Others

మాలధారణం.. నియమాల తోరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటూ కార్తికంలో స్వామి అయ్యప్ప పూజలు చేస్తారు. మణికంఠుడు, పందళరాజకుమారుడు, హరిహరపుత్రన్, అయ్యన్, అర్యన్, పూరణైకళ్వన్, పుట్కళైమణాళన్, అరతె్తైక్కాప్పోన్, కోయికొడియోన్, శాత్తన్, వెల్లైయానైవాహనన్, కారి, చెండాయుధన్, యోగి, కడల్‌నిరవణ్ణన్ అను పలు నామమలు స్వామికి ఉన్నా అయ్యప్ప నామమే ప్రసిద్ధి. ఒకానొక కాలంలో పందళరాజుకు అడవిలో మణిహారముతో అయ్యప్పస్వామి కనిపించాడట. అప్పటిదాకా బిడ్డలు లేని ఆరాజు భగవంతుడే తనకు ఈ కుమా రుణ్ణిని ప్రసాదించాడని భగవంతునికి నమస్కారం చేసి తన ఇంటికి తీసుకెళ్లి అల్లారుముద్దుగా పెంచుకున్నాడు. కాని అతని భార్య మాత్రం మణికంఠునిపై పగ పెంచుకుంది. ఓ సారి తనకు తలనొప్పి వచ్చిందని ఆ తలనొప్పి పులిపై ఎక్కి పులిపాలు తెచ్చి సేవిస్తేనే పోతాయని అందుకు ఈ మణికంఠుని పంపించాలని పట్టుపట్టింది. అపుడు ఆ మణికంఠుని తల్లి కోరికపై అడవికి వెళ్లి పులిపై ఎక్కి వస్తూ పులిపాలను తెచ్చి ఇచ్చాడట.
క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృతాన్ని పంచడానికి మహావిష్ణువు మోహినీ అవతారుడ య్యాడు. ఆ మోహినీ విలాసం చూచి పరమశివుడు మోహపరవశుడయ్యాడు. ఆ మోహినీ అవతారం తో స్నేహం చేసి హరహరసుతుని ఆవిర్భావానికి నాంది పలికాడు. అలా శివకేశవుల బిడ్డడిగా ఈ అయ్యప్ప సృజయంచబడ్డాడు. కొన్నాళ్ల తరువాత తాను వచ్చిన కార్యం పూర్తి అయందని తాను ఇక నిజవాసానికి వెళ్తానని తన తండ్రితో చెప్పాడు మణికంఠుడు. అయ్యపై ప్రేమను పెంచుకున్న ఆ తండ్రి నిను విడిచి నేను ఉండలేననే బాధను వ్యక్తంచేసాడు. ఆ తండ్రితోపాటు సకల జనులు స్వామిని చూడకుండా మనలేమని చెప్పారు. దాంతో అపారకృపావత్సలుడైన స్వామి నేను ప్రతి మకర సంక్రాంతి నాడు తాను జ్యోతిరూపంగా దర్శనమిస్తానని అభయం ఇచ్చాడు అందుకనే నేటికీ ఈ అయ్యప్ప దర్శనం జ్యోతిదర్శనంగా సంభావించ బడుతోంది. అయ్యప్ప భక్తులంతా మాలను ధరించి మండలం రోజులు పూజలు చేసి మకరసంక్రాంతి రోజున జ్యోతి దర్శనం చేసుకొంటారు. ఆబాల గోపాలమూ ఈ జ్యోతి దర్శనంతో పులకాంకి తులవుతారు.
మాలధారణ
గురుస్వాముల వారి ఆశీస్సులతో మాలాధారణ చేస్తారు. 41దినముల కఠిన కఠోర దీక్షను చేపట్టిన వారు, నల్లనివస్త్రాలు ధరిస్తారు. కఠిన నియ మాలను సంతోషంగా పాటిస్తారు. ప్రతివారిని అయ్యప్ప స్వామిగా తలుస్తారు. సంబోధన సమయంలోనూ స్వామి అన్న సంబోధనకే ప్రాధాన్యం ఇసా తరు.
స్వామి దర్శనానికి వెళ్లినపుడు ముందు పంబాగణపతి స్వామి దర్శనం చేసుకుని అక్కడ టెంకాయ కొట్టి చిన్నపాదముతో శబరికొండ ఎక్కడ ప్రారంభిస్తారు. మార్గం మధ్యలో శరణ్‌గుత్తివద్ద కనె్నస్వాములు తమ వెంట తెచ్చిన బాణాలు గుచ్చుతుంటారు. శబరిమలకు చేరిన తరువాత 18మెట్లను నమస్కరిస్తూ ఎక్కి స్వామివారి సన్నిధానికి చేరుకుంటారు.
18వసారి దీక్షను చేపట్టి శబరిమలైకి పోయే స్వాములు విధిగా కొబ్బరిచెట్టుమొక్కను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయ్యప్ప మాల వేసిన కఠోర దీక్ష చేసి స్వామి వారిని ప్రసన్నం చేసుకున్న ప్రతివారి ఇంట లక్ష్మీ తాండవించడమే కాకుండా వారు మంచి మార్గం వైపు పయనిస్తుంటారని భక్తుల నమ్మకం విశ్వాసం.మొదటిసారి మాలధారణ చేసిన వారిని కనె్నస్వాములుగా, రెండవసారి మాలధారణ చేసినవారిని కత్తిస్వామి, మూడవసారి మాలధారణ చేసిన వారిని గంటస్వాములు, నాల్గవసారి మాలధారణ చేసిన వారిని గదస్వాములు, ఐదవసారి మాలధారణ చేసిన వారిని పెరుస్వాములు, ఆరవసారి దీక్షమాల వేసినవారిని గురుస్వాములు అని సంబోధిస్తుంటారు.

- సాయికృష్ణ