Others

వౌనం వెండి.. మాట బంగారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వౌనము మూర్తిమంతమైన దక్షిణామూర్తివంటివారు శ్రీరమణ మహర్షి. అతని వాక్కు ఋషుల ఉపదేశం. అద్వైత సారాన్నీ, ఉపనిషత్తులందించిన ఆత్మ తత్త్వాన్నీ, బోధామృతంగా ప్రపంచానికి పంచి ఇచ్చారు. ప్రేమమూర్తి, జ్ఞానమూర్తి, కారుణ్యమూర్తి రమణ మహర్షి. నిరాధారుడై గగన సమానుడై, పూర్ణుడై, నిశ్శబ్దుడై, గురుస్వరూపమై వెలుగు పరబ్రహ్మము రమణమహర్షి. 1878లో జన్మించిన వెంకట్రామన్ పదహారేళ్ల వయసులో అనూహ్య సంఘటనలో ఆత్మానుభవం పొంది, ఆదిశంకరుల ఆత్మవిద్యను కరతలామలకం చేసుకుని అనుభవంలోకి తెచ్చుకున్న స్వయంభువు.
ముప్పదేళ్ళ వయస్సు వరకు తిరువణ్ణామలైలోని అరుణాచల గుహలో కూర్చుని హృదయ కుహరంలో ఆత్మ స్వరూపాన్ని దర్శించారు. చిన్నప్పుడు తమిళంలో చదివిన ‘పెరియపురాణం’ తప్ప ఏమీ చదవని రమణ మహర్షిని చదువుల్లో సారమంతా హృదయాంతర్గతమైంది. వౌనంలో దక్షిణామూర్తిగా, అది వీడితే శంకర భగవత్పాదులుగా తలపిస్తారు. 1907వ సంవత్సరంలో కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని ప్రశ్నలకు సమాధానం చెప్పేటందుకు ప్రప్రథమంగా వౌనం వీడారు. వారి సమాధానాలు విన్న గణపతిముని వెంకట్రామన్‌గా తల్లిదండ్రులు పెట్టిన పేరును కాదని ‘్భగవాన్ రమణ మహర్షి’గా మార్చారు. ఈయన ఈ యుగంలో అవతరించిన అవతార పురుషులన్నారు. వెంటనే అతనిని తన సద్గురువుగా సంభావించి ‘రమణ పంచకం’ రాసి గురుదక్షిణగా సమర్పించారు. దానిని స్వీకరిస్తూ ‘సరే నాయనా’ అన్నారు. నాటినుంచి ఆ గురుశిష్యులిద్దరూ నాయన- గణపతులుగా అరుణాచలేశ్వర, ......... (పార్వతీ పరమేశ్వరుల) తనయులుగా ప్రపంచ ప్రసిద్ధి పొందారు.
నాటినుంచి తనను చూడవచ్చేవారితో క్లుప్తంగా మాట్లాడేవారు. అందరితో కలిసి భుజించేవారు. వారికిగల సందేహాలను తన అనుభవాలను రంగరిస్తూ, ఆధ్యాత్మిక గ్రంథాలను ఉటంకిస్తూ తీర్చేవారు. ఎప్పుడు చెప్పినా ఎవరికి చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా సత్యం మారదు. ఉన్నది ఒక్కటే. ఆ సత్యాన్ని అవతలివాళ్ళకు తెలిసేటట్లు చెప్పడమే రమణుల విశిష్టత. రమణ మహర్షి తనను చూడడానికి వచ్చేవారిని నియంత్రించడానికి సహించలేకపోయేవారు. దూర ప్రాంతాలనుంచి వచ్చి ఎందరో తమ గోడును వినిపించుకునేవారు. అలాంటివారందరినీ తన కరుణాపూరిత నేత్రాలతో ఒక్కచూపును అనుగ్రహించేవారు. అప్పుడప్పుడు పరిస్థితి తీవ్రత బట్టి ఒక్కమాట అనేవారు. ఆ ఒక్క చూపు, ఒక్కమాట వారిని అనుగ్రహించేది. రమణ భగవానుల ప్రేమ సాక్షాత్తు భగవత్ప్రేమ. ఇది అనుభవవేద్యం అంటారు అతని ప్రేమతో శాంతిని పొందినవారు.
