ధర్మసందేహాలు

యోగసాధనతో పూర్వజన్మ జ్ఞానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వారములు ఏడే ఎందుకు ఉన్నాయి?
- పి.కుమారస్వామిరెడ్డి, నెల్లూరు
మన మహర్షులు రోజును 24 భాగాలు చేసి, ఆ భాగాలకు ‘‘హోరలు’’అని నామకరణం చేశారు. ‘‘అహోరాత్రము’’అనే పదంలో మొదటి చివరి అక్షరాలను వదిలివేస్తే ‘’‘హోరా’’అనే పదం వస్తుంది. దీని లోంచీనే‘ ‘్హ్యఖూ’’ అనే పదం రూపాంతరం చెందిందని భాషాశాస్తవ్రేత్తలు చెపుతున్నారు. సృష్టిప్రారంభం, అనగా మొట్టమొదటి సూర్యోదయం జరిగే సమయానికి ప్రథమహోర ప్రారంభమైంది. దానికి ఆదిత్యుడు అధిపతి. అందువల్ల అది ఆదిత్యహోర అవటం మాత్రమేగాక, ఆరోజు మొత్తానికి ఆదిత్యవారం అని పేరుబెట్టారు. అదే ఆదివారం. ఆ తరువాత ఒక్కొక్క హోరకు ఒక్కొక్క గ్రహానికి ఆధిపత్యమివ్వగా మర్నాటి ఉదయం సూర్యోదయమ్యే హోరకు చంద్రుడు అధిపతి అవుతాడు. దాన్నిబట్టి ఆరోజుకు చంద్రవారం లేక సోమవారం అనే పేరువస్తుంది. ఇలా లెక్కలు వేసుకుంటూపోతే ఏరోజు సూర్యోదయ సమయానికి ఏ గ్రహాధిపత్యం వుంటుం దో, ఆరోజుకి ఆ గ్రహం పేరువస్తుంది. ఆకాశంలో గోళరూపంలో వుండే గ్రహాలు ఏడే కనుక ఆది, సోమ, మంగళ ఇత్యాదిగా ఏడేవారాలు వస్తాయి. ఈ వరస, ఈ సంఖ్య, ఎప్పటికీ మారదు. ఎందుకంటే ఇది గణితశాస్త్రం మీద ఆధారపడిన వ్యవస్థ గనుక.
* కేజీనుండి పీజీ వరకు ఎందరో గురువులుంటారు గదా. వీరిలో అసలు గురువెవరు?
- యన్.రాజ్యలక్ష్మి, సికిందరాబాదు
కేజీనుంచీ మాత్రమే కాదు బిడ్డ పుట్టీపుట్టగానే పాలు తాగటం నేర్పించే తల్లితో గురువుల పరంపర ప్రారంభమవుతుంది. అందుకే వేదం తల్లే ప్రథమ గురువు అని చెప్పింది. రెండో గురువు తండ్రి. ఆ తరువాత కేజీ నుంచీ విద్యనేర్పేవారంతా గురువులే గాని, వారిని ఉపాధ్యాయులు అంటారు. ఇక ఆధ్యాత్మిక మార్గంలో మంత్రోపదేశం చేసినవారిని మంత్రగురువు అంటారు. కేవలం మంత్రోపదేశంతో సరిపెట్టుకోకుండా, మన ఆధ్యాత్మిక ప్రగతిని నిర్దేశించి, నిర్ణయించి, నడిపించి మనలను చరమగమ్యానికి చేర్చే వ్యక్తి ఎవరైనా మనకు దొరికితే, ఆయన అసలైన గురువు. ఆయనకే సద్గురువు అని పేరు. గురువులు అందరూ పూజ్యులే. సద్గురువు మాత్రం సాక్షాత్తు దైవానికి ప్రతినిధి.
* పూర్వజన్మ జ్ఞాపకాలు వచ్చే అవకాశం వుందా?
- యన్.సురేంద్ర, కొత్తగాజువాక
తీవ్రమైన మంత్రోపాసన లేక తీవ్రమైన యోగసాధన చేసినవారికి ఈ పూర్వజన్మ జ్ఞాన సిద్ధి లభించే అవకాశం వుంది.
* వయస్సు 2,3 ఏళ్ళు పెద్దదైన యువతిని పెళ్ళిచేసుకోవచ్చా? రామాయణంలో పెద్దదైన సీతను రాముడు చేసుకున్నాడు కదా!
- రోజారమణి, హైదరాబాదు
ఇలాంటి విషయాలలో మనం ధర్మశాస్త్రానే్న అనుసరించాలి గానీ దివ్య పురుషులను కాదు. అక్కడ సీతాదేవి అయోనిజ (శ్రీరాముడు దివ్యపాయసంవల్ల జన్మించిన అవతార పురుషుడు) మన విషయాలు అక్కడ అన్వయించవు. మన ధర్మశాస్త్రాల ప్రకారం వరుడికంటే వధువుయొక్క వయస్సు తక్కువగానే వుండాలి.

ధర్మసందేహాలు

కుప్పా వేంకట కృష్ణమూర్తి
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.
vedakavi@serveveda.org