ధర్మసందేహాలు

కురుపాండవుల యుద్ధం ధర్మపథంలో సాగిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత యుద్ధం మొదటినుండీ చివరివరకూ అధర్మపధంలో జరిగింది కదా! అలాంటి కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రమని ఎలా అన్నారు? - కె.మధుసూదన్, హనుమకొండ
భారతయుద్ధంలో కొన్ని అధర్మాలు దొర్లిన మాట నిజమేగానీ మొత్తం అధర్మం కాదు. అది అలావుంచినా కురుక్షేత్రానికి ధర్మక్షేత్రమనే పేరు భారతయుద్ధంవల్ల రాలేదు. ‘‘కురువు’’ అనే పూర్వచక్రవర్తి ఒకడు తపస్సు, యజ్ఞాలు చేసి ఆ ప్రదేశానికి ధర్మక్షేత్రమనే వరాన్ని పొందాడు. కురుచక్రవర్తి పేరుమీద దానికి కురుక్షేత్రమనే ప్రసిద్ధి గూడా వచ్చింది.
* దేవతలు, రాక్షసులు కలిసి సమంగానే శ్రమపడి క్షీరసాగరాన్ని మధించారు కదా! ధర్మపాలకుడైన శ్రీమహావిష్ణువు మోసంచేసి దేవతలకే అమృతం ఎందుకిచ్చాడు?
- వి.బాలకేశవులు, గిద్దలూరు
శ్రీ మద్భాగవతంలో క్షీరసాగర మథన ఘట్టాన్ని మరోసారి జాగర్తగా చదవండి. మున్ముందుగా రాక్షసులు దేవతలను వంచన చేద్దామని ప్రయత్నించి వుండకపోతే శ్రీహరి ఆ వ్యవహారంలో వేలుపెట్టి వుండేవాడే కాదు.
* హనుమంతుడు బ్రహ్మచారి గనుక స్ర్తిలు సుందరకాండ పారాయణ చేయకూడదని ఒకచోట చదివాను. సుందరకాండలో స్ర్తిమూర్తి సీతాదేవి నాయికగదా! ఈ నిషేధం ఎలా వర్తిస్తుంది? రాజు, హైదరాబాదు
అందుకనే ప్రామాణికమైన గ్రంథాలను మాత్రమే చదవాలని పెద్దలు చెపుతూ వుంటారు. సుందర హనుమన్మంత్రమని ఒక మంత్రం వుంది. ఆ మంత్రం ఉపదేశం వున్నవారే సుందరకాండను ఫలసిద్ధికోసం పారాయణ చేయాలి. వట్టిగా కథాగ్రహణం కోసమైతే ఈ నిషేధం లేదు. తెలుగు అనువాద పారాయణకుగూడా ఏ నిషేధాలూ లేవు. అంతేగానీ, స్ర్తిపురుష ప్రసక్తిలేదు.
* మరణించిన వారందరూ కీర్తిశేషులేనా?
- యన్.రామలక్ష్మి, సికింద్రాబాదు కొందరు అపకీర్తి శేషులు గూడా కావచ్చు. కీర్తిశేషులు అనే పదాన్ని శరీరం లేనివారు అనే అర్థంలో స్వీకరించాలి.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279,
రోడ్ నెం. 8, అలకాపురి,
హైదరాబాద్-500 035.

కుప్పా వేంకట కృష్ణమూర్తి