Others

మట్టివినాయకపూజ .. మహాఫలవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ భూమి వేదభూమి, పుణ్యభూమి, దానినుంచే ఉద్భవించే మట్టి, త్రివేణి సంఘమంగల, పవిత్ర భూమి, నాలుగు వేదాలు పుట్టిన భూమి, గీతామృతము పంచిన భూమి, పంచశీల పంచిన భూమి. ఈ భూమి, మట్టి, పంచిన అమరావతికి శంఖుస్థాపన, ప్రతిష్ఠ భూమి, మహాగణపతిని పూజించిన భూమి ఈ మట్టి, ఆరాధన చేయవలసిన మహాగణపతి, లోకమాన్య తిలక్ ప్రజలను సమీకరించడంకోసం, సార్వజనిక గణేశ్ ఉత్సవాలు నిర్వహించి, బహిరంగ ప్రార్ధనలు, ఉత్సవాలను జరపడం ప్రారంభించినప్పుడు బ్రిటీష్‌వారు దానిపై నిషేధం విధించలేదు. మొదటిసారి, ఆయన రెండు అడుగుల ఎత్తున చిన్న మట్టి విగ్రహంతో తయారుచేసి, ప్రతి ఇంటి ఆవరణలోనే, ఉత్సవాలు చేసుకొని ఆనందించారు. నాటినుండి నేటివరకు ఈ ఉత్సవాలు ఇంట్లోనే కాకుండా వీధిలోనే కాకుండా దేశమంతానే కాకుండా ప్రపంచమంతా విశ్వవ్యాప్తమై అందరికీ ఆనందాన్ని కలుగచేస్తోంది.
మట్టితో మహాగణపతి పూజనీయమైనది, ఫలమైనది. ఈ నేల నదీ ప్రవాహాలతో పులకితమయే నేల మన నేలలో అంతర్భాగమే మట్టి మహాగణపతి, అవతారమైనది. అమ్మవారి దేహఛాయనుండి ఉద్భవించిన మహాగణపతి, ‘శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే’’అని ప్రార్థించబడుచున్నాడు, కోరికలు తీరుస్తున్నాడు.
ప్రతి సంస్కృతికీ ఒక స్వరూపం ఉంటుంది. భౌగోళిక, చారిత్రక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య కళారూపాలతో దగ్గర సంబంధంతో ఉంటుంది. ఇదొక జీవన యానంలోని భాగమే. మన పండుగల నాగరికతలోని అంతర్భాగం. నేటికి నిర్విఘ్నంగా సాగుతున్నది.
మనం నేడు ఏర్పాటుచేసే వినాయక చవితి ప్రతిమలు మట్టివైతే ప్రగతికి, పురోగతికీ ఇదొక తొలిమెట్టవుతుంది. నేటి ఈ విధానము నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొదలవుతుంది. ఈ లాగే ని త్యమై, నిఖిలమై నిల్చి మునుముందు చారిత్రక ప్రారంభంతో, జీవన విధానంతో, సాగిపోవాలని, భావితరాలకు ఆదర్శం కావాలని ఆశిద్దాం, ఆచరిద్దాం. భక్త్భివం, సంఘీభావం ఐక్యత జనుల్లో పెరగాలనుకొని నాడు బాలగంగాధర్ తిలక్ తలపెట్టిన ఈ పండుగవనేడు కూడా కొనసాగుతూ ఆయన ఆశయాలకు అద్దం పడుతూ ఉంది. ఇకపై కూడా ఇలాగే కొనసాగాలని మనమందరం సౌభాతృత్వంతోను, స్నేహసౌభాగ్యంతోను కలసి ఉంటూ ముందు తరాలవారు ఆ స్నేహసౌభాతృత్వాలను పుణికిపుచ్చుకోవాలని ఆశిద్దాం. సహజమైన ప్రకృతి రూపమైన విఘ్నేశ్వరున్ని మట్ట విగ్రహములవే తయారుచేసి ఆరాధిద్దాం. స్వామి అనుగ్రహం పొందుదాం.
శ్రీకృష్ణుడికి నీలాపనిందలు తొలిగి, మణిని తిరిగి సాధించి, కన్యతోపాటు కీర్తిపొందాడని వినాయక వ్రత ఫలితం తెల్పుచున్నది.పూర్వము రంగుల లేవు. పసుపు కుంకుమలే, నాటి రంగులు, మట్టియే బంగారముగా ఉండేవి. పంచభూతాలలో మట్టి విశిష్టమైనది. ఏ వస్తువైనా, మట్టినుంచే పొందాలి. మట్టిపైనే నివసించాలి. మట్టిపై నుంచి వచ్చే నీటినే తాగాలి, గాలినే పీల్చాలి. కాని శ్రమించి మట్టినుండే దేవతల అనుగ్రహము పొందాలి. శ్రమకు తగ్గ ఫలితముంటుందని రామాయణంలోని సుందరాకాండ కూడా మనకు తెల్పుతున్నది.
కనుక మట్టి వినాయకున్ని, మహాగణపతిగా పూజించి తరిద్దాం. పర్యావరణను కాపాడుదాం, ప్రళయాలను ఆపుచేద్దామనే ప్రతిజ్ఞ పూనితే, దేశపురోగతికి, ప్రగతికి దోహదపడుతుంది. స్వలాభణ కొంతమానుకొని లోకకల్యాణకారకమైన ఏ పని తలపెట్టినా ఆ కార్యాలు నిర్విఘ్నంగా సాగుతాయని శమంతక మణి ఉదతమనే వ్రతకల్ప మహాత్యం వల్ల తెలుస్తుంది. కనుక మనమూ, మన భావితరాలు బాగుండాలన్న సదాశయంతో మట్టివినాయకునికి పూజచేద్దాం. మంచిఫలాలను అందుకుందాం.

- జమలాపురం ప్రసాదరావు