Others

గోపీజన రమణుడు భాగవతప్రియుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానభక్తివైరాగ్యాలనే ఆభరణాలు ధరించిన వారందరూ భక్తిపారవశ్యంలో మునిగి తేలుతుంటారు. నామదేవుడని అగ్రశ్రేణికి చెందిన భక్తాగ్రేసరుని చిన్నతనంలో ఓ సంఘటన జరిగింది.
ఒకసారి ఆయన తల్లితండ్రులు పొరు గూరుకు వెళ్తూ నామాదేవా ప్రతిరోజు భగవంతుని శుచిగా వంట చేసి ఆ అన్నా న్ని భగవంతునికి నివేదించు అని చెప్పి వెళ్లారట. నామదేవుడు సరే అని మరుసటిరోజు పొద్దునే్న నిత్యకృత్యాలు ఆచరించుకుని అన్నం వండి కూర చేసి భగవంతునికి నివేదన చేశాడట. స్వామి మా తల్లి చేసినట్లు నేను చేయలేదేమో కాని ఇదంతా నీకోసమే చేశాను. నీవు తినక పోతే నాకు బాగుండదు. పైగా మా అమ్మకు నీకు నివేదన చేస్తానని చెప్పానని చెప్తూ అన్నం తినమని బతిమాలాడట. కాని ఆ పాండురంగడు తినలేదట.
ఎంత చెప్పినా భగవంతుడు తినట్లేదని మరింతగా కన్నీళ్లు పెట్టుకుని నువ్వు తినక పోతే నేను దెబ్బలు తినాల్సి వస్తుంది. కనుక నీవు తినవయ్యా ఎంతగానో బతి మాలాడట. చేసేది లేక అతని భక్తికి మెచ్చి భగవంతుడు వచ్చి కూర్చుని నామదేవుడు పెట్టిన అన్నాన్ని తిని వెళ్లాడట. అలా కొన్ని రోజులు జరిగాయ. వారి తల్లితండ్రులు వచ్చి భగవంతునికి నివేదన చేస్తున్నావా అని నామదేవుని అడిగితే ‘ఓ భేషుగ్గా.. మొదట తినలేదు కాని తర్వాత ఎంతో బతిమాలాను ఇపుడు రోజు వచ్చి తినేసి వెళ్తున్నాడు’ అన్నాడట. అది విని వారు ఆశ్చర్యపోయ ఏవో అబద్ధాలు చెబుతు న్నాడని కూకలు వేసారట. నామదేవుడు ఖిన్నుడై కాదు నేను ఏమీ అబద్ధం చెప్ప లేదు. కావాలంటే ఈ రోజు నేను పెడతాను భగవంతుడే తింటాడు చూడండి అంటూ వెళ్లాడట. కాని ఈ రోజు మరలా ఆ భగవంతుడు రాలేదట. కన్నీళ్ల పర్యంతమైన నామదేవుడు ఏమయ్యా నా తల్లిదండ్రులతోపాటు వచ్చిన ఈ వూరి జనం కూడా నేను అబద్ధాలు చెబుతానని అనుకోరా..? రోజూ వచ్చి తినేవాడివి.. ఈ రోజు ఏమైంది అని గద్దించి బతిమాలి ఎన్నో విధాల శ్రమ పడుతుంటే తన భక్తుడు కష్టాన్ని చూడ లేకభగవంతుడు వారందరికీ దర్శనమిచ్చి ప్రతిరోజు నేను ఈ నామదేవుడు పెట్టే అన్నాన్ని నేనే తిన్నాను అని అందరినీ ఆశ్చర్యపరిచాడట. దాంతో తల్లితండ్రులు మిగతావారు నామదేవుని అదృష్టానికి పొంగిపోయారట.
అట్లాంటి భక్తాగ్రేసరులను చూచి పండితులు భక్తులు మూడువిధాలుగా ఉంటారు. ఒకరు భగవంతుని దర్శనంతో ముక్తిపొందుతారు. మరొకరు భగవం తునితో ఏదో ఒక సంబంధాన్ని పెట్టుకుని చివరకు ఆ భగవంతునిలోనే లీనమవు తారు. ఇంకొకరు భగవంతునితో ఎడ బాటును క్షణమైననూ సహించలేరు వీరే పరమాభక్తాగ్రేసరులు అన్నారు. ఈ భాగ వతుల ప్రియుడైన భగవంతుడు తాను ఆ భక్తులను తనివితీరా సేవించడానికి అనువైన మార్గము కృష్ణావతారంగా తలి చాడు. ఆ కృష్ణావతారంలోనే భగవం తుడైన కృష్ణుడు ఎందరో భక్తులచేత సేవించబడి తాను వారిని సేవించాడు. భక్తితో మాత్రమే లభ్యమయ్యే స్వామి ఆనంద పరిపూర్ణుడిగా భాగవతంలో కీర్తినొందాడు.
కృష్ణనిర్యాణ సమయంలో ఉద్ధవుడు స్వామి మీరు వైకుంఠం చేరితే ఈ భూ లోకం ఎలా అని ప్రశ్నిస్తే ప్రాణిరక్షణను, ధర్మరక్షణను ఎవరు చేస్తారు. రామా వతారంలోనైతే అందరూ ధర్మనిష్ఠాపరులే ఉండేవారు. ఇపుడు సగానికిపైగా అధర్మాచరణులు ఉన్నారు. వారిని మీరు నిర్జించారు. కట్టడిచేశారు. కాని రాబోయేది కలియుగం మరి మూడు వంతులు అధర్మ పరాయణులే కదా. ఇక మమ్ము ఉద్దరిం చేవారు ఎవరు ఉంటారని అడగగా కృష్ణుడు తాను భాగవతరూపంలో ఉంటానని ఎవరు భాగవతాన్ని సదా పఠిస్తారో అందులోని మర్మాన్ని ఎవరు గుర్తెరుగుతారో ఎవరు కృష్ణ్భక్తులుగా భాగవత పూజ చేస్తారో వారితో కూడా నేను ఎల్లవేళలా ఉంటాను. అని అభయం ఇచ్చారట. అందుకే కృష్ణయ్యను కృష్ణస్య వాఙ్మయా మూర్తిః అని కూడా కీర్తిస్తారు. చైతన్య మహాప్రభువు చెప్పినట్టుగా సర్వం కృష్ణమయంగా తలిచి అనవరతమూ కృష ణనామస్మరణతో పులకాంకితులయ్యేవారు కృష్ణస్వరూపులే.

- చివుకుల రామమోహన్