ధర్మసందేహాలు

వికర్ణునికి ప్రాచుర్యం లేదేమి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఈ విశ్వమంతకూ మూలాధారం ఎవరు? వనజ,హైదరాబాదు
కుండకు మూలాధారం మట్టి. కుండలానికి మూలాధారం బంగారం. అలాగే ఈ ప్రపంచం మొత్తానికి కారణభూతమైన మూల పదార్థం ఏదో విచారించి తెలుసుకుంటే అదే విశ్వానికి మూలాధారం అని చెప్పవచ్చు. ఆ విచారణ కోసం ఏర్పడినవే ఉపనిషత్తులు. వాటి బోధనల ప్రకారం నిత్య సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ ఈ ప్రపంచానికి మూలాధారం.
* పురాణాలలో కొందరు సద్యోగర్భంలో జన్మించినట్లు వుంది. సద్యోగర్భం అంటే ఏమిటి? (స్వామిరామానందస్వామి, పొదలకొండపల్లె)
కొంతమంది తల్లులు యోగ ప్రభావంవలన గానీ, దేవతా వరప్రభావంవలన గానీ అప్పటికప్పుడే గర్భాన్ని ధరించి, కొద్ది నిమిషాలలోనే గర్భపరిపూర్ణతను సాధించి, అప్పటికప్పుడే ప్రసవాన్ని కూడా పొందుతారు. దీనే్న సద్యోగర్భం అంటారు. రామాయణంలో అంజనాదేవి, మహాభారతంలో ఉలూపి మొదలైనవారు సద్యోగర్భ విధానంలో సంతానాన్ని పొందారని కనిపిస్తోంది.
* దశావతారాలలో నరసింహస్వామి పూర్ణావతారం కానప్పటికీ ఆయనకి అనేక ఆలయాలున్నాయి. ఇది ఎలా సాధ్యం? (శివాజీరావు, చైతన్యపురి, హైదరాబాద్)
ఒక అనంత సంఖ్యలోంచి మరొక అనంత సంఖ్యను విడదీస్తే మళ్ళీ అనంత సంఖ్యే మిగులుతుంది. అందువల్ల పరిపూర్ణ పరమాత్మలోని అంశలన్నీ కూడా నిజానికి అనంతమైనవే. పరిపూర్ణావతారము అనేది స్తుతికోసం ఏర్పడిన మాట తప్పితే శ్రీహరి అవతారాలలో పరిపూర్ణం కానిది లేదు.
* మహాభారత కథలో కర్ణుడికి వచ్చిన ప్రాచుర్యం కౌరవ వంశీకులలో అందరికంటే ధర్మప్రవర్తనుడైన వికర్ణుడికి రాలేదు. ఎందువల్ల? (శివాజీరావు, చైతన్యపురి, హైద్రాబాద్)
వికర్ణుడు ద్రౌపదీవస్త్రాపహరణ ఘట్టంలో ధైర్యంగా నిలబడి అధర్మాన్ని ఖండించిన మాట నిజమే గానీ, అతడు విభీషణుడి లాగా ధర్మంకోసం ప్రాణత్యాగానికి సిద్ధపడినవాడు కాదు. అదీ కాక విశిష్టమైన వ్యక్తిత్వం కలవాడు కూడా కాదు. అందుకే అన్నల వెంట నడిచి అల్పాయువై అల్పకీర్తితోనే శరీరాన్ని చాలించాడు.
* దృతరాష్ట్రుడు విగతజీవుడైనపుడు అంత్యక్రియలు ధర్మరాజు చేసి వుంటాడా? శివాజీరావు, చైతన్యపురి, హైదరాబాద్
ధర్మరాజు ఉభయ పక్షాలలోని సైనికులందరికీ అపరకర్మలు చేయించాడు. దుర్యోధనాదులకు తనే చేశాడు. అలాంటివాడు ధృతరాష్ట్రుడికి చేయకుండా వుంటాడా? చేశాడనే భారతంలో వుంది.
* సంన్యాస స్వీకారం చేసినవారికి అపరకర్మలు వుండవా? సందేహాల రావు, ఆమనగల్లు
సంన్యాసం స్వీకరించేవారు ఆ ప్రక్రియలో భాగంగా ఆత్మశ్రాద్ధం చేసుకుంటారు. అందువల్ల ఇక వారు శరీరాన్ని వదిలిపెట్టినపుడు పితృదేవతా సంబంధమైన అపరకర్మలు వుండవు. కానీ వారి పైతరాలవారికి, కింది తరాలవారికి పితృదేవతా అనుసంధానం జరిగేందుకోసం సపండీకరణ ప్రక్రియ మాత్రం వుంటుంది. సంన్యాసి మరణంవల్ల బంధువులకు అశౌచం వుండదు.
* వటపత్రశాయి ఎవరు? శ్రీవెంకటరమణయ్య, కావలి
దేవాధిదేవుడైన శ్రీమహావిష్ణువు రూపాంతరమే వటపత్రశాయి.