Others

కారణజన్ములు షిర్డీ సాయభాబా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏమూల ఉన్నా తన భక్తులను పిచ్చుక కాలికి దారం కట్టి దగ్గరకు లాకొన్నట్టుగా తన దరికి చేర్చుకుంటానని సాయిబాబా చెప్పాడు. కులమతాలు కాని హెచ్చుతగ్గులు కాని లెక్కలోకి తీసుకోకుండా అందరినీ సమానంగా చూచే సద్గురువు సాయిబాబా. ప్రతివీధిలోను, ప్రతి ఇంట్లోను కొలువైన సాయిబాబా అందరి మనసుల్లో సుప్రతిష్టుడైనాడు. సాయిబాబా ఆదిభిక్షువులాగా భిక్షాటన చేసే సాయి అందరికీ త్యాగమే మహోన్నత గుణమని బోధించాడు. మానవులెంత ముఖ్యమైన ప్రాణులమని అనుకుంటామో పశుపక్ష్యాదులు, క్రిమికీటకాదులు కూడా అంతే ముఖ్యమనేవారు. అందుకే కుక్కల్లాంటి జంతువులను హింసించినా తన్ను హింసించినట్లే అనేవారు. మనుష్యుల్లో ఉండే లోభత్వాన్ని విడనాడమని చెప్పేవారు. ఆయన బతికున్న రోజుల్లో దేవాలయాలకు వెళ్లి దేవుణ్ణి పూజించడం కన్నా తన ఎదురుగుండా ఆకలితో నకనకలాడే వారికి అన్నం పెడితే భగవంతుణ్ణి పూజించినట్లే నంటారు. పూజలు పునస్కారాలు చేయకపోయినా మానవునిగా మెలిగితే చాలనవేవారు. గొప్పవస్త్రాలు ధరించినంత మాత్రానా లేక గొప్ప ఉద్గ్రంథాలు చదివినంత మాత్రాన బాగా డబ్బు సంపాదించినంత మాత్రాన గొప్పకీర్తిని ఆర్జించలేరు. కాని తన తోటి ఉన్నవారిలో ఒక్కరై మెలిగినపుడు ఇతరుల పట్ల దయను చూపెట్టినపుడు మాత్రమే వారు తోటివారి పట్లనే కాక దైవంచేత కూడా మెప్పుపొందుతారని సాయి చెప్పేవారు. ఈ కాలంలో సాయిని దర్శించకపోయినా సాయిసూక్తులను సాయి జీవితాన్ని ఒక్కసారి నెమరువేసుకొంటే చాలు సాయి రూపం కనులముందు సాక్షాత్కరిస్తుంది. ప్రతిరోజు సాయిబాబాకు సాయంత్రం పొద్దున్న దివ్యహారతులనిస్తారు. తాను సమాధి లో ఉన్నా తన భక్తులను కంటికి రెప్పగా కాపాడుతానని చెప్పాడు. చెప్పినట్లుగా నే సాయిబాబాను నమ్ముకున్నవారు నేడు కూడా ఆనందంగా ఉన్నట్లు ఎందరో భక్తులు చెప్తుంటారు. హిందూ ముస్లిముల ఐక్యతకు సాయిబాబా ఎంతో కృషి చేశారు. సాయిబాబా మనుజులందరూ ఒక్కటే అన్నట్లుగానే భగవంతుడు ఒక్కడే ఎవరు ఏపేరుతో పిలిచినా వారికి ఆ రూపంలో దర్శనమిచ్చే శక్తే భగవంతుడని చెప్పేవారు. కేవలం చెప్పడమే కాక తన భక్తులు తన్ను కృష్ణునిగా తలిస్తే కృష్ణుడిగాను, రామునిగా తలిస్తే వారికి రామునిగాను శివభక్తులకు శివుని రూపంలో దర్శనమిచ్చేవారు. మరికొందరు వారి వారి సద్గురు రూపంలోను దర్శనమిచ్చి పెడదారి పెట్టినవారిని సన్మార్గంలోకి తెచ్చేవారు సాయి. ఆ సాయి సమాధిచెందిన ఈరోజులలో బాబా చెప్పినసూక్తులను ఒక్కసారి గుర్తుతెచ్చుకుని సాయి దర్శనం చేసుకొని సర్వులూ సన్మార్గానికి మళ్లాలి.

- సత్యసాయి.