ఆటాపోటీ

ఈత కొలను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈత కొలనులో నీళ్లు స్థిరంగా ఉంటాయని అనుకుంటారు. కానీ, అది నిజంకాదు. నీరు స్థిరంగా ఉంటే, పోటీదారులు పూల్‌లోకి దూకిన వెంటనే వాటికి నలువైపులా ఉండే గోడలకు తగిలి నీరు అలల రూపంలో ఎదురు వస్తాయి. అందుకే, ఒత్తిడికి గురైనప్పుడు నీరు సైడ్ వాల్స్ నుంచి బయటకు వెళ్లిపోతుంది. మరోవైపు నుంచి కొత్త నీరు పూల్స్‌లోకి చేరుతుంది. స్విమ్మర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాట్లు జరుగుతాయి.
బ్రెస్ట్ స్ట్రోక్, బటర్‌ఫ్లై స్ట్రోక్ ఈవెంట్స్‌లో స్విమ్మిర్లు రేస్‌ను పూర్తి చేసినప్పుడు రెండు చేతులతోనూ పూల్‌ను తాకాలి. ఫ్రీస్టయిల్, బ్రెస్ట్ స్ట్రోక్ ఈవెంట్స్‌లో మాత్రం ఒకే చేత్తో ఫినిషింగ్ ఆబ్జెక్ట్‌ను తాకుతారు.
స్విమ్మింగ్ వల్ల ఊపిరి తిత్తులు, గుండె బలపడతాయి. అన్ని కీలక కండరాలు విస్తరించుకుంటాయి. దీనితో మనిషిలో ఉత్సాహం పెరుగుతుంది. అంతేకాదు... స్విమ్మింగ్ వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. వివిధ కారణాల వల్ల మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారు తప్పనిసరిగా ఈతకొట్టాలి.
పరిగెత్తినప్పుడు గాలికి ఎదురువేళ్లాలి. ఎంత వేగంగా పరిగెడితే, అంత వేగంగా గాలి మనల్ని వెనక్కు నెడుతుంది. దానిని ఛేదిస్తూ ముందుకు సాగాలి. స్విమ్మింగ్ చేసేటప్పుడు నీరు అదే విధంగా మనిషిని వెనక్కు నెడుతుంది. గాలితో పోలిస్తే నీరు పది రెట్లు ఎక్కువ శక్తితో పని చేస్తుంది. అందుకే, స్విమ్మింగ్ చేసేటప్పుడు ఎక్కువ క్యాలరీల శక్తి ఖర్చవుతుంది.