Others

ఆళ్వార్ల రూపాలు.. రంగనాథుని స్వరూపాలే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవద్గీతలో ‘ సంభవామి యుగే యుగే’ అన్నట్లు ప్రజలు ఐహిక సుఖపరాయణులై ధర్మాన్ని, నీతిని మరచి భక్తిలోపించి, రక్తిలోబడి భగవంతుని మరిచిపోయినవారి ఉద్ధరణకు, సన్మార్గంలో పెట్టుటకు భూలోకంలో అవతరించారు సుప్రసిద్ధ వైష్ణవ భక్తులు ఆళ్వారులు.
వారు పనె్నండు మంది. శ్రీమన్నారాయణుడు తన శ్రీవత్స, కౌస్త్భు, వైజయంతి, వనమాల, పంచాయుధ, అనంత, గరుడాదులను చూచి ‘మీరు భూమిమీద కావేరి, తామ్రవర్ణి, వేగవతి, బాహుద నదీ తీరాలలో అవతరించి ప్రజలను ఉద్ధరించండి’అని ఆదేశించాడని, ఆ ప్రకారం ద్రావిడ దేశంలో ఈ 12 మంది ఆళ్వారులు అవతరించారని ఐతిహ్యం.
ఆళ్వారుల పేర్లు పోయేగై ఆళ్వార్, పూదత్తాళ్వార్, హెయాళ్వార్, పెరియాళ్వార్, తిరుమళిశయాళ్వార్, కుల శేఖరాళ్వార్, తొందరప్పాదియాళ్వార్, తిరుమంగయాళ్వార్, ఉడయవరులనబడు రామానుజులు, నమ్మాళ్వార్, మధురకవియాళ్వార్- వీరు ద్రవిడ భాషలో రాసిన నాలుగువేల పాశురాలను నాలాయిర దివ్య ప్రబంధం అని పేరు.
వీరిలో కొందరిని గురించి తెలుసుకుందాం.
విశిష్టాద్వైత మత ప్రవక్త. శ్రీవైష్ణవ మతాచార్యులలో ప్రముఖుడు ఉడైవరులు, యతిరాజు అనబడే శ్రీరామానుజాచార్యులు. వారు క్రీ.శ.1019 ప్రాంతంలో దక్షిణ భారతదేశమందున్న శ్రీపెరంబుదూరు అనే గ్రామంలో జన్మించారు. కంజీవరం (కంచి)లో యాదవ ప్రవేశుడనే అద్వైత పండితునికి శిష్యుడై వేదాధ్యాయనంలోను, వేదార్థ ప్రవచనంలోనూ ఆరితేరాడు. చిన్ననాడే వివాహం అయింది. కాని భార్య అనుకూలవతి కాదు. కొంతకాలం వైవాహిక జీవితం గడిపి తరువాత సన్యసించి శేష జీవితం విశిష్టాద్వైత మతప్రచారంలో గడిపారు. ఎందరో ఈయనకు అనుయాయులు అయ్యారు. విశిష్టాద్వైత సిద్ధాంతపరంగా బ్రహ్మసూత్రాలలో ఆయన భాష్యం వ్రాశాడు.
వేదాంతసారం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం, ఆయన ఇతర తాత్త్విక రచనలు. భగవద్గీతపై భాష్యం వ్రాసి కాశ్మీరు సరస్వతీపీఠంలో తత్త్వవేత్తల మహాసభలో చదివి వినిపించారు. వారు వ్రాసిన బ్రహ్మసూత్ర భాష్యాన్ని ‘‘శ్రీ్భష్యం’’ అంటారు. గద్యత్రయం అంటే భక్తిరచనలు చేశారు. దేశ పర్యటన చేసి విశిష్టాద్వైత మతాన్ని సుస్థిరం చేశారు. 108 దివ్య తిరపతులు అను వైష్ణవ పుణ్యక్షేత్రాలను ప్రతిష్ఠచేసి తన అనుచరులలో పరిణతులైన వారిని 74 మందిని పీఠస్తులుగా నియమించారు. తన మత ప్రచారాతి విశేష కృషిచేసి 120 నిండు సంవత్సరాలు జీవించి క్రీ.శ.1139లో పరమపదించారు. ప్రజలు తరించాలనే ఆశయంతో వారి గురువులు రహస్యంగా చెవిలో చెప్పిన అష్ఠాక్షరీ మంత్రం శ్రీరంగస్వామి గుడి గోపుర శిఖరంపైకి ఎక్కి ‘‘! ఈ మంత్రం పఠించి మోక్షం సంపాదించండి’’అని బాహాటంగా ప్రకటించారు.
మరియొక ఆళ్వారు తొండరడిప్పొడి ఆళ్వారు. వీరే విప్రనారాయణులు. ఆ మహాత్ముని జీవితంలో జరిగిన సంఘటనలు సాధకులకు, ముముక్షువులకు ఒక గుణపాఠం. వారి జన్మస్థలం చోళ రాజ్యంలోని మడంగుడి. విషయ భోగాలలో విరక్తుడై శ్రీరంగక్షేత్రం చేరాడు. దేవునికి పుష్పకైంకర్యం చేయాలనే తలంపుతో చిన్న ఉపవనాన్ని పెంచి, ఆశ్రమం నిర్మించుకొని రంగని నామస్మరణ అహర్నిశలు చేసేవాడు. శ్రీరంగుడి దగ్గర ఊరిలో ఇద్దరు దేవదాసీలు వుండేవారు. రాజదర్బారులో నాట్యప్రదర్శననిచ్చి తిరిగి వెడుతూ ఆయన ఆశ్రమానికి వచ్చారు. పూల తోట అందానికి ఆనందిస్తూ ఆశ్రమంలోనికి వెళ్ళి విప్రనారాయణునికి నమస్కరించారట!! రంగని నామస్మరణులోనున్న ఆయన వీరిని గమనించలేదు.
