Others

జయాన్నిచ్చే దివ్యజ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాగ్జ్యోతిష్య పురాన్ని ఏలే దానవేశ్వరుడు నరకుడు. ఇతడు బ్రహ్మ వరగర్వి. పూర్వకాలాన సత్యాదేవికి(్భదేవి) పుట్టిన బిడ్డ. కాని ఈ ద్వాపరయుగంలో నరకుడు నరకంటకుడుగా మారాడు. సాధువులను సజ్జనులను హింసించేవాడు. వారినే కాక అబలలైన స్ర్తిలను కూడా సాధించేవాడు. అంతేకాక అదితి కుండలాలను, వరుణుడి ఛత్రాన్ని చివరకు మణిమయమైన మేరుశిఖరాన్ని కూడా తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. ముల్లోకాలకు ముచ్చెమటలు పట్టించేవాడు.
ఈ నరకుని హింసను భరించలేని మానవులు దేవతలు యుగపురుషుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి మొరవెట్టుకున్నారు. చింతలు బాపే చిన్ని కృష్ణయ్య వారికి అభయమిచ్చాడు. తన తల్లి చేత మరణాన్ని కోరుకున్న నరకుణ్ణి ఆయన తల్లే హతమారుస్తుంది లెమ్మని చెప్పాడు.
మితిమీరిన నరకుని బాధలను శ్రీకృష్ణుని ప్రియురాలు అష్టమహిషుల్లో శ్రీకృష్ణుని అత్యంత ప్రియబాంధవిగా పేరుగన్న సత్యాదేవి తెలుసుకొంది. ఆగ్రహావేశురాలైంది. సాధువులకు కంటకంగా మారిన నరకునిపైకి యుద్ధ్భేరి మోగించే తన పతి దేవుని గూర్చి కూడా తెలుసుకొంది. వెంటనే తాను కంకణధారి అయ్యింది. స్ర్తిలను హింసించే ఈ నరకుని పని నేపట్తానంది. వెంటనే శ్రీకృష్ణుల వారితోపాటు కదన రంగానికి కదలివెళ్లింది. నరకాసురుని అంతం మొందించడానికి బయలుదేరిన సత్యాకృష్ణులకు మురాశురుని పాశాలచే చుట్టబడిన అయిదు దుర్గాలు కనిపించాయ. వాటిని శ్రీకృష్ణుడు నాశనమొనర్చాడు. తనతో తలపడడానికి వచ్చిన మురాసురుని, అతని కుమారులను కొంతమంది సైన్యాన్ని సంహరించాడు. మాయలకే పెనుమాయ అయన పరంథాముడు అసురులతో పెనుగులాడి అలసి పోయాడు. చిరుచెమటలు నుదటిని ఆక్రమించగా రథంమీదనే కాస్త అలసట తీర్చుకుంటున్నాడు. అపుడు వచ్చాడు కదన రంగంలో నరకాసురుడు వచ్చాడు. ఆ అసురుని చూడగానే సత్యాదేవికి అమితాగ్రహం కలిగింది. వెంటనే తనవేణిని సవరించుకుంది. చీరచెంగును నడుమున దోపుకుంది. బాణాలను అందుకుంది. వీరావేశంతో నరకునిపై బాణ ప్రయోగం చేసింది. అంతలో కృష్ణుడు కనులు తెరిచాడు. సత్యాకృష్ణుల ధాటికి తట్టుకోలేని నరకుడు అసువులు బాసాడు. లోకాలన్నీ సత్యాకృష్ణులను పొగిడారు. నరకుని పీడ వదిలిందని ఆశ్వీజబహుళ చతుర్దశిని నరక చతుర్దశిగా భావించారు. తమ జన్మలకు వెలుగునిచ్చిన కృష్ణుని స్మరిస్తూ దీపాలు వెలిగించారు. కృష్ణుని వల్ల పీడ నాశనమైందని బాణా సంచాలు పేల్చారు.
శుభం భవతు కల్యాణి ఆరోగ్యం ధన సంపదః
మమ శత్రు వినాశాయః సంధ్యా జ్యోతిర్నమోస్తుతే
అంటూ సాయం వేళ దీప ప్రజ్వలనాలుచేస్తారు. అజ్ఞానాన్ని దూరం చేయమని భగవంతుని కోరుకుంటారు. దుష్టశక్తుల దూరం గావాలని బాణా సంచా పేల్చడం లాంటివి చేస్తారు. రాబోయే కార్తికాన్ని ఆహ్వానిస్తూ
‘‘్భవాయ భవనాశాయ- మహాదేవాయధీమహి
ఉగ్రాయ ఉగ్రనాశాయ- శర్వాయ శశివౌళినే’’
అంటూ పరమశివుణ్ణి మోక్షమివ్వమని పూజిస్తారు. జ్ఞానసంపదనిచ్చే లక్ష్మీదేవిని పూజిస్తారు. సదా ధర్మవిజయమే సిద్ధించాలని కాంక్షిస్తారు.

-చివుకుల రామమోహన్