Others

శక్తి స్వరూపాలు..ముక్తి మార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవచంపక పుష్పాభనాసాదండ విరాజితా
తారాకాంతి తిరస్కారి నాసాభరణభూషితా
అంటూ అమ్మకు నమస్కారం చేస్తాం. ఆ అమ్మనే అఖిలలోకాలకు తల్లి. ఆ తల్లికి రూపం లేదు. గుణంలేదు. పేరు అసలే లేదు. కాని భక్తులు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతుంది. ధర్మాన్ని ఆచరించేవారికి వెన్ను దన్నుగా ఉంటుంది. సత్యధర్మాల రూపమే నేనేనని ప్రకటిస్తుంది. అటువంటి తల్లి కనుక రాక్షసాధములు త్రిలోకాలను అల్లకల్లోలం చేస్తూ బ్రహ్మాదులకు సైతం కలవరాన్ని కలిగిస్తుంటే తల్లి తన్ను తాను నవవిధాలుగా సృజియంచుకుంది. నవరూపాలను ధరించింది. ఒక్కొక్క రాక్షసుణ్ణి అంతం చేసింది. చిరునవ్వులు చిందించింది. ఆ తల్లినే బ్రహ్మవిష్ణుమహేశ్వరులు కీర్తించారు. ఆ తల్లిని యక్షకినె్నర గంధర్వులు కొనియాడారు. సిద్ధులు, సాధ్యులు, మునులు, తాపసులు స్తుతించారు. మానవులు అర్చించారు. ఇలా అందరి చేత పూజలందుకున్న ఆ తల్లిని ప్రతిఏటా ఆశ్వీయుజ మాసంలో శరన్నవరాత్రుల్లో పూచే పూలతో అలంకరిస్తూ నవ విధరూపాలను ధరింపచేసి ఆరాధించడమే దసరా. విజయాలను దరిచేర్చే తల్లి గా భావించి విజయదశిమిని వేడుకగా చేసుకుంటాం. ఐం హ్రీం క్లీం అంటూ తొమ్మిది బీజాక్షరాలతో పూజించినా దశాక్షర మాలతో పఠించినా తల్లి చల్లని చూపును అనుగ్రహిస్తుంది. అమ్మా నేను పామరుడిని నాకు ఏ మంత్రమూ రాదు. కేవలం నీ రూపాన్ని ధ్యానిస్తాను అన్నా ఐం అన్న ఒక్క అక్షరానే్న జపిస్తాను అన్నా ఆ తల్లి చిరునవ్వును చిలకరించి తన దరికి చేర్చుకుంటుంది. అంతటి అనురాగమయ అఖిలాండేశ్వరి ఆదిపరాశక్తిని పూజించని వారు ఎవరుంటారు. ఆ తల్లి రూపాలు నవవిధాలు. పూజలుతొమ్మిదిరకాలు వాటి వివరాలివే.
బాలాత్రిపుర సుందరీదేవి: చిన్న బాలికరూపంలో తన భక్తులను అలరంచేతల్లి. సాధకుల చేత ఉపాసించబడే కల్పవల్లి. బాలగా ఉండి ఆబాలగోపాలాన్ని తన కన్నుసన్నుల్లో మెలిగేట్టు చేస్తుంది. కనుకనే అమ్మకు బాలాత్రిపురసుందరీగా అలంకరిస్తారు. ఆరాధిస్తారు. అమ్మను ఆరాధించడానికి పేద గొప్ప తేడాలేదు. అమ్మ అనుగ్రహం లేకపోతే ఎవరైనా సరే అధః పాతాళలోకానికి చేరవలసిందే. హ్రీం, శ్రీం, క్లీం లాంటి బీజాక్షరాలలో ఆ తల్లి రూపం నిరూపితమవుతోంది. పంచదశాక్షరీ మంత్రంతో తల్లిని స్మరిస్తే ముక్తిని ప్రసాదిస్తుంది.
మహాలక్ష్మి: వైకుంఠుని ఇల్లాలు. బ్రహ్మాదుల చేత, సామన్యుల చేత, అసామాన్యుల చేత పూజించబడుతుంది. సముద్రరాజతనయ. చంద్రుని తోబుట్టువు. అమృతమథనంలో ఆవిర్భవించి మహావిష్ణువును చేపట్టిన మహాశక్తి.
