ధర్మసందేహాలు

సర్వులూ సమమే అయతే? ( ధర్మసందేహాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* మా పిల్లలు మాకుఅబ్దికాదులు పెడతారన్న నమ్మకం లేదు. మాకు ప్రతి ఏడూ ఆబ్దికాలు పెట్టే సంస్థలు వున్నాయా? - ఎస్.ఎన్. ఆర్.మూర్తి, కాకినాడ
ఇలాంటి సంస్థలు ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఎవరు కర్తలో వాళ్లే ఆబ్దికాలను పెట్టాలి. వారు పెట్టనంత మాత్రాన మీ పుణ్యలోకాలు పూర్తిగా తుడిచి పెట్టుకుపోవు. అపర ధర్మశాస్త్రంలో ఏ ఏ దానాలు విహితమయి ఉన్నాయో పెద్దల ద్వారా విచారించుకుని, శక్తి వంచన లేకుండా , మీ దంపతుల ఉత్తర గతుల కోసం సంకల్పించి ఆయా దానాలన్నీ శ్రద్ధగా ఆచరించుకోండి. మీకు తప్పక ఉత్తమ లోకాలు లభిస్తాయి.
* భగవంతుని ముందు అందరూ సమానమే కదా. క్షీర సాగర మధన సందర్భంలో కూర్మరూపంగా దేవతలకు సహాయపడిన విష్ణుమూర్తి మోహినీ రూపంలో రాక్షసులకు అన్యాయం చేయదగునా?
- వి. బాల కేశవులు, గిద్దలూరు
ఒక న్యాయాధిపతి ముందర అందరూ సమానులే కదా. ఆయన మంచివారిని వదిలేసి, దొంగలకు మాత్రమే శిక్షవేయుట తగునా- అన్నట్టుంది మీ ప్రశ్న. చేసుకొన్న ఒప్పందాన్ని అతిక్రమించి అమృత కలశాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించిన దొంగలు రాక్షసులు . వారికి సహాయం చేయడమే ధర్మమని వాదించగలమా?
* గాయత్రీ మంత్రం రహస్యమైనదనీ అందుకే చెవులోనే ఉపదేశించాలనీ పెద్దలు చెబుతారు కదా. కానీ ఇటీవల ఆ మంత్రాన్ని కాసేట్లుగా, సెల్ ఫోను రింగుటోన్లుగా వివిధ రంగాల్లో వినిపిస్తున్నారు. ఇది తగునా?
-వి.వి. భగవాన్ , విజయవాడ
ధర్మశాస్త్రానికి ఇది ఎంత మాత్రమూ సమ్మతమైనది కాదు
* గాయత్రి అనేది ఒక ఛందస్సే కానీ మంత్రము కాదనీ కనుక ఆ మంత్రాన్ని ఉపనయనార్హత లేనివారు కూడాజపించవచ్చని కొందరు వాదిస్తున్నారు. మంచి పద్ధతినే ఇది? - ఊర్మిళాదేవి, విశాఖ
గాయత్రి అనే పేరుతో ఒక ఛందస్సు ఉన్నమాట నిజమే. అలాగే అదే పేరుతో ఒక మంత్రము, ఒక దేవత కూడా ఉన్నమాట కూడా నిజమే. అనాది సిద్ధంగా వస్తున్న వేద సమ్మత విషయాలను ధిక్కరించి కొత్త విపరీతవాదాలు చేయడం శాస్త్ర సమ్మతం కాజాలవు.
* అథర్వశీర్ష గణపతి హవనం చేయాలంటే గకార గణపతి స్తోత్రం చేసి తీరాలా? ఇతర నియమాలేవయినా ఉన్నాయా? జయసూర్య , కందుకూరు
అథర్వ శీర్ష గణపత్యుపనిషత్తు ఉపదేశం ఉండి, గణపతి మూలమంత్ర ఉపాసన వుంటే, వేద వేత్తలయిన ఋత్విక్కుల సహాయంతో ఆ హోమాన్ని ఆచరించుకోవచ్చు.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.

- కుఫ్పా వేంకట కృష్ణమూర్తి