ధర్మసందేహాలు

వినాయకుడు ఏకదంతుడెలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* వినాయకుఢు ఏక దంతుడెలా అయ్యాడు? ఎస్.రామలక్ష్మి, సికింద్రాబాదు
దీనికి వేర్వేరు పురాణాలలో వేర్వేరు సమాధానాలున్నాయి. అన్నిటికాన్న ప్రసిద్ధమైన కథ ఇది- గణపతి, పరుశురాముడు కొంతకాలం సహాధ్యాయులుగా ఉండేవారు. ఆరోజుల్లో ఒకసారి సరదాకోసం వారిద్దరూ స్నేహయుద్ధం చేశారు. ఆ యుద్ధంలో పరుశురాముడి గొడ్డలి వినాయకుని దంతానికి తగిలింది. ఆ గొడ్డలి పరమేశ్వర ప్రదత్తం. అందువల్ల ఆ గొడ్డలిని గౌరవించేందుకోసం గణపతి తన దంతాన్ని దానికి బలి ఇచ్చేశాడు. అప్పటినుంచీ ఆయన ఆ విరిగిన దంతాన్ని తన చేతిలోనే ధరించి వున్నాడు. ఈ విధంగా గణపతి ఏకదంతుడయ్యాడు.
* శ్రీకృష్ణుడికి సంతానం కలదుకదా. మరి బ్రహ్మచారి ఎలా అయ్యారు?
- లక్ష్మి, వరంగల్లు
ఆయన స్ర్తిలతో విహరించే సమయంలో కూడా ఆయన మనస్సు ఇంద్రియాక్రాంతం కాకుండా పరబ్రహ్మ యందే అవిచ్ఛిన్నంగా లగ్నమయి ఉన్నందువల్ల ఆయన నిత్య బ్రహ్మచారి అయ్యాడు. ఈవిషయాన్ని నారదభార్గవ సంవాదాది ఘట్టాలలో శ్రీ మద్భాగవతంలో వ్యక్తంచేసి ఉన్నారు.
* ఇంద్రుని పదవీచ్యుతుని చేసి స్వర్గ లోకాన్ని ఆక్రమించుకున్న రాక్షసరాజులు ఎందరో వున్నారు కాని వారిలో ఎవరూ స్వర్గలోకంలో భద్రపరిచిన అమృతం తాగినట్లు లేదు కారణం ఏమిటి?
బాలకేశవులు, గిద్దలూరు
ఇది విష్ణుమాయా ప్రభావమే అని పురాణవేత్తలు చెబుతున్నారు
...............................................
ప్రశ్నలు పంపాల్సిన చిరునామా:
కుప్పా వేంకట కృష్ణమూర్తి
ఇంటి నెం. 11-13-279, రోడ్ నెం. 8,
అలకాపురి, హైదరాబాద్-500035.

కుప్పా వేంకట కృష్ణమూర్తి