గాయత్రీదేవి: ‘‘ఓం భూర్భువః .... అంటూ ఉపాసించబడే సంధ్యాదేవత. ఈ మాతను ఉపాసించిన వారికి సర్వావస్థలలోనూ విజయమే సిద్ధిస్తుంది. ఇహపరాలసుఖసంతోషాలను ప్రసాదించే కరుణామయి- గాయత్రిమాత.
అన్నపూర్ణ : సర్వుల క్షుద్బాధను పోగొట్టేతల్లి. సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులుగా నొనర్చు కరుణామయి, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి. అన్నరూపంగా జీవులలో ప్రవేశించి, శుక్ల శోణితములుగా మారి, జీవోత్పత్తి జరుపేశక్తే అన్నపూర్ణ. జగన్మాత అన్నపూర్ణాదేవి.
లలితాదేవి: బ్రహ్మాండాలన్నీ లయమైపోయాక చివరకు నిలిచి ఉండే బిందువే శక్తి ‘‘చింతామణి గృహాంతస్థా’’ అన్న నామాన్ని పరిపూర్ణమైన ఏకాగ్రతతో విశ్వాసంతో పఠించినవారికి చింతితార్థములన్నీ ప్రాప్తింపచేసే కరుణాలవల్లి. పురాణాలు ఈ తల్లిని ‘‘నమోదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్’’ అని స్తుతించమంటాయ
సరస్వతి: విద్యాధిదేవత. వీణ, చిలుక, పుస్తకం, అక్షరమాలను ధరించిన చతుర్భుజి . మూలానక్షత్రం, సప్తమి తిథినాడు పూజించబడే తల్లి. అపార కృపామయ. వ్యావహారికజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక విజ్ఞానాన్నిచ్చి, మనిషిలోని దైవీశక్తిని పెంపొందించి,మనిషి మహనీయుడుగా చేస్తుందీ తల్లి.
దుర్గ: దుఃఖేన గమ్యతి ఇతి దుర్గం ప్రయాసము చేత పొందబడినా ఈ తల్లి దుష్టులను దునుమాడుతుంది. దుర్గమాలను అధిగమింప చేస్తుంది. దుర్మార్గులను మట్టుపెడుతుంది. దుర్గగా భావించే ఈ ఆదిపరాశక్తి రూపాన్ని కొలిచినవారికి లేమి ఉండదు. అన్నింటా విజయమే ప్రాప్తిస్తుంది. అష్టమినాడు ఈతల్లిని కొలవడం సంప్రదాయం.
మహిషాసురమర్దిని: త్రిమూర్తులకే లొంగని మహిషుడిని తన శక్తితో మట్టుపెట్టి మహిషాసుర మర్దనిగా ప్రఖ్యాతి పొందింది. ‘సురవర వర్షిణి, దుర్ధరధర్షిణి, దుర్ముఖిమర్షిణి హర్షరతే, త్రిభువన పోషిణి శంకర తోషిణి, కల్మషమోచని ఘోరరతే దనుజ నిరోషిణి దుర్మద శోషిణి దుఃఖ నివారిణి సింధునుతే... జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యకపర్దిని శైలసుతే...’’- మహిషాసుర మర్దినీ నమస్తే నమస్తే అని స్మరించినవారినెల్లా ఎల్లవేళలా కాపాడే తల్లి
రాజరాజేశ్వరి: ముల్లోకాల్లో తన సామ్రాజ్యాన్ని స్థిరీకరించుకున్న తల్లి. తన భక్తులకు సామ్రాజ్య పదవికన్న మిన్నయైన ఆత్మానందాన్ని అనుగ్రహించే, జగజ్జనని- శ్రీ రాజరాజేశ్వరి. అభిన్నమైన శక్తితత్త్వం, ఈశ్వరతత్త్వాల ఏకరూపమే శ్రీ రాజరాజేశ్వరీ దేవి.
ఇట్లా ఆదిపరాశక్తిని తొమ్మిదిరూపాల్లో తొమ్మిది దినాల్లో పూజించిన వారికి ఇహపరసుఖాలు మెండుగా లభిస్తాయ.

- చివుకుల రామమోహన్