Others

గర్వమే పతనానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంతటి గొప్ప వారికైనా సరే వారు సురులు కావచ్చు అసురులు కావచ్చు. ఒక పర్యాయం గర్వం ఆవహించింది అంటే అది నెత్తిమీద నుంచి దిగేదాకా నెత్తిమీదే కళ్ళుంటాయి అంటే అతిశయోక్తి కాదు. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ విషయం నుండి మినహాయింపు లేదు.
అనేక కల్పములయందు సృష్టి రచించి చతుర్ముఖునికి తాను ఒక్కడినే ఈ సృష్టి రచించుచున్నానని, తాను నిర్విరామంగా పనిచేయచున్నానని, తనకంటే ఎవరూ కూడా అధికులు లేరని, నిరంతర శ్రమజీవిన నే భావం పెరిగి పెరిగి వటవృక్షం అయింది. స్థితికారుడయిన విష్ణుమూర్తికి నాసాళమునకు అంటిన గర్వం దించేదాకా విశ్రాంతి యుండదు. ఒక వెయ్యి చతుర్వ్యుగాలు కాలం గడిస్తే బ్రహ్మకు పగలు మరొక వెయ్యి చతుర్వ్యుగాలు గడిస్తే రాత్రి. అటువంటిది బ్రహ్మకు తన జీవితకాలం పూర్తవాలి అంటే ఎన్నో వేల యుగాలు గడవాలి. అది బ్రహ్మ గర్వానికి కారణం. బ్రహ్మ యొక్క గర్వమును అణచదలచినటువంటి విష్ణుమూర్తి బ్రహ్మదేవుని తన వెంట తీసుకొని ఈ మాట ఆ మాట చెబుతూ వాహ్యాళికి బయలుదేరాడు. కొంతదూరం పోగానే బ్రహ్మదేవునికి తాను ఇప్పటివరకు చూడని ఒక ఋషిపుంగవుడు తారసపడినాడు. ఆ మహాశయుడిని తాను సృజియించినట్లు బ్రహ్మకు గుర్తులేదు. బ్రహ్మదేవుడు ఋషి వద్దకు వెళ్లి, అయ్యా! ఎంత ఆలోచించినను తమరు గుర్తుకు వచ్చుటలేదు అనగానే ఋషి పుంగవుడు విష్ణుమూర్తిని చూచి చివుక్కున లేచి నమస్కరించి బ్రహ్మతో ఇలా మాట్లాడాడు. అయ్యా నేను రోమశుడను. అందరూ రోమశ మహర్షి అంటారు. నాకు తపము ఆచరించుట మాత్రమే వచ్చు. బ్రహ్మకు నూరేళ్ళ ఆయుర్దాయం పూర్తయిన పిదప నా శరీరమునందలి ఒక రోమము దానంతట అదే ఊడిపడిపోతుంది. ఆ విధంగా నా శరీరంలోని రోమాలు అన్ని రాలిపోయిన పిదప మోక్షము ప్రసాదిస్తాను అని శ్రీమన్నారాయణుడుచెప్పాడు. నాకు అంతే తెలుసు అన్నాడు. బ్రహ్మ ప్రక్కనే వున్న శ్రీమన్నారాయణుడు అవునని చిరునవ్వుతో చూచాడు. రోమశ మహర్షి సమాధానమునకు బ్రహ్మ నివ్వెరబోయాడు.
తరువాత బ్రహ్మ విష్ణువులు మరికొంత దూరం పోగానే వంకరలు తిరిగిన శరీరంతో మరొక మహర్షి కనిపించెను. మహావిష్ణువు కనబడగానే ఆ మహర్షి లేచి నిలబడి నమస్కరించాడు. బ్రహ్మదేవుడు ఆ యనతో అయ్యా, తమరు ఎవరని ప్రశ్నించాడు. అయ్యా నన్ను అష్టావక్రుడు అంటారు. నా శరీరమునందు అష్టవంకరలు ఉన్నవి. ఆ వంకరలు పోగానే మోక్షము ప్రసాదిస్తాను అని విష్ణుమూర్తి వరమిచ్చాడు. ఆ అష్టవంకరలు ఎలా బాగుపడతాయి అని బ్రహ్మ ప్రశ్నించగా అష్టావక్ర మహర్షి ఇలా బదులు చెప్పాడు. రోమశ మహాముని లాంటివారు ఒకరి తరువాత మరొకరుగా ఎనిమిది మంది ముక్తిపొందిన తరువాత నాలో ఉన్న ఒక వంకర మాయమవుతుంది. ఈ విధంగా నా అష్టవంకరలు తొలగగానే మోక్షం వస్తుందనిచెప్పాడని అన్నాడు.
అప్పటివరకు తనను మించినవారు లేరు అని భావిస్తూవున్న బ్రహ్మకు జ్ఞానోదయం అయింది. ఇప్పటివరకు చరాచర జగతిని సృష్టించేది నేనే అని గర్వపడుతూ ఉండేవాడు. విష్ణుమూర్తితో తండ్రీ నా కళ్లు తెరిపించినందుకు కృతజ్ఞుడను. నేను ఈ సృష్టికి సృష్టికర్త కావచ్చు కాని బ్రహ్మను సృష్టించినది మీరే అనే జ్ఞానం మరచినందుకు క్షమించండని అడిగాడు.
అపుడు విష్ణుమూర్తి ఇలా సెలవిచ్చాడు. నాయనా! రోమశ మహర్షి, అష్టావక్ర మహర్షివంటివారు ఎందరో ఉన్నారు. నిరంతర భగవన్నామ స్మరణ చేస్తూ హనుమంతుడు, మార్కండేయుడు చిరంజీవులుగానే ఉండిపోయినారు. మనం చేసే పని బాధ్యతాయుతంగా చేయాలి. నేను చేస్తున్నాను గదా అని గర్వపడరాదు. ఆ గర్వమే మన పతనాన్ని శాసిస్తుందని చెప్పాడు.

- వేదగిరి రామకృష్ణ