దేవదాసీలలో చిన్నదైన దేవదేవి రోషపడి, ఆయనను తన దాసునిగా చేస్తానని ప్రతిన చేసింది. కాషాయ వస్త్రాలు ధరించి యోగినిగా వున్న ఆమెను ఆశ్రమంలోనికి తెచ్చాడు. క్రమక్రమంగా స్వామిని లొంగదీసుకొని, సేవలుచేస్తూ విషయలోలుని చేసింది. ప్రారబ్ధకర్మ ఎంత అనివార్యమోకదా! దేవదేవి లేకుండా బ్రతకలేననే పరిస్థితిలో స్వామి దేవదేవి ఇంటికివెళ్తే తన ప్రతిన నెరవేరిందనే అహంతో స్వామిని వెళ్ళగొట్టింది. పిచ్చివాడైన ఆయనకు విముక్తి ప్రసాదించాలనే సంకల్పంతో శ్రీరంగడు తన ఆలయంలోని ఒక బంగారు గినె్న తీసుకొని విప్రనారాయణుడు ఇచ్చాడని దేవదేవికి అందజేసాడు. దొంగ సొమ్ము కారణంగా దేవదేవితో సహా అతణ్ణి కారాగారంలో పెట్టేసారు. శ్రీరంగడు రాజు కలలో కనబడిన భక్తుడు నిర్దోషి అని చెప్తే విడుదల చేశారు. క్రమేణా పశ్చాత్తాపం, పరితాపం కలిగి ఆశ్రమానికి వచ్చి రంగని సేవలో జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు విప్రనారాయణుడు. రంగనాధుడే ఆయనకు ‘తొండరప్పొడి’అనే బిరుదు ఇచ్చాడని కథనం. ఆయన ఎన్నో పాశురాలు రచించి కీర్తిపొందాడు.
ఈ ఆళ్వారుల పరంపరలో పూదత్తళ్వారు, వాయ్‌గై ఆళ్వారు, పేయాళ్వారు, తిరుమళైశైయాళ్వారు, నమ్మాళ్వారు, మధురకవి, కులశేఖరాళ్వారు, తిరుప్పాడికి ఆళ్వారు, తిరుమలగై ఆళ్వారు మొత్తం 12 మంది ఆశ్వారులు రంగనాధుని నిరంతర సేవలో తరించారు. వారి వారి జీవితాల్లో రంగడు ఎన్నో విషమ పరిస్థితులు కల్పించి, వారిపై దొంగతనాలు, మోసాలు, స్వామి డబ్బు స్వార్థంగా కైంకర్యం చేశారనే అభియోగాలతో ఆఖరిలో వారి నిస్వార్థపరాయణులు, మహాభక్తులని నిరూపణ చేసి వారిని తనలో ఐక్యం చేసుకున్నాడు.
ఆళ్వారులు ఎన్నో పాశురాలు రచించారు. వాటిలో ఇరండాతిరువందాది, మొదల్ తిరువందాది, మూన్రాంతిరువందాది, పెరియ తిరువందాది, కణ్ణిమణి శిరుత్తాంబు, తిరుపెళుర్కుర్తివగైరా భక్తులు నిత్యపారాయణం చేస్తున్నారు. ఆళ్వారుల భక్తిస్వచ్ఛమైనది. వారికి కుల మత భేదాలు లేవు. సర్వమానవ సోదరభావం, కోరినవారు ఆచారాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అందరూ భగవంతుని బిడ్డలేనన్న భావంతో జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ దైవసాన్నిధ్యంలో ఉండాలనేది వారి దివ్య సందేశం.
ఆళ్వారుల చరిత్రలు చదివిన తర్వాత మనకు ఒక విషయం బోధపడుతుంది. ఈ విశ్వమంతా హరిహరాత్మకం, హరి అయినా, హరుడైనా మూలపురుషుని ప్రతిరూపాలే. శివకేశవులకు భేదంలేదని వేదాలు ఘోషిస్తున్నాయి. ఒకే వస్తువును వివిధ భాషల్లో వివిధ రకాలుగా పిలుస్తూవుంటాం. కాని అసలు వస్తువు ఒకటే! అదే విధంగా నామాలు ఎన్ని ఉన్నప్పటికీ స్వామి ఒక్కడే. పరమాత్మను ఏ రూపంలో కొలిచినప్పటికీ, ఏ నామంతో తలిచినప్పటికీ, పురుషోత్తముని చరణాలను ఆశ్రయించినట్లే!! ఏ రూపాన్ని ఏ నామాన్ని పూజిస్తున్నామనేది కాదు ముఖ్యం! ఎంత భక్తితో ఎంత తపనతో ఎంత ఆర్తితో ఆయనను శరణు జొచ్చామనేదే చాలా ముఖ్యం. హిందూత్వం ఏకత్వాన్ని బోధిస్తోంది. శైవమైనా, వైష్ణవమైనా ఇంకేదైనా, హిందూధర్మంలోని భాగాలే! సర్వమానవ శ్రేయస్సుకోసం భగవంతుడు ఆళ్వారులను సృష్టించారు. వారు ఎందరికో మోక్షమార్గం చూపించారు. వారి జీవితాలు ధన్యం!! వారి ఉపదేశాలు పాటించిన భక్తశిఖామణులు మరెంతో ధన్యులుగదా!!

- బొడ్డపాటి రాజేశ్వరమూర్తి