Others

వందే కృష్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణావతారం సర్వులకూ ఆమోదయోగ్యమైంది. శ్రీకృష్ణుణ్ణి దుష్టులు సైతం తప్పుపట్టలేరు. శశిపాలుడు కృష్ణుని పైన 100 తప్పులు చెప్తానని చెప్పినా వాటిలోఎంత తప్పులున్నాయో వాటిని విన్నవారందరికీ బాగాతెలుసు. తప్పెరిదో తెలుసు. అందుకే ఎవరైనా సరే శ్రీకృష్ణుని తలవకుండా ఉండలేరు. హరహరబ్రహ్మాదుల నుండి, సామాన్యమానవులవరకు అంటే పండితులతోపాటు పామర జనం కూడా హరే కృష్ణా అని అనకుండా ఉండలేరు. అటువంటి మహిమాన్వితమైన శ్రీకృష్ణ్భగవానుడు వెన్నదొంగగా కీర్తించినా, గోపీజన మానస లోలుడని సంభావించినా, యోగుల హృదయాల్లో నిత్యనివాసితుడుగా స్తుతించినా అది ఆ శ్రీకృష్ణునికే చెల్లింది. శ్రీకృష్ణుని దివ్యపాదారవిందాన్ని చూడాలని ఆయన ముగ్ధమోహన మురళీ రవాన్ని గ్రోలాలని ఎందుకు అనుకోరు. అందరూ శ్రీకృష్ణ్భక్తులమని చెప్పుకున్నా నిజానికి ఆయన హృదయంలో ఎవరుంటారో ఎన్నో కథల ద్వారా వ్యక్తం చేశాడా గోపాలబాలుడు. తనకు శిరోవేదన అని ఓసారి అల్లలాడిపోయాడు. దాసీదాసీజనం, అష్టమహషులు బెంబేలెత్తారు. రాజవైద్యులతో పాటుగా దేశంలోని అందరు వైద్యులు ఆ మహానుభావుడి శిరోవేదన ఎలాగైనా తగ్గించాలని పరుగులు పెట్టారు. ఆ సమయంలోనే లోకకల్యాణ కర్త, లోకపావనుడు, త్రికాలవేత్త నారదుడు ఏతెంచాడు. ఆయన విషయం గ్రహించాడు. ఎందుకంటే ఆయనా కృష్ణ్భక్తుడేగా. అందుకే వెంటనే చెప్పాడు. ఈ గోపాల బాలుని శిరోవేదన తగ్గాలంటే మంచి భక్తులైనవాళ్లు, కృష్ణునిపైన అచంచలమైన నమ్మకమున్నవాళ్ల పాదధూళి తీసుకొచ్చి పూస్తే చాలు ఈ భారం మాయమవుతుంది అన్నాడు. వెంటనే ఎవరున్నారు అని ఆబాలగోపాలమూ వెతుకులాట ప్రారంభించింది. కాని తాము కూడా ఆ పురోషోత్తముని భక్తులమని అనుకోలేదు. ఆ మాట ఆనోట ఈనోట పడి ఊరంతా వ్యాపించింది.
చెరువుల్లో నీళ్లు తెచ్చుకుంటున్న ఆ గోపికలకు అందింది. వారు వెంటనే అప్రమత్తులైనారు. తమ తమ పాదధూళిని సేకరించుకుని పరుగుపరుగున వచ్చి ఆ గోపాలబాలుని శిరస్సుకు అలదారు. అక్కడ గుమిగూడిన జనం అవాక్కయ్యారు. అయ్యో అయ్యో అపచారం అంటూ బుగ్గలు నొక్కుకున్నారు. కొంతమంది మరీ వద్దని వారించారు. కాని ఆ గోపీజనం అన్నారు. మాకు ఎంత పాపమైనా చుట్టుముట్టనివ్వండి. మా గోపదేవుడు యశోదానందనుడు, నందనందుడు, సత్యభామావిధేయుడు, రుక్మిణీపతి ఇలా శిరోవేదనను అనుభవిస్తుంటే మేము చూస్తు ఊరుకోగలమా. ఆ ప్రియాతి ప్రియనేస్తం, మా మానసులను కొల్లగొట్టిన చిరంజీవి, మా ఇండ్లను పాలు పెరుగు మననీయకుండా చేసినవాడు అయిన బాలుడిని చూస్తు ఊరుకోగలమా అని వారు వాపోయారు. అంతలో ఆ మాయా మానుషవిగ్రహధారి శిరోవేదన దూరం అయ్యిందని చిరునవ్వు ఒలికించాడు. ఆహా! చూశారా ఆ యదుబాలుని చోద్యం. వింతలకే వింతైన ఆ దేవకీసుతుని ఆగడం ఇలా కృష్ణుని కథలు వింటూ ఉంటూ చాలు జన్మ తరించిపోతుంది కదా. అందుకే మాటలోనైనా చేతలోనైనా కృష్ణస్మరణం చేయకుండా ఉండలేరు అంటే నమ్మండి. శ్రీకృష్ణానమోస్తుతే !

- హనుమాయమ్మ