ధర్మసందేహాలు

ప్రాణికోటి అంతా ఒక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* యమభటులచే ప్రాణాలు తోడివేయబడుట అనేది కేవలం మానవుల విషయంలోజరిగేదా లేదా అన్ని జీవరాసులకూ యిలాగే జరుగుతుందా? పి.వి. నరసింహారావు, రాజమండ్రి
యమభటులు ప్రాణాలు తోడమనేది అందరు జీవులకూ సమానమే. అయతే పశుపక్ష్యాదుల వియంలో పాపపుణ్య విచారణ ప్రసక్తి ఉండ దు. ఒక్క మానవులకు మాత్రమే మరణానంతరం యమసభలో పాపపుణ్య విచారణ ఉంటుంది.
* కలియుగంలో వితంతు పునర్వివాహం దోషం కాదని తెలిపే శాస్త్ర ప్రమాణాలు ఏవైనా ఉన్నాయా? - నరహరి, నెల్లూరు
భర్త నపుంసకుడు అవటం, ఇంటిలోనుంచి పారిపోవటం, కులభ్రష్టుడు కావటం వంటి సందర్భాల్లో స్ర్తి పునర్వివాహాన్ని కొన్ని స్మృతులు అంగీకరించాయి.
* బ్రాహ్మణులల్లో ‘శాఖాభేదా’లకు శాస్ర్తియమైన పట్టింపు వున్నదా? - విజయప్రసాద్, సూర్యాపేట
శాఖాభేదాలనేవి పూర్వకాలంలో ప్రాంతీయంగా ఏర్పాటు చేసిన లౌకిక వ్యవస్థమే తప్పితే వీటికి శాస్త్ర పరంగా ఏ ఆధారము లేదు. కుటుంబ సంప్రదాయం ప్రశస్తంగా వున్నప్పుడు ‘శాఖాభేదం’ పేరుతో వివాహ సంబంధఆలు చెడగొట్టుకోవడం శాస్త్ర సమ్మతం కాదు.
* ఆచమనంలో చెప్పేవన్నీ విష్ణునామాలు కాగా,మధ్యలో ‘‘హరయే నమః’’ అనే శివనామం ఎలా చేరింది.
- రఘురామ్, సూర్యాపేట
‘‘హరయే’’ అనేది విష్ణువాచకమే. హరి అనేది ఇకారాంత పుంలింగ శబ్దం. దానికి చతుర్ధీ విభక్తి ఏకవచన రూపం- ‘హరయే’ అని విష్ణువు కొరకు నమస్కారము అని అర్థం.
* సంధ్యావందనంల గాయత్రి జపానికి పూర్వంలో చెప్పుకొనే ‘‘శ్రీయమావాహయామి’’ అనే మంత్రంలోని దేవత ఎవరు? - లక్ష్మి,హైదరాబాదు
ఆ దేవత పేరు ‘‘శ్రీః’’ లక్ష్మీదేవి అని అర్థం. శ్రీః అనే శబ్దానికి ద్వితీయావిభక్తి ఏకవచనం ‘‘శ్రీయం’’ +అవాహయామి కలిపితే శ్రీయమావాహయామి అని వస్తుంది లక్ష్మీ దేవిని ఆవాహన చేస్తున్నాను అని అర్థం.
* టోపీలు ధరించడంలో శాస్త్రం ఉందని కొందరు వాదిస్తున్నారు. ఇందులో నిజమెంత?
- బి.ప్రసాద్, గుంటూరు
ప్రాంతీయ శీతోష్ణస్థితి గతులనుబట్టి ఈ ఆచారాలు ఏర్పడుతూ వుంటాయి.ఇందులో వాదనలు అనవసరమైన గొడవ మాత్రమే అవుతుంది.
* ‘నూరు వరహాల పుష్పాలు’ గా పిలువబడుతున్న పుష్పాలకు ఆ పేరు రావడానికి కారణమేమి? పూజలలో ఈ పుష్పాలకు విశేష ప్రాధాన్యం ఉందా? ఇవి చెట్టు నుండి రాలిపోయిన తరువాత తీసుకొని పూజకు ఉపయోగించాలి అనేనియమం ఏమైనా ఉందా?
ఆ పువ్వులో కింజల్కాలు ఎక్కువ సంఖ్యలో వుండటం వలన దానికా పేరు వచ్చినట్లు కనిపిస్తోంది. దానికి పూజలో ప్రత్యేక ప్రాధాన్యము లేదు. వాటిని చెట్టు మీద వుండగా కోసుకొని వాడటమే ప్రశస్తం.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్ - 500 035.

కుప్పా వేంకట కృష్ణమూర్తి