Others

భగవంతుడే సర్వస్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విశాల విశ్వంలోని సమస్త ప్రాణికోటి పీల్చే గాలి ఒక్కటే. త్రాగే నీరు ఒక్కటే, నివసించే నేల ఒక్కటే, పై కప్పు ఆకాశం ఒక్కటే. అందరికీ వెలుగునిచ్చే సూర్యభగవానుడొక్కడే. చల్లదనాన్ని అందించే చంద్రుడొక్కడే. అదే విధంగా అందరి దైవం ఒక్కడే. ఆయనే భగవానుడు. అల్లా, గాడ్. కాని మనం మీ దేవుడెవరని ప్రశ్నిస్తే కొందరు రాముడని, కొందరు కృష్ణుడని, మరికొందరు శివుడని, ఇంకొందరు ఆంజనేయుడని అయ్యప్పస్వామి అని, అమ్మవారని ఎనె్నన్నో రకాలుగా జవాబునిస్తారు. వాస్తవమునకు దేవతలందరూ ఒక్కటే. శ్రీమహావిష్ణువు నుండి పుట్టిన అంశాలే. బంగారం ఒక్కటే కాని ఆభరణాలనేకం, మట్టి ఒక్కటే పాత్రలనేకం. పంచదార ఒక్కటే పదార్థాలెన్నో. అలాగే వ్యక్తి ఒక్కడే కాని ఒకరికి కొడుకుగా, ఒకరికి భర్తగా, ఒకరికి తండ్రిగా ఒకరికి అన్నగా, మామగా, మరొకరికి తాతగా ఇలా ఎన్నో వావివరుసలు కలిగి ఉన్నట్లు ఆ దేవాది దేవుడైన పరబ్రహ్మకు వివిధ రూపాలు ఆపాదించి కొలువగా వేరు ఎలా అగుతుంది?
భగవంతుడే సృష్టి, ఆయనే ప్రకృతి. ఆయనే సర్వం, ఆయనే సర్వస్వం. మహాభారత యుద్ధసమయంలో కృష్ణ్భగవానుడు అర్జునునకు గీతోపదేశం చేస్తూ నేనే దేవాది దేవుడిని ఆదిదేవుడిని అని చెప్పాడు. అందుకే ‘‘సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ! అహంత్వా సర్వపాపేభ్యో మోక్షమిష్యామి మాశుచః॥ సర్వధర్మములను సమస్త కర్తవ్యకర్మలను నాకు అర్పించుము. నేను సర్వశక్తిమంతుడను. సర్వధారుడను, పరమేశ్వరుడను. కావున నీవు ననే్న శరణు పొందుము. నేను నిన్ను అన్ని పాపములనుండి విముక్తుల్ని గావిస్తాను. శోకింపకుము అని సెలవిచ్చాడు. ఆదిదేవుడిని గుర్తించుటకు శ్రీమహావిష్ణువే మూడురూపాలను ధరించి సృష్టికర్తయైన బ్రహ్మదేవుడిగా, స్థితికారకుడై రక్షించే శ్రీమహావిష్ణువుగా, ప్రళయాన్ని సృష్టించి లయకారకుడైన శివపరమేశ్వరునిగా భాసిల్లుచున్నాడు. ఈ మూడు రూపాలనే శ్రీమహావిష్ణు, గర్భోదయ విష్ణు, శిరోదయ విష్ణువని అంటారు. అందుకే శివకేశవులకు (హరిహరాదులకు) భేదం లేదంటారు. మానవుని బలహీనతలు రోజురోజుకు పెరిగి స్వార్థం మితిమీరి రంకెలు వేస్తున్నది. అనేకులు అనేక కోరికల విష వలయంలో చిక్కుకుని సతమతవౌతున్నారు. ఏ దైవాన్ని ఏవిధంగా పూజిస్తే లాభం జరుగుతుందో అని రకరకాల పూజలు జరుపుతున్నారు. అందుకే కబీర్ ‘‘దుఃఖ్‌మే సుమిరన్ సబ్ కరై సుఖ్‌మే కరైన కోయ సుఖ్‌మే సుమిరన్ కరైదుఃఖ్ కాయేకోహోయ’’అన్నాడు. అందరూ భగవంతుని దుఃఖములోనే స్మరిస్తారు. సుఖములో స్మరించరు. కాని ఎల్లప్పుడూ భగవంతుని స్మరిస్తే దుఃఖము ఎందుకు కలుగుతుంది. భగవంతునికి భేదభావాలు లేవు. ఏవిధంగా ఆరాధించినా భగవంతుని చేరుకుంటాము. విభిన్న ప్రాంతాలలో ప్రవహించి వచ్చిన సమస్త నదులు చివరకు సముద్రంలో ఎలా కలుస్తాయో అదే విధంగా మనం ఏ మార్గంలో పయనించి పూజించినా చివరకు చేరేది ఆ పరమాత్మలోనే. చంచలత్వం లేకుండా ఏదో ఒక రూపాన్ని మనసులో ప్రతిష్టించుకొని ధ్యాన నిమగ్నులం కావాలి. కోరికల కనుగుణంగా రూపాలను మార్చుకుంటే ఫలితం శూన్యం. నిస్వార్థంతో పూజిస్తే దేవుడు మనవాడే. దేవాదిదేవుడు శ్రీమహావిష్ణువే. ఏ దేవుడు చూపించని విరాట్ స్వరూపమును కేవలం అర్జునునకు మాత్రమే చూపించాడు కావున దేవాది దేవుడు ఆదిదేవుడు శ్రీమహావిష్ణువనియే రూఢియగుతున్నది.

- పెండెం శ్రీధర్