Others

కలిమినిచ్చే కార్తికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకమాసము శక్తివంతమైనది. స్నానము, అభిషేకము, అర్చన, ప్రదక్షిణ, దీపారాధన, అన్నసంతర్పణ ఈ మాస విశిష్టతలు. పాపనివృత్తికి మార్గాలు. శతృవులను జయించి, విజయలక్ష్మిని వరించటానికి చక్కటి సాధనము శుభప్రదమైన కార్తీకమాసమని ‘బహులోర్జౌ కార్తీకో’ అనే అమరవాణి సందేశం ద్వారా తెలియజేయబడింది.
‘అభిషేక ప్రియశ్శివః’ అనే ఋషి వాక్యాన్ని అనుసరించి సూర్య కిరణము సోకే సమయానికి శివునికి అభిషేకం చేసికోవాలి. మారేడు దళాలు శివుడు యిష్టపడే పత్రాలు. ఈ పత్రాలతో చేసే శివార్చన కన్యాదాన ఫలితమునిస్తుంది.
సహజంగా దేవాలయాలలో ‘కార్తీకదీపం’ ఏర్పాటుచేస్తారు. ఈ కార్తీక దీపానే్న ‘ఆకాశదీపం’ అంటారు. ప్రతిరోజూ ఆకాశదీపాన్ని దర్శించటం భక్తులు సర్వపాప విముక్తులు కావటానికి, ఆత్మానందాన్ని పొందటానికి ఎంతో ఉపయోగపడుతుంది. దీనినే పరంజ్యోతి దర్శనము అని కూడా అంటారు.
శివుని చరిత్రను వినటం, చంద్రశేఖరుని గుణాలను కీర్తించటము, నీలకంఠుని పాదాలను సేవించటం, దీపారాధన చేసి ఆ వెలుతురులో శివలింగాన్ని మనసారా ధ్యానించటంవల్ల జన్మ చరితార్థమవుతుంది. ప్రాతఃకాలంలో కార్తీకస్నానమాచరించాలి. శివ, విష్ణు ఆలయాలను నిర్మల హృదయంతో దర్శించాలి. ఆలయ ప్రదక్షిణ చేయాలి. ఉదయం, సాయం త్రం ఎవరి ఇంటిలో వారు దీపారాధన చేసి, దేవాలయాలలో కూడా దీపారాధన చెయ్యాలి. శివాలయమునందు దీపారాధన ధన కార్తీక మాసం చివరివరకు ఎవరు చేస్తారో అట్టి మానవులకు మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్వయంగా ప్రజ్వలరూపుడైన పరమేశ్వరుడు వచించెను.
దేవాలయాలలో కార్తీక పురాణ ప్రవచనం జరుగవలెను. పురాణం వినటం ద్వారా ఆధ్యాత్మిక భావన కలిగి గత జన్మలో చేసిన పాపం నుండి విముక్తి లభిస్తుంది.
అరిషడ్వర్గాలను జయించటానికి కార్తీకం సరియైనది. వీటిని మించిన శతృవులుండరు. తెనాలి రామకృష్ణుడు రచించిన పాండురంగ మహత్మ్యంలో నిగమ శర్మ కామవశుడౌతాడు. సకల వేద రహస్యాలు తెలిసినా కామంతో మదమెక్కి, పెద్దలమాట వినకుండా జీవనం కొనసాగే క్రమంలో ఆకలికి తట్టుకోలేక భక్తులు శివునికి సమర్పించిన నైవేద్యాలను దొంగతనంగా తీసికొని వెళ్ళటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు అక్కడ వున్న నైవేద్యాలు చీకట్లో కనపడకపోవటంతో ఒక వత్తిని పెద్దగా చేసి, నూనె పోసి వెలిగిస్తాడు. ఆ వెలుతురులో నైవేద్యాన్ని తీసికొనిపోతుండగా భక్తుని కాలికి తగిలి, ఆ భక్తుడు వేసిన బాణానికి పడిపోయి చనిపోతాడు. కేవలం శివాలయంలో దీపారాధన చేసినందుకు నిగమశర్మకు శివసాయుజ్యం లభిస్తుంది.
శంకరునికి అనేక పేర్లున్నాయి. అందరి కష్టాలను నివారించే ఓంకార నిధి పరమేశ్వరుడు. ‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరి మంత్రం శారీరక రుగ్మతలను నివారించి, మానసిక ప్రశాంతతను పొందటానికి అవకాశం కల్పిస్తుంది.
ఇతిహాసాల ప్రకారం రుద్రాక్షలకు ఎంతో ప్రాముఖ్యత వున్నది. శివుడు ఎప్పుడూ రుద్రాక్షలు ధరిస్తాడు. అవి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనవి. ఆరోగ్యం, ఆనందం, ఆధ్యాత్మికత, మో క్షం పొందటానికి రుద్రాక్షలు ఎంతో ఉపకరిస్తాయి.
శివుడు జ్ఞాన గంగను శిరసుపై ధరించాడు. అభిషేకంతో అలరింపజేస్తే శివుడు అనుగ్రహంతో జ్ఞానం పొందవచ్చును. సాలగ్రామ దానం చేస్తే కార్తీకమాసం విశేష ఫలితాన్నిస్తుంది.
కార్తీక మాసంలో ప్రతిరోజూ మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృత ఫలరసాభిషేకాలు, లక్షమారేడు దళాలతో అర్చనలు శివసాయుజ్యం పొందటానికి మార్గాలు.

-నిమ్మగడ్డ కాశీ విశే్వశ్వర శర్మ