ధర్మసందేహాలు

రాముని వయస్సు ఎంత ఉండవచ్చు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రావణ సంహారం తరువాత, కుశలవులకు పట్ట్భాషేకం చేసినాక, శ్రీరాముడు అవతారం చాలించాడని విన్నాను. అప్పటికి ఆయన వయస్సు ఎంత వుండవచ్చు?
- కె.యల్.శివాజీరావు, హైద్రాబాద్
రావణ సంహారానికి రాములవారి వయస్సు సుమారు 45 సం.లు. ఆ తరువాత కొద్ది సంవత్సరాల్లోనే లవకుశ జననం. అది జరిగినాక 12 సంవత్సరాలకు సీతా భూప్రవేశం. దాని తరువాత సుమారుగా పదివేల తొమ్మిది వందల సంవత్సరాల కాలం రామరాజ్యమనబడే వికేంద్రీకృత రాజ్య వ్యవస్థా నిర్మాణానికై (ఫెడరల్ సిష్టమ్ ఆఫ్ గవర్నమెంటు కొరకై) కృషిచేసి, రామరాజ్యాన్ని స్థాపించి, 11వేల సంవత్సరాలు జీవించాక, కుశుడికి చక్రవర్తి స్థానాన్ని, లవుడికి సామంత రాజస్థానాన్ని ఒప్పగించి రాములవారు శరీర త్యాగం చేశారని వాల్మీకి చెప్పిన లెక్క.
* కర్ణుడు కవచకుండలాలు ఇంద్రునికి దానంచేసి శక్తిని పొందాడు కదా. ప్రతిఫలం పొందిన కర్ణుడు మహాదాత ఎలా అయ్యాడు?
- వి.బాలకేశవులు, గిద్దలూరు
కర్ణుడు బేరం మాట్లాడుకుని కవచకుండలాలు దానం చేయలేదు. ప్రాణాంతకమైన ఆ దానాన్ని చూసి చలించిపోయిన దేవేంద్రుడు తన వరంగా శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు, అంతే. అందువల్ల కర్ణుడి దానవీరత్వానికి ఏ లోటూ లేదు.
* ఎవరైనా మరణించినప్పుడు స్మశానం దాకా కూడా వెళ్ళినవారు, చితి అంటించగానే వెనక్కు చూడకుండా తిరిగి రావాలా? కపాలమోక్షం దాకా వుండి రావడం మంచిదా?
- నిర్మల, వైజాగ్
కపాలమోక్షం దాకా వుండి, ఆ జీవి యొక్క ఉత్తమ సద్గతికోసం ప్రార్థన చేసి రావటమే ఉత్తమం.
* వికలాంగులు, వ్యాధిగ్రస్తులు, మూగవారు శాస్త్రం ప్రకారంగా రాజ్యపాలనకు అర్హులేనా?
- కె.వి.ప్రసాదరావు, కందుకూరు
కాదు.
* ఆషాడంలో ఆడపిల్లలు గోరింటాకు తప్పని సరిగా పెట్టుకోవాలని లేకుంటే అనర్థాలు జరుగుతాయని అంటున్నారు. ఇది శాస్త్ర సమ్మతమేనా? రాజు, సికిందరాబాదు
గోరింటాకులు పెట్టుకోవడం అనేవి కేవలం ప్రాంతీయాచారాలు మాత్రమే.

ప్రశ్నలు పంపాల్సిన చిరునామా :
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8, అలకాపురి, హైదరాబాద్ - 500 035.

- కుప్పా వేంకట కృష్ణమూర్తి