భగవాన్ శ్రీరమణ మహర్షి దర్శనార్థమై ఎందరో దేశ విదేశీయ నాయకులు, ఆధ్యాత్మవేత్తలు, పండితులు వచ్చేవారు. అలా వచ్చినవారిలో భారత రాష్టప్రతి బాబూ రాజేంద్రప్రసాద్, మరొక రాష్టప్రతి రాధాకృష్ణన్‌లు ఉన్నారు. భారతీయులకు రమణ మహర్షిని గురించి తెలియజేసినవారు గణపతి ముని అయితే, పాశ్చాత్యులకు మహర్షి ప్రభావ ప్రాభవాలను తెలియజేసింది పాల్‌బ్రంటన్. మనిషి ఏ దేశం వాడైనా, ఏ మతంవాడైనా, ఆస్తికుడైనా, నాస్తికుడైనా వారికి ‘అహంత’ ఉంటుంది. అదే ‘నేను’ అనే భావన అందరికీ. కాని భగవాన్ అది తప్పు అంటారు. ఆ పేరు, ఊరూ శరీరానికి సంబంధించింది. దీనిని వదులుకొని అదే ‘నేను’ను పట్టుకుని మూలందాకా వెళ్ళమంటారు రమణ మహర్షి. అలా అలా వెళ్ళగా ‘నేను’ పోయి ‘తాను’ దర్శనమిస్తుంది. ఆ ‘తాను’ అంతరాత్మ. అది తెలుసుకోవడానికి ఆత్మవిచారణ చేయాలి. శ్రీరమణుల ముఖ్యమైన ఉపదేశం ఇదే.
ఇంద్రియాలకతీతమైనది ఒకటి ఉంది. అది వాటికి గోచరించదు. అది పట్టుకోవడానికి ఆత్మవిచారణమే సాధనం. ఆ సాధనతో దానిని సాధించవచ్చు. ఇదే రమణుల ఉపదేశం.
భగవాన్ శ్రీ రమణ మహర్షి చుట్టూ ఒక మహాసముద్రం పరివేష్టితం అయి ఉంది. అందునుండి ఎన్నో ఉత్తుంగ తరంగాలు. అవే వారి ఆలోచనలు కాగా అక్షర రూపం దాల్చేయి. అందుకోసం తెలుగును నేర్చుకున్నారు. సంస్కృతం, తమిళం, తెలుగులో జిజ్ఞాసువుల కోసం కలం పట్టారు. అక్షర మణిమాలి, అరుణాచల నద మణిమాలి, ఉపదేశసారం, ఉళ్ళదు నార్పది వంటి కావ్య ఖండికలు రచించారు. వివేక చూడమణి ఆదిగా ఎన్నో సంస్కృత గ్రంథాలకు విశే్లషణాత్మక రచనలు చేశారు. గురు-శిష్య ప్రశ్నోత్తర మణిమాలిక ‘రమణ గీత’. ఆచార్యుడు, మహర్షి, వ్యాఖ్యాత గణపతి ముని. ఒక అపూర్వ వాఙ్మయ సృష్టి. శ్రీశ్రీ పరమహంస యోగానంద రమణ మహర్షులను దర్శించి శ్రీరమణ మహర్షి ‘సనాతన భారతీయ ఆధ్యాత్మిక సాంప్రదాయానికి ప్రతీక’ అన్నారు. శ్రీ భగవానులలో ప్రత్యేకంగా రెండు మహత్వ పూర్ణమైన గణాలున్నాయన్నారు. అవి భగవత్ప్రేమ, జ్ఞానం.
‘‘్భగవత్ప్రేను ఎల్లలు లేనిది. పరిపూర్ణమైనది. కాగా, జ్ఞానేంద్రియాలుగా పేరు పెట్టుకున్న ఇంద్రియాలందించేది మాత్రమే జ్ఞానంకాదు. అది అందుకోలేనిది, అతీతమైనది, అంతర్భోధాత్మకమైన ఆత్మబోధే అసలైన జ్ఞానం’’ అంటారు పరమహంస.

- ఎ.సీతారామారావు