణ్భగవానుని భగవంతుడంటే నీవే స్వామి భక్తుని కష్టాన్ని చూడలేని పరమ కారుణ్యమూర్తివి అంటూ కొనియాడారు. అంతేనా కృష్ణావతారంలో తనతో పాటు చదువుకున్న కుచేలుడు పెరిగి పెద్దవాడై సంసార చక్రంలో యిరుక్కుని నానాయాతనలు పడుతున్నా తననే నిత్యం స్మరిస్తున్నా పట్టించుకోనట్టే ఉన్నాడా కృష్ణుడు. కృష్ణతత్వాన్ని ఎరిగిన మనుజులందరూ ‘‘ఏమీ ఈ కృష్ణుడు కుచేలునిపై దయచూపడా’’ అని ఆశ్చర్యపడేటట్లుగా నిమ్మకున్నాడు. కాని తన భార్య ప్రోదల్భంతో తనకోసం చినిగిన అంగవస్త్రంలో పిడికెడు అటుకులు తెచ్చి అవి ఇవ్వడానికి తటపటాయించి, కృష్ణుని చూచిన ఆనందంలో మునిగి పోయి ‘‘కృష్ణా కృష్ణా రుక్మీణీపతే ’’అని పలవరించే కుచేలుని కాళ్లు కడిగి తన తల పైనా, తన అర్థాంగియైన రుక్మిణీ తలపైనా ఆ కాళ్లు కడిగిన ఉదకాన్ని పరమ పవిత్రం అంటూ చల్లుకుని దగ్గర కూర్చోబెట్టుకుని పంచభక్ష్యపరమాన్నాలను ఆరగింపు చేసి ఆమాట ఈ మాట మాట్లాడుతూ ఉయ్యాల పలకపై కూర్చున్నాడు కృష్ణుడు. ఇహపరచింతను మాని తన్మయావస్థలో ప్రక్కన కూర్చుని పరమాత్మతో సమానంగా కూర్చున్న నేను ఎంత భాగ్యవంతుడినో కదా అని మురిసే కుచేలుని అంగవస్త్రంలో మూట కట్టుకొచ్చిన అటుకుల మూటను తనకై తాను అడిగి తీసుకొని పిడికెడు అటుకులు నోట్లో పోసుకుని ‘‘ఆహా! ఎంతమధురంగా నీ స్నేహం వలె ఈ అటుకులు తీయగా ఉన్నాయి’’ అనే కృష్ణుని మరింత చోద్యంగా చూచాడు కుచేలుడు. కృష్ణకుచేలురిద్దరిని అక్కడ ఉన్న నారీజనం, దాసీ జనం, పరవార మిత్రజనం చూచి ‘‘ఎంతటి పూర్వపుణ్యచరితుడో ఈ కుచేలస్వామి ’’అని నోట్లో తడియారగా వింతగా చూస్తూ ఉండిపోయారు. అటువంటి కృష్ణుని ఈ మానవలోకంలో గుడి కట్టి పూజించని వాడ ఉంటుందా? కృష్ణ పటమో, కృష్ణుని మూర్తినో పెట్టుకుని ఆరాధించని ఇల్లు ఉంటుందా. సర్వం కృష్ణమయం కనుక కృష్ణుడు పుట్టి పసికందుగా ఉన్నప్పుడే పూతనాసంహారం చేశాడు. దోగాడే వయస్సులోనే శకటాసుర భంజనం చేశాడు. కాస్త పెద్దఅవుతుండగానే కంస సంహారం చేశాడు. అసలు ఆ కృష్ణయ్య పుట్టింది అధర్మనాశనం చేయడానికే. రాక్షసులను మధాంధులను మట్టుపెట్టడానికే. అందుకే ఎక్కడ ధర్మం దారితప్పుతుందో అక్కడ నేను ఉద్భవిస్తాను. అధర్మాన్ని కాలరాచి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అని ఘంటాపధంగా చెప్పాడు ఆ మాయామానుషవేషధారి. అందుకే మనమందరమూ కృష్ణ నామస్మరణ విడువక చేద్దాం. ధర్మాచరణలో మన మానవజన్మను పునీతం చేసుకొందాం.

- చివుకుల రామమోహన్