Others

ఆరాధన.. అమృతయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దై వాన్ని ప్రార్థించడం మనిషికి పెద్ద ఉపశమనం. పొద్దుట లేవగానే ‘నా ఈ జీవితం సుఖ సంతోషాలతో సాగించాలని శతకోటి దేవతలకి వందనాలు’ అని మనసులోనే చెప్పుకోవటంలో మనిషికి ఒక తృప్తి లభిస్తుంది. ఆపదలో వున్నపుడు ఇష్టదైవాన్ని స్మరించడంతో మనసు స్వాంతన పొందుతుంది. ప్రార్థించడమంటే ప్రత్యేకించి గుడికి వెళ్ళనవసరం లేదు. ఎక్కడ వున్న ఏం చేస్తున్నా దైవాన్ని ఆరాధించడం సాధ్యమే. ఇది మూఢ నమ్మకం కాదు. బలహీనత కాదు. మనిషికి ఉత్తేజాన్ని ఇచ్చే అంశం. ఏ బంధమైనా సరే బలపడే ముందు, భరించలేనంతగా బాధిస్తుంది. బాధలను భరిస్తే బంధం బానిస అవుతుంది. కాదని విడిస్తే కాలక్షేపమే కష్టవౌతుంది. గాయపడిన మనసుకి ఓదార్పు గొప్ప ఆరాధన అవుతుంది. అలుపెరగని అడుగులకు భగవంతుని ఆరాధన మించిన అమృతయోగం కంటే మించింది ఏముంది? బాణాన్ని వెనక్కులాగకుండా ముందుకు వదలలేము. అట్లాగే జీవితం మనల్ని వెనక్కు కష్టాల్లో నెట్టుతూ వుంటే- అది మనల్ని ఏదో గొప్ప విషయంలోకి ఆరాధన ముందుకు ప్రవేశపెడుతుంది. ఓడిపోయేవారు ఒక్కసారే ఓడిపోతారు. గెలిచేవారు ఎన్నోసార్లు ఓడిపోతారు. కారణం గెలిచేదాకా ప్రయత్నిస్తారు కాబట్టి. అపజయాలకు కుంగిపోక ఆరాధనాపూర్వకంగా భక్తితో, శక్తితో నిరంతరం ప్రయత్నించాలి. ఈ సృష్టి చాలా చిత్రమైనది. జీవన ప్రయాణంలో ఎవరు ఎపుడు వస్తారో, ఎవరు ఎపుడు దూరం అవుతారో తెలియదు కానీ, మనకు ఎవరో ఒకరు తోడు నీడగా ఉండేలా జీవించాలి. ప్రతి ఆరాధానాత్మక బంధం విలువైనదిగా భావించాలి. ప్రతి మనిషికీ- ఈ ప్రపంచంలో దొరికే అతి పెద్ద సంపద ఆరాధన. అత్యంత బలమైన ఆయుధం కూడా ఆరాధనే. సురక్షిత విశ్వాసమైన గొప్ప ఔషధమైనా, ఆశ్చర్యకరమైన గొప్ప అంశమైనా ఆధ్యాత్మికమైన ఆరాధనయే. పరమాత్మ సర్వాంతర్యామి. నిరాకార స్వరూపుడు. రాత్రిపూట నక్షత్రాలు కనిపించనంత మాత్రాన, నక్షత్రాలు లేవని అనగలమా? అదేవిధంగా పరమాత్మ లేడని భావించకూడదు. పరమాత్మకు అనేక నామాలున్నవి. ఆయన రూపాలు అనంతంగానూ ఉన్నవి. మనకు ఏ నామం ఏ రూపం నచ్చునో వాని సాయం చేతనే భగవంతుని సాక్షాత్కారం పొందగలం. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేం? ఏ ఆట చివరిదో? ఏ మాట చివరిదో? ప్రకృతి నియమాలు కూడా చాలా విచిత్రమైనవి. ప్రాణమున్న మనిషి నీళ్ళలో మునిగిపోవడం, చచ్చిన తర్వాత నీటిలో తేలిపోవడం ఎంత సహజమో అట్లాగే- వీలైనంతగా భగవంతుని మహిమను తలచుకుంటూ వీలైనపుడు ఆరాధన చేయడం ఎంతో మేలు చేస్తుంది.

- ఆర్. భల్లం