ధర్మసందేహాలు

ఆలయము, మఠము, మందిరము ఒక్కటేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* సంపదలు ఇంటి ముందే మరలిపోతాయి. బంధువులు స్మశానం దాకా వచ్చి తిరిగిపోతారు. జీవితం అశాశ్వతం. ఇది అందరికీ తెలిసి కూడా ఎందుకు మోహపడటం? - వి.బాలకేశవులు, గిద్దలూరు
మోహమనే పదానికి అర్థమిదే - తెలిసి కూడా, వద్దనుకుంటూ గూడా, తప్పు చేయటమే మోహం. హృదయంలోనే ప్రవేశించిన రజస్తమోగుణాలవల్ల రుూ మోహం ఉద్భవించి వర్ధిల్లుతుందని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు.

* ఆలయము, మఠము, మందిరము - ఈ పదాలు ఏఏ సంస్థలకు వర్తిస్తాయి?
మూలస్థానం శంకరయ్య, మన్నారు
మంత్ర పూర్వకంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు జరిగిన దేవతా స్థానాలను ఆలయాలు లేక దేవాలయాలు, లేక దేవస్థానాలు అంటారు. మంత్ర పూర్వక ప్రతిష్ఠ లేకుండా వట్టిగా దేవతా విగ్రహాలను పెట్టి పూజించే ప్రదేశాన్ని మందిరము అంటారు. సంన్యాసులు, విద్యార్థులు మొదలైన వారు నివసించే స్థానాలను మఠములు అంటారు. నిఘంటువుల ప్రకారం ఈ పదాలను వినియోగించవలసిన తీరు ఇది.
* ఆధ్యాత్మికత అనే పదానికి అర్థమేమిటి?
శంకర్, నెల్లూర్
ఆధ్యాత్మికత అనే పదాన్ని ఇటీవలి కాలంలో వేదాంతపరమైన తత్త్వదృష్టి అనే అర్థంలో ఎక్కువగా వాడుతున్నారు. అది తప్పు కాదు. కానీ కొన్ని ప్రాచీన గ్రంథాలలో ఈ పదాన్ని ‘‘శరీరానికి సంబంధించినది’’ అనే అర్థంలో గూడా వాడారు.
* దైవ నిర్ణయము - అంటే ఏమిటి?
- రాజా, హైదరాబాదు
దైవము - అనే పదానికి ఈ సందర్భంలో - తాను చేసుకున్న పూర్వకర్మ అని అర్థం. కాగా దైవ నిర్ణయము - అంటే పూర్వజన్మ కర్మ ఫలము - అని సారాంశం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పావేంకటకృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం.8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి