Others

కృతజ్ఞతాంజలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయడమో లేక ఆ ఉపకారాన్ని చేసిన మనిషిని సదాగుర్తుంచుకోవడం వారి పట్ల గౌరవభావాన్ని కలిగి ఉండడమే కృతజ్ఞత అని చెప్పుకోవచ్చు. అనేకానేకవిధాలుగా మనిషికి సాయం చేస్తున్న ప్రకృతికి కృతజ్ఞతలు చెప్పడానికే అనేక రకాల పండుగలు పుట్టుకొచ్చాయి.అట్లానే ప్రతి చెట్టూ ఏదోఒక రకంగా మానవునికి ఉపయోగపడేది. ఆయుర్వేదశాస్తమ్రూ ప్రతిచెట్టూ మనిషి అవసరాలకు పనికి వచ్చేదని చెప్తుంది. ఆదిమ మానవుని దగ్గరనుంచి నేటి ఆధునిక జీవితం గడుపుతున్నా మనిషి సహజమైన గాలి కోసం సహజవనరుల కోసంప్రకృతిమీద ఆధారపడుతున్నాడు. మనిషి కనిపెట్టిన అనేక వస్తువులు యంత్రాలు వల్ల ఏర్పడే కాలుష్యాన్ని చెట్లే పోగొడుతున్నాయి. కనుక చెట్లకు కృతజ్ఞత తెలపడంకోసమూ పండుగలు ఆవిర్భవించాయి. ఏ పండుగైనా మంచిసువాసనను ఇచ్చే మామిడాకుల తోరణం తప్పనిసరిగా కడతారు. ఆదిదేవుణ్ణి అనేకరకాల పత్రాలతోనే పూజిస్తారు. రావిచెట్టుకు,వేపచెట్టుకు వివాహమహోత్సవం జరిపి లక్ష్మీనారాయణుల వివాహం చేశామని మురుస్తారు. పూరిజగన్నాథునికి నవకళేబరోత్సవం అని చేస్తారు. సూర్యునికి జిల్లేడు ఆకులు, చిక్కుడు ఆకులతో నైవేద్యాలు సమర్పిస్తారు. మహావిష్ణువుకు తులసి దళాలతో పూజచేస్తే పరమశివునకు మారేడు దళాలతోసహస్రనామావళి జరుపుతారు. ఒక్క మారేడు దళం సమర్పిస్తేచాలు అఖండ ఐశ్వర్యాన్ని శివుడు అనుగ్రహిస్తాడని అంటారు. ఇట్లా ప్రతి దేవునకు పత్రాలతోను, పండ్లతోను అర్చిస్తారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మనిషి సైతం చెట్ల నుంచి వచ్చే ఆహారాన్ని మాత్రమే తీసుకొంటేఆరోగ్యానికి ఢోకాఉండదంటారు. ఇంత సాయం చేసేవృక్షాలను నేటి మానవుడు అలక్ష్యం చేస్తున్నాడు. దానివలనే ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటోంది. ఇప్పటికై కృతజ్ఞత ఇవ్వడం అనే గుణాన్ని గుర్తుంచుకుని వృక్షాలను కాపాడడం మనిషి కర్తవ్యంగా గుర్తించాలి.

- సత్య