ధర్మసందేహాలు

విహితమైనవి ఏవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నేటి కలియుగంలో మానవుడు పాటించాల్సిన కనీస ధర్మాలు ఏవి? (కె.శ్రీనివాసులు, హైదరాబాద్)
ఈ విషయాన్ని భారతంలో వ్యాసభగవానుడే వివరించాడు. ఇతరులు ఏమి చేస్తే మన మనస్సుకు అప్రియం కలుగుతుందో అలాంటి పనిని మనం ఇతరులపట్ల చేయరాదు. దీనిని ప్రధాన సూచికగా స్వీకరిస్తూ ఎవరెవరి వర్ణాశ్రమాలకు విహితమైన ధర్మాలను చేతనైన మేరకు ఆచరించుకుంటు జీవించడమే ఉత్తమ మార్గం.

* మన్మథుడికి కృష్ణుడికి గల బాంధవ్యం ఏమిటి? (వి.బాలకేశవులు, గిద్దలూరు)
- మన్మథుడు విష్ణువుకి పుత్రుడు. ఆ విష్ణువు కృష్ణుడుగా అవతరించినపుడు మన్మథుడు ప్రద్యుమ్నుడనే పేరుతో శ్రీకృష్ణ పుత్రుడుగా జన్మించాడు.

* మన్మథుడు దేవత అయితే దేవాలయాలు
ఎందుకు లేవు? (కేశవులు, హైదరాబాదు)
పార్వతీ వివాహ ఘట్టంలో మన్మథుడు తొందరపాటు తనంవల్ల ఈశ్వరడి మీద తన పుష్ప బాణాలను వేయడంవల్ల శివుడు కోపగించి తృతీయ నేత్రంతో మన్మథుడ్ని దహించివేశాడు. కానీ మన్మథ పత్ని అయిన రతీదేవి ప్రార్ధనవల్ల శరీరం లేకుండా అతడు సజీవుడై వుండేలాగ వరం ఇచ్చాడు. ఇలా రూపం పోయినందువల్ల మన్మథునకు ఆలయాలు వుండే అవకాశం లేకుండా పోయింది.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500 035.
vedakavi@serveveda.org

కుప్పా వేంకట కృష్ణమూర్తి vedakavi@serveveda.org