Others

గణేశ ఆరాధకులకు కరదీపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీగణేశతత్త్వం
వ్యాఖ్యాత:
కాశీభొట్ల సత్యనారాయణ
మూల్యం: రూ.36/- లు
ప్రతులకు
శ్రీమతి కాశీభొట్ల లక్ష్మి
2-7ఎ-12, శివాలయం దగ్గర
వెంకట నగర్
కాకినాడ,
ఫోన్: 9247320421
***
శ్రీ రాఘవేంద్ర పబ్లిషర్స్
ఫోన్: 0866-2410652

భరతభూమి కర్మభూమి. పుణ్యభూమి. పుణ్యచరితులకు ఇది ఆస్థానం. భారతీయం సర్వం ఈశ్వరమయమని చెప్తుంది. రాయి రప్ప చెట్టుచేమ, మనిషి జంతువు ఏది అయినా అది భగవంతుని రూపమే అంటుంది. ఉండేది భగవంతుడొక్కడే. సత్యం ఒకటే అయినా విశే్లషించి చెప్పేవారి వల్ల బహువిధాలుగా కనిపించినట్లే భగవంతుడొక్కడే అయినా పలురూపాల్లో కోరుకున్నవారికి కోరుకున్నట్లు కనిపిస్తాడనేది భారతీయ తత్వం. దీన్ని బహుచక్కని సరళమైన మాటల్లో సామాన్యులకు కూడా సులభంగా అర్ధమయ్యేట్టుగా శ్రీ కాశీభొట్ల సత్యనారాయణ గారు ‘‘శ్రీగణేశ తత్త్వము’’అన్న చిరుపొత్తంలో వివరించారు.
ఈపుస్తకంలోవిఘ్న గణపతి గురించి సవివరంగా వివరిస్తూ అసలు విఘ్నాలు ఎందుకు వస్తాయన్నది ఓమనిషి పనిచేస్తూ చేస్తూ విసుగు చెందో అలసట అలసత్వం ఇంకేదో దానికి గురైనప్పుడు ఎందుకు అన్న ప్రశ్న ఉత్పన్నమై పనిచేయడంలో వెనుకబడుతాడు. అలాంటపుడు భగవంతుని ఆరాధన వల్ల మనిషిలోని చైతన్యం ప్రచోదనమై తిరిగి శక్తివంతుడై తనకు నియమించిన కార్యాలను పూర్తిచేస్తాడని చెప్తూ గణేశుని ఎందుకు పూజించాలని, గణాలకు అధిపతి యైన విఘ్నేశ్వరుని పుట్టుక, తిరిగి శివుని వల్ల గజానుడు అయినవిధానికి తార్కిక కారణాలు సులభతరంగా అర్థమయ్యేట్లుగా చెప్పారు. అసలు గణపతి స్థూలకాయానికి గల కారణం వివరించారు. చైతన్యవికాసాలకు కారణాలున్న సూర్యచంద్రుల వల్ల కలిగే కాలవిశేషమే గణపతిగా చెప్పుకొచ్చారు. గణపతికి వివిధ ఉన్న రూపవిశేషాలు వివరిస్తూ భాద్రపద చవితినాడే వినాయకునికి పూజచేయడంలోని అంతరార్థాన్ని వివరించారు. ఇలా విఘ్ననాయకుడు రాక్షస సంహారకుడు ఎలా అయ్యాడు, ఆ విఘ్ననాయకుని కి దూర్వాలతో పూజించడంలోని ఔచిత్యవిశేషాలను చిరుపొత్తంలోనే చిన్న చిన్న ఉదాహరణలతో చక్కని వివరించారు. ఈ ‘‘శ్రీ గణేశ తత్త్వము’’ పూర్తిగా చదివితే గణేశతత్త్వం బోధపడుతుంది. మన ఆచార వ్యవహారాల్లో అంతరార్థం అవగతవౌతుంది. మనం నడవడిలో మన ఆరాధనలోగల విశేషాలన్నీ అర్థమయి మనం చైతన్యవంతులమవుతాం. కనుక ఈ పుస్తకాన్ని ప్రతివారు చదివి గణేశతత్త్వాన్ని ఆకళింపుచేసుకొని జీవితాలను సుందర మయం చేసుకోవాలి.

- వందిత