Others

చింతలు తీర్చే చిన్మయుని లీలావినోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హంసవింశతికారుడు పాడిన పాటల్లాంటి పాటలు పాడుతూ అంగనలందరూ తమ ముంగిట ముత్యాల ముగ్గులను తీరుస్తారు. వాటి మధ్య తమతమ కళాభిరుచిని చాటేవిధంగా గొబ్బెమ్మలనే గౌరమ్మరూపాలను ఆవుపేడతో తీర్చి వాటిపైన గుమ్మడి పూవులను అలంకరించి పుత్తడిబొమ్మల్ని తయారుచేశారా అనుకునేవిధంగా పసుపు కుంకుమ లతో అలంకరిస్తారు. ముగ్గుముగ్గుకూ మధ్యన మూడు గొబ్బిళ్లను పెట్టడం ఆచారం. ఒక గొబ్బెమ్మ గోపాలకృష్ణుడికి సంకేతంగా నిలుస్తుండగా మరో గొబ్బెమ్మ గోవుకు చిహ్నంగా వుంటున్నది. మూడో గొబ్బి 3గోవర్ధనగిరి2కి ప్రతిరూపంగా నిలుస్తున్నది. ఈ గొబ్బెళ్లను పెట్టడంలో అంతరార్థం గోపాలకృష్ణుడు గోవర్ధనగిరినెత్తి గోవులను గాచిన గాధను స్మరించుకోమని చెప్పడమే.
అలనాటి కృష్ణకథలను నెమరువేసుకోవడంలోని రుచి తెలిసినవారికే తెలుస్తుంది. కృష్ణుడు కేవలం భక్తికే లొంగుతాడు కాని అహంకారానికి దురభిమానానికి కాదు. ఓసారి యశోదమ్మ - మన్ను తిన్నాడని చెలికాండ్రు చెప్పడమూ, మా ఇండ్ల్లల్లో పాలుపెరుగు మననీయడం లేదని గోపకాంతలు చెప్పడం లాంటి వన్నీ విని విని విసుగెత్తి తన కొడుకు వల్ల తనకు అవమానం కలుగుతోందని కొద్దిసేపు చింతించింది. తన కొడుకుకు తన వాక్కే వేదవాక్కుగా ఉండాలని తలిచింది. వెంటనే కృష్ణయ్యనుపిలిచి మన్ను తింటున్నావా అని గద్దించింది. సకలలోకాలను తన కుక్షిలో పెట్టుకున్న ఆ మహానుభావుడు పురుషో త్తముడు మిక్కిలి భయపడినట్లుగా నటించి నోరు తెరిచి అమ్మనే అవాక్కు అయ్యేటట్టు 14 భువనాలను తన నోటిలో చూపిం చాడు. నోరు తెరిచి మాట్లాడలేకపోతున్న యశోదమ్మను మళ్లీ మాయ కప్పే ట్టుగా చేసి అమ్మా నేను నీ మాట తప్ప నాకు వేదవాక్కు ఏంవుందని అమాయకంగా అన్నాడు. ఆ తల్లి తన కొడుకు తన ఆధీనంలోనే ఉన్నాడని తలిచి వూరుకొంది. మరి కొన్నాళ్లకు వెన్న నంతా తీసి కోతు లకు పెట్టుతున్నాడని గదమాయంచి తన పనితాను చేసుకొంటున్న తల్లిని చూచి ఆకలి అవుతోంది వెంటనే పాలు ఇస్తావా లేదా అని ఏడ్చాడా కృష్ణయ్య. ఆ తల్లి తన చిన్నివాడు ఆకలికోర్వలేడని వచ్చిఒళ్లో పడుకో బెట్టుకుని పాలిస్తూ మధ్యలో పొయ్యమీద పాలుపొంగు తున్నాయని చిన్నవాడ్ని వదిలి వంటిం ట్లోకి పరుగెత్తింది. తన్ను కాదని వెళ్తావా అంటూ దగ్గరలోని చిన్న రాయని తీసుకొని పాలకడవను పగులకొట్టాడు. ఆ పాలన్నీ నేలపాలయ్యాయ. దాన్ని చూసిన యశోదమ్మకు కోపం వచ్చింది. కృష్ణయ్యనే దండించాలనుకొంది. వెంటనే కన్నయ్యను పట్టు కుందామని వచ్చింది. తల్లి తలుపును తెలుసుకొన్న కృష్ణయ్య పరుగెత్తాడు. చిక్కకుండానే అమ్మను పరుగెత్తిస్తున్నాడు. అట్లా పరుగెత్తే చిన్నికృష్ణుడిని ఎలాగైనా పట్టుకోవాలన్న దృఢ నిశ్చయంతో పరుగెత్తుతూనే ఉంది ఆ గోపకాంత. ఇట్లా కాదు నేను నిన్ను పట్టుకొని తాడుతో కట్టివేసి బుద్ధి చెప్తానంటూ తాడు తీసుకొని మరీ ఆ గోపాలబాలుని చుట్టూ పరుగెత్తి అలసిపోతోంది. నుదటి కుంకుమ మేనుకుపట్టిన చెమటతో తడిసి కారుతోంది. కొప్పువీడి వెంట్రుకలు చెల్లా చెదురుఅవుతున్నాయి. అయినా కన్నయ్య దొరకలేదని ఒగరుస్తూ పరుగెత్తుతూనే ఉంది. తన తల్లిని అనుకొనే ఆ యమ్మ బాధను పరబ్రహ్మ చూశాడు. భక్తికి తలవొగ్గే ఆ చిన్నివాడు చివరకు తల్లి చేతికి చిక్కాడు. కాటుకుకళ్లనిండా నీటిని నింపుకుని వాటిని చేతుల్లో రుద్దుతూ ముఖమంతా నల్లగా చేసుకొని చిక్కాడు ‘‘అమ్మ దొంగా దొరికావుఅనుకొన్న యశోదమ్మ తాడుతో కట్టబోయింది. కాని రెండుఅంగుళాలు తక్కువ అవుతూనే ఉంది దారం. ఇందులోను పరమాత్మ సందేశాన్ని మానవాళికి ఇస్తూనే వున్నాడు. ఎట్టకేలకుభగవంతుడిని తన తాడుతో కట్టివేసింది ఆ యమ్మ. ఆమె అటు వెళ్లగానే తన్ను కట్టిన రోటినే లాక్కుకొంటూ నడుస్తూ నడుస్తూ నలకుబేరుల కొడుకులు శాపంపొంది మద్దిచెట్లగా ఉన్న ప్రదేశానికి చేరుకొని వాటి మధ్య నడిచాడా చిన్నవాడు. వారిద్దరూ శాపవిమోచనం పొంది ఆబాలగోపాలాన్ని ఆనందింపచేసే ఆ కృష్ణపరమాత్మను చూచి పరమానందంతో చేతులెత్తిమొక్కారు. ఇలా కృష్ణయ్య ఏది చేసినా అందులో ఏదో మర్మం దాగింది. ఆ మర్మం తెలుసుకొంటే చాలు మానవజీవితం ఎలా ధన్యం చేసుకోవాలో తెలుస్తుంది. అందుకే నిరంతరం కృష్ణకథలను చదువుదాం. కృష్ణ భజన చేద్దాం. మనమూ కృష్ణరూపులం అవుదాం.

- సాయికృష్